అర‌చేతిలో ఫిట్ అయ్యే బెస్ట్ కాంపాక్ట్ Smartphoneలు ఇవే! ఓ లుక్కేయండి!

|

ప్ర‌స్తుత త‌రుణంలో Smartphone లు చాలా మందికి నిత్య‌వ‌స‌ర గ్యాడ్జెట్లుగా మారిపోయాయి. యూజ‌ర్లు త‌మ అవ‌స‌రానికి, బ‌డ్జెట్‌కు అనుగుణంగా Android లేదా iOS స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తున్నారు. ఈ క్ర‌మంలో స్మార్ట్‌ఫోన్‌లు విభిన్న ఫీచ‌ర్లు, విభిన్న పరిమాణాలు, అనేక ధరల‌ పరిధుల్లో వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉన్నాయి.

 
అర‌చేతిలో ఫిట్ అయ్యే బెస్ట్ కాంపాక్ట్ Smartphoneలు ఇవే! ఓ లుక్కేయండి!

మీరు గ‌న‌క‌ చిన్న సైజులో ఉండే, కాంపాక్ట్ Smartphone ల కోసం చూస్తున్నట్లయితే - గిజ్‌బాట్ మీ కోసం ఆ కోవకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను అందిస్తోంది. Android మరియు iOS సాఫ్ట్‌వేర్‌లలో అందుబాటులో ఉన్న కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను రూపొందించాము. కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితా గురించి మీరు తెలుసుకోవలసిన ప్రతి అంశం ఇక్కడ ఉంది.

కాంపాక్ట్ జాబితాలో ముందుగా పేర్కొన్న విధంగా Android మరియు iOS డివైజ్‌లు రెండూ ఉన్నాయి. iOS డివైజ్‌ల విష‌యానికొస్తే.. ఇందులో iPhone 13 Mini, iPhone Se 2022 మరియు iPhone 12 Mini లు ఉన్నాయి. ఈ కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్‌లు శక్తివంతమైన ప్రాసెసర్‌లు, ప్రత్యేకమైన డిజైన్ మరియు ఇమ్మర్సివ్ డిస్‌ప్లేతో వస్తాయి. కెమెరాలు కూడా చాలా ఉన్నతంగా ఉన్నాయి. మీరు కాంపాక్ట్ ఆండ్రాయిడ్ ఫోన్‌ల కోసం చూస్తున్నట్లయితే, కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో కూడా మీ కోసం కూడా కొన్ని డివైజ్‌లు ఉన్నాయి. ఇందులో Google Pixel 3, Google Pixel 5 5g మరియు Samsung Galaxy S22 కూడా ఉన్నాయి.

ఈ కాంపాక్ట్ ఫోన్‌లు సింగిల్-హ్యాండ్ ఉపయోగం కోసం నిర్మించబడ్డాయి, ఇవి చిన్న చేతులు ఉన్నవారికి కూడా చాలా బాగా ఉంటాయి. డిజైన్ మరియు పనితీరును దృష్టిలో ఉంచుకుని కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితా తయారు చేయబడింది. వీటిపై ఓ లుక్కేయండి.

iPhone 13 Mini స్పెసిఫికేష‌న్లు:

iPhone 13 Mini స్పెసిఫికేష‌న్లు:

ఈ iPhone 13 Mini కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్ ధ‌ర భార‌త మార్కెట్లో రూ.64,990 అందుబాటులో ఉంది.
* ఇక ఈ మొబైల్ స్పెసిఫికేష‌న్ల విషయానికొస్తే.. 5.4 అంగుళాల డిస్‌ప్లేను అందిస్తున్నారు. 4 జీబీ ర్యామ్| 128 జీబీ, 256జీబీ, 512 జీబీ జీబీఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ కెపాసిటీల‌ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ యాపిల్ ఐఓఎస్ 15 పై ప‌నిచేస్తుంది. దీనికి బ్యాక్ సైడ్ డ‌బుల్‌ కెమెరాల‌ ఫీచ‌ర్‌ను క‌ల్పించారు. ప్ర‌ధానంగా 12MP + 12MP క్వాలిటీతో కెమెరాల‌ని ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 12 మెగా పిక్సెల్‌ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 2438mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు.

iPhone SE (2022) స్పెసిఫికేష‌న్లు:
 

iPhone SE (2022) స్పెసిఫికేష‌న్లు:

ఈ iPhone SE (2022) కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్ ధ‌ర భార‌త మార్కెట్లో రూ.43,990 అందుబాటులో ఉంది.
* ఇక ఈ మొబైల్ స్పెసిఫికేష‌న్ల విషయానికొస్తే.. 4.7 అంగుళాల డిస్‌ప్లేను అందిస్తున్నారు. 64 జీబీ, 128 జీబీ, 256జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ కెపాసిటీల‌ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ యాపిల్ ఐఓఎస్ 15 పై ప‌నిచేస్తుంది. దీనికి బ్యాక్ సైడ్ సింగిల్‌ కెమెరా ఫీచ‌ర్‌ను క‌ల్పించారు. ప్ర‌ధానంగా 12MP క్వాలిటీతో వైడ్ యాంగిల్ కెమెరాని ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 7 మెగా పిక్సెల్‌ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 2018mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు.

iPhone 12 Mini స్పెసిఫికేష‌న్లు:

iPhone 12 Mini స్పెసిఫికేష‌న్లు:

ఈ iPhone 12 Mini కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్ ధ‌ర భార‌త మార్కెట్లో రూ.49,999 అందుబాటులో ఉంది.
* ఇక ఈ మొబైల్ స్పెసిఫికేష‌న్ల విషయానికొస్తే.. 5.4 అంగుళాల డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఈ మొబైల్ యాపిల్ ఐఓఎస్ 14.1 (ఏ14 బ‌యోనిక్ చిప్‌) పై ప‌నిచేస్తుంది. దీనికి బ్యాక్ సైడ్ డ‌బుల్‌ కెమెరాల‌ ఫీచ‌ర్‌ను క‌ల్పించారు. ప్ర‌ధానం 12MP+12MP క్వాలిటీతో కెమెరాల‌ని ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 12 మెగా పిక్సెల్‌ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 2227mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు.

Google Pixel 5 5G స్పెసిఫికేష‌న్లు:

Google Pixel 5 5G స్పెసిఫికేష‌న్లు:

ఈ Google Pixel 5 కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్ ధ‌ర భార‌త మార్కెట్లో రూ.41,000 అందుబాటులో ఉంది.
* ఇక ఈ మొబైల్ స్పెసిఫికేష‌న్ల విషయానికొస్తే.. 6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను అందిస్తున్నారు. 8 జీబీ ర్యామ్| 128జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ కెపాసిటీల‌ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ Octa Core with Snapdragon 765G 7nm ప్రాసెస‌ర్‌పై ప‌నిచేస్తుంది. దీనికి 12.2MP+ 16MP క్వాలిటీతో ప్ర‌ధాన కెమెరాని ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 8 మెగా పిక్సెల్‌ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు.

Google Pixel 3 స్పెసిఫికేష‌న్లు:

Google Pixel 3 స్పెసిఫికేష‌న్లు:

ఈ Google Pixel 3 కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్ ధ‌ర భార‌త మార్కెట్లో రూ.19,050 అందుబాటులో ఉంది.
* ఇక ఈ మొబైల్ స్పెసిఫికేష‌న్ల విషయానికొస్తే.. 5.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను అందిస్తున్నారు. 4 జీబీ ర్యామ్| 64 జీబీ, 128జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ కెపాసిటీల‌ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ Snapdragon 845 Octa-Core ప్రాసెస‌ర్‌పై ప‌నిచేస్తుంది. దీనికి 12.2MP క్వాలిటీతో ప్ర‌ధాన కెమెరాని ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 8 మెగా పిక్సెల్‌ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 2915mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు.

Samsung Galaxy S22 స్పెసిఫికేష‌న్లు:

Samsung Galaxy S22 స్పెసిఫికేష‌న్లు:

ఈ Samsung Galaxy S22 కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్ ధ‌ర భార‌త మార్కెట్లో రూ.72,999 అందుబాటులో ఉంది.
* ఇక ఈ మొబైల్ స్పెసిఫికేష‌న్ల విషయానికొస్తే.. 6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను అందిస్తున్నారు. 8 జీబీ ర్యామ్| 128జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ కెపాసిటీల‌ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ Octa Core with Snapdragon 765G 7nm ప్రాసెస‌ర్‌పై ప‌నిచేస్తుంది. దీనికి 12.2MP+ 16MP క్వాలిటీతో ప్ర‌ధాన కెమెరాని ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 8 మెగా పిక్సెల్‌ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 3700mAh/ 4,500 mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు.

Samsung Galaxy Z Flip4 5G స్పెసిఫికేష‌న్లు:

Samsung Galaxy Z Flip4 5G స్పెసిఫికేష‌న్లు:

ఈ Samsung Galaxy Z Flip4 5G కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్ ధ‌ర భార‌త మార్కెట్లో రూ.1,54,999 అందుబాటులో ఉంది.
* ఇక ఈ మొబైల్ స్పెసిఫికేష‌న్ల విషయానికొస్తే.. 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ AMOLED డిస్‌ప్లేను అందిస్తున్నారు. 12జీబీ ర్యామ్| 512జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ కెపాసిటీల‌ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ Qualcomm Snapdragon 8+ Gen1 4nm ప్రాసెస‌ర్‌పై ప‌నిచేస్తుంది. దీనికి 12MP+ 12MP క్వాలిటీతో ప్ర‌ధాన కెమెరాని ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 10 మెగా పిక్సెల్‌ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 3700mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు.

Best Mobiles in India

English summary
List Of Compact Android And iOS Smartphones To Buy In India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X