కొత్త లిస్ట్..ఆండ్రాయిడ్ ఓరియో అప్‌డేట్ ఈ ఫోన్లకే !
లేటెస్ట్‌గా ఓరియో అప్‌డేట్ పొందిన ఫోన్ల వివరాలు ఇవే.
గూగుల్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 8 ఓరియోను ఆగస్టులో లాంచ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ కొత్త ఓఎస్ అప్‌డేట్‌ను మొబైల్ తయారీ కంపెనీలు అందించేందుకు కసరత్తులు చేస్తున్నాయి. ఇప్పటికే పలు ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ ఓఎస్ చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు మళ్లీ లేటెస్ట్‌గా ఈ ఓఎస్ అప్‌డేట్ పొందిన ఫోన్ల వివరాలు బయటకు వచ్చాయి. అవేంటో మీరే చూడండి.

మోటోరోలా
మోటో జడ్, మోటో జడ్ డ్రాయిడ్, మోటో జడ్ ఫోర్స్ డ్రాయిడ్, మోటో జడ్ ప్లే, మోటో జడ్ ప్లే డ్రాయిడ్, మోటో జడ్2 ప్లే, మోటో జడ్2 ఫోర్స్ ఎడిషన్, మోటో ఎక్స్4, మోటో జీ5, మోటో జీ5 ప్లస్, మోటో జీ5ఎస్, మోటో జీ5ఎస్ ప్లస్, మోటో జీ4 ప్లస్ ఫోన్లు ఆండ్రాయిడ్ 8 ఓరియో అప్‌డేట్ పొందనున్నాయి.

హెచ్‌టీసీ
హెచ్‌టీసీ యూ11, యూ అల్ట్రా, 10 ఫోన్లకు ఆండ్రాయిడ్ 8 ఓరియో అప్‌డేట్ లభ్యం కానుంది.

సోనీ
ఎక్స్‌పీరియా ఎక్స్, ఎక్స్‌పీరియా ఎక్స్ పెర్ఫార్మెన్స్, ఎక్స్‌పీరియా ఎక్స్‌జడ్, ఎక్స్ కాంపాక్ట్, ఎక్స్‌జడ్ ప్రీమియం, ఎక్స్‌జడ్‌ఎస్, ఎక్స్‌పీరియా ఎక్స్‌ఏ1, ఎక్స్‌ఏ1 అల్ట్రా, ఎక్స్‌పీరియా టచ్, ఎక్స్‌పీరియా ఎక్స్‌ఏ1 ప్లస్ ఫోన్లకు ఆండ్రాయిడ్ కొత్త ఓఎస్ అప్‌డేట్ విడుదల కానుంది.

ఎల్‌జీ
ఎల్‌జీ జీ6, క్యూ6, క్యూ6 ప్లస్, వి30, వి20 ఫోన్లకు ఆండ్రాయిడ్ 8 అప్‌డేట్ రానుంది.

శాంసంగ్
గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్, ఎస్8 యాక్టివ్, నోట్ 8, ఎస్7, ఎస్7 ఎడ్జ్, ఎస్7 యాక్టివ్, ఎ7 (2017), ఎ5 (2017), ఎ3 (2017), జె7 (2017), జె7 ప్రొ, జె5 (2017), జె5 ప్రొ, జె7 మ్యాక్స్, సీ9 ప్రొ, సీ7 ప్రొ, ట్యాబ్ ఎస్3 డివైస్‌లకు ఆండ్రాయిడ్ 8 అప్‌డేట్ రానుంది.

నోకియా
నోకియా 3, 5, 6, 8 ఫోన్లు ఆండ్రాయిడ్ 8 అప్‌డేట్‌ను పొందనున్నాయి.

వన్‌ప్లస్
వన్‌ప్లస్ 5, వన్ ప్లస్ 3, 3టీ ఫోన్లకు ఆండ్రాయిడ్ 8 అప్‌డేట్ రానుంది.

షియోమీ
ఎంఐ 6, ఎంఐ మిక్స్ 2, ఎంఐ ఎ1, రెడ్‌మీ నోట్ 4, రెడ్‌మీ 4, రెడ్‌మీ 4ఎ, ఎం మ్యాక్స్ 2, ఎంఐ నోట్ 3 ఫోన్లకు ఆండ్రాయిడ్ 8 ఓరియో లభిస్తుంది.

హువాయి
హువాయి పీ10, మేట్ 9, మేట్ 9 ప్రొ, హానర్ 8 ప్రొ, హానర్ 8, హానర్ 8 లైట్, హానర్ 6ఎక్స్ లకు ఆండ్రాయిడ్ కొత్త ఓఎస్ లభిస్తుంది.

అసుస్
జెన్‌ఫోన్ 4, 4 ప్రొ, 4 మ్యాక్స్, 4 మ్యాక్స్ ప్రొ, 4 సెల్ఫీ, 4 సెల్ఫీ ప్రొ, జెన్‌ఫోన్ 3, 3 అల్ట్రా, 3 డీలక్స్, 3 లేజర్, 3 జూమ్, 3ఎస్ మ్యాక్స్, 3 మ్యాక్స్, జెన్‌ఫోన్ ఏఆర్ లలో ఆండ్రాయిడ్ 8 అప్‌డేట్ వస్తుంది.

లెనోవో
లెనోవో కె8 నోట్, కె8, కె8 ప్లస్ ఫోన్లకు ఆండ్రాయిడ్ 8 అప్‌డేట్ రానుంది.


Click it and Unblock the Notifications








