రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న స్మార్ట్‌ఫోన్‌లు..టాబ్లెట్‌ల వివరాలు!
సామ్‌సంగ్ గెలాక్సీ వై డ్యుయోస్ లైట్, గెలాక్సీ ఎస్ డ్యుయోస్ (Samsung Galaxy Y Dous Lite and Galaxy S Duos):

ప్రపంచపు అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ సామ్‌సంగ్ బుధవారం రెండు సరికొత్త డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. గెలాక్సీ వై డ్యుయోస్, గెలాక్సీ ఎస్ డ్యుయోస్ మోడళ్లలో డిజైన్ కాబడిన ఈ బడ్జెట్ ఫ్ఱెండ్లీ హ్యాండ్‌సెట్‌లు స్టైల్ ఇంకా హుందా అయిన పనితీరును ఒదిగి ఉన్నాయి.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ డ్యుయోస్:
డ్యూయల్ సిమ్, 4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెర్జ్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్, 5 మెగాపిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 768ఎంబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు: వై-ఫై, బ్లూటూత్ 3.0, 3జీ, 1,500ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ. ధర రూ.17,900.
సామ్‌సంగ్ గెలాక్సీ వై డ్యుయోస్ లైట్:
డ్యూయల్ సిమ్, ఫోన్ చుట్టుకొలత 103.5 x 58 x 12మిల్లీమీటర్లు, 2.8 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 240 x 320పిక్సల్స్), ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 832మెగాహెర్జ్ ప్రాసెసర్, 2జీబి ఆన్‌బోర్డ్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పెంచుకునే సౌలభ్యత, 2 మెగాపిక్సల్ రేర్ కెమెరా, వై-ఫై b/g/n, వై-ఫై హాట్ స్పాట్, 3జీ, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, 1200ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ. ధర రూ.6,990.
కార్బన్ ఏ18 (Karbonn A18):
కార్బన్ తాజాగా విడుదల చేసిన డ్యూయల్ సిమ్ స్మార్ట్ ఫోన్ ‘కార్బన్ స్మార్ట్ ఏ18’ ఫీచర్లు:
4.3 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్ధ్యం 480 x 800పిక్సల్స్), డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెర్జ్ సింగిల్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 1జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 5 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, ఆటో ఫోకస్), 1.3 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియ్ చాటింగ్ నిర్వహించుకునేందుకు), వై-ఫై, వై-ఫై హాట్‌స్పాట్, 3జీ, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ (టాక్‌టైమ్ 5 గంటలు, స్టాండ్ బై 200 గంటలు). ప్రీలోడెడ్ అప్లికేషన్స్ (ఫేస్‌బుక్, వాట్స్ అప్, కార్బన్ స్మార్ట్ బ్రౌజర్, కింగ్‌సాఫ్ట్ ఆఫీస్, నెక్స్ జీటీవీ, పే టీఎమ్), ధర రూ.9,790.


Click it and Unblock the Notifications