3జీబి ర్యామ్ గోల్డ్ ఎడిషన్ ఫోన్ రూ.7,499కే

Written By:

ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ Coolpad తన కూల్‌ప్యాడ్ నోట్ 3 లైట్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి గోల్డ్ ఎడిషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ధర రూ.7,499.

3జీబి ర్యామ్ గోల్డ్ ఎడిషన్ ఫోన్ రూ.7,499కే

భారత్‌లో 5 లక్షల నోట్ లైట్ ఫోన్‌లను విక్రయించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ ప్రత్యేక లిమిటెడ్ ఎడిషన్ ఫోన్‌లను కూల్‌ప్యాడ్ అందుబాటులోకి తీసుకువచ్చింది. కూల్‌ప్యాడ్ నోట్ 3 లైట్ గోల్డ్ ఎడిషన్ ఫోన్‌లను Amazon ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. ఈ స్పెషల్ ఎడిషన్ ఫోన్‌లను భారత్‌లో మాత్రమే విక్రయిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

Read More : అంతరిక్షంలోకి వెళ్లిన కుక్కలు ఏమయ్యాయి..?

3జీబి ర్యామ్ గోల్డ్ ఎడిషన్ ఫోన్ రూ.7,499కే

నోట్ 3 ఫోన్‌కు సక్సెసర్ వర్షన్‌గా వచ్చిన నోట్ 3 లైట్ జనవరిలో మార్కెట్లో విడుదలయ్యింది. ధర రూ.6,999. సత్తా చాటే స్పెసిఫికేషన్‌లతో మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను ఈ హ్యాండ్‌సెట్ ఊరిస్తోంది. 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ప్రత్యేకతలతో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల ప్రపంచంలో సరికొత్త ఒరవడికి నాంది పలికిన నోట్ 3 లైట్ ఫోన్‌లోని 10 ఆసక్తికర ఫీచర్లను మీ ముందుకు తీసుకురావటం జరుగుతోంది...

Read More : రూ.1కే LeEco లీ2 ఫోన్, త్వరపడండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫింగర్ ప్రింట్ స్కానర్

కూల్‌ప్యాడ్ నోట్ 3 లైట్ ప్రత్యేకతలు

నోట్ 3 లైట్ ఫోన్‌లో ఏర్పాటు చేసిన ఫింగర్ ప్రింట్ స్కానర్ వేగవంతంగా స్పందించే ఫింగర్ ప్రింట్ రికగ్నిషన్ టెక్నాలజీతో అత్యుత్తమ పనితీరును కనబరుస్తుంది. ఫోన్ రేర్ కెమెరా క్రింద ఏర్పాటు చేసిన ఈ దీర్ఘ చతురస్రాకార ఫింగర్ ప్రింట్ సెన్సార్ 5 ఫింగర్ ప్రింట్‌ల వరకు రిజిస్టర్ చేసుకోగలదు.

ఫోన్ వెనుక భాగం

కూల్‌ప్యాడ్ నోట్ 3 లైట్ ప్రత్యేకతలు

ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన Textured బ్యాక్ ప్యానల్, యూజర్ చేతిలో ఫోన్‌ను సౌకర్యవంతంగా ఇమిడేలా చేస్తుంది. ఫోన్ చుట్టూతా ఏర్పాట చేసిన గోల్డెన్ రిమ్ ఆకట్టుకుంటుంది. తక్కువ బరువు, కంఫర్టబుల్ డిజైనింగ్ వంటి అంశాలు ఫోన్ వినియోగాన్ని మరింత సౌకర్యవతం చేస్తాయి.

డిస్‌ప్లే

కూల్‌ప్యాడ్ నోట్ 3 లైట్ ప్రత్యేకతలు

నోట్ 3 లైట్ ఫోన్ 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది. రిసల్యూషన్ సామర్థ్యం 1280x720పిక్సల్స్. ఈ డిస్‌ప్లే ద్వారా విజువల్స్‌ను హైక్వాలిటీ అనుభూతులతో ఆస్వాదించవచ్చు.

ప్రాసెసర్

కూల్‌ప్యాడ్ నోట్ 3 లైట్ ప్రత్యేకతలు

నోట్ 3 లైట్ ఫోన్‌లో శక్తివంతమైన 64 బిట్ మీడియాటెక్ ఎంటీ6735 క్వాడ్‌కోర్ చిప్‌సెట్‌ను నిక్షిప్తం చేసారు. ప్రాసెసర్ క్లాక్ వేగం 1.3గిగాహెర్ట్జ్. ఈ క్వాడ్‌కోర్ చిప్‌సెట్ స్మూత్ మల్టీ టాస్కింగ్‌కు దోహదపడుతుంది.

3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ

కూల్‌ప్యాడ్ నోట్ 3 లైట్ ప్రత్యేకతలు

నోట్ 3 లైట్ ఫోన్ 3జీబి ర్యామ్‌తో వస్తోంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌లో ఈ స్థాయి ర్యామ్ పొందుపరచటమనేది చాలా గొప్ప విషయం. ఈ ర్యామ్ సహకారంతో ఫోన్ మల్టీటాస్కింగ్ అదరహో అనిపిస్తుంది. 16జీబి ఇంటర్నల్ మెమరీ ఫోన్ స్టోరేజ్ డిపార్ట్‌మెంట్‌ను మరింత బలోపేతం చేసింది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు

కెమెరా

కూల్‌ప్యాడ్ నోట్ 3 లైట్ ప్రత్యేకతలు

నోట్ 3 లైట్ స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను పొందుపరిచారు. ఈ కెమెరాల ద్వారా హైక్వాలిటీ ఫోటోగ్రఫీని యూజర్లు ఆస్వాదించవచ్చు.

ఆపరేటింగ్ సిస్టం

కూల్‌ప్యాడ్ నోట్ 3 లైట్ ప్రత్యేకతలు

నోట్ 3 లైట్ స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆధారంగా డిజైన్ చేసిన కూల్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను పొందుపరిచారు.

రెండు కలర్ వేరియంట్‌లలో

కూల్‌ప్యాడ్ నోట్ 3 లైట్ ప్రత్యేకతలు

నోట్ 3 లైట్ స్మార్ట్‌ఫోన్‌ 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది. నోట్ 3 లైట్ స్మార్ట్‌ఫోన్‌ రెండు కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. అందులో ఒకటి చాంపేన్ వైట్ మరోకటి బ్లాక్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Limited Edition Gold Variant of Coolpad Note 3 Lite launched at Rs 7,499. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot