ఈ వారం కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్‌లు!

|

ఆధునిక కమ్యూనికేషన్ వినియోగం దేశవ్యాప్తంగా విస్తరించిన నేపధ్యంలో స్మార్ట్‌ఫోన్‌లకు క్రేజ్ పెరుగుతోంది. ఈ క్రమంలో మార్కెట్ సరికొత్త స్మార్ట్‌ఫోన్ మోడళ్లతో కళకళలాడుతోంది. ఇండియా వంటి ప్రధాన మార్కెట్‌లలో సామ్‌సంగ్, నోకియా, సోనీ, హెచ్‌టీసీ వంటి గ్లోబల్ బ్రాండ్‌లకు సంబంధించిన స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లు అత్యధికంగా అమ్ముడుపోతున్నాయి. ఏప్రిల్ రెండవ వారం నాటికి మార్కెట్లో ఆవిష్కరించబడ్డ కొత్త మొబైల్ ఫోన్‌ల వివరాలను నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా గిజ్‌బాట్ మీకు అందిస్తోంది.

మీ ఫోన్ త్వరగా చార్జ్ అవ్వాలంటే..?, కొన్ని సందర్భాల్లో మొబైల్ ఫోన్‌లు పూర్తిగా చార్జ్ అయ్యేందుకు నిర్ధేశిత సమయం కంటే అధిక సమయాన్ని తీసుకుంటాయి. అయితే, ఈ జాప్యానికి గల కారణాలు చాల మందికి తెలియదు. ఫోన్ వేగవంతంగా చార్జ్ అయ్యేందుకు పాటించాల్సిన నిబంధనలను ఇప్పుడు తెలుసుకుందాం. ఫోన్ వేగవంతంగా చార్జ్ అవ్వాలంటే సదరు చార్జర్‌ను నేరుగా అవుట్ లెట్‌కే అనుసంధానించండి.

కంప్యూటర్ ద్వారా చార్జింగ్ అంత ఉపయుక్తమైనది కాదు. చార్జింగ్‌కు సిద్ధమయ్యే క్రమంలో ఫోన్‌లో రన్ అవుతున్న అప్లికేషన్‌లను ఆఫ్ చేయటం మంచిది. ముఖ్యంగా జీపీఎస్, బ్లూటూత్ వంటి అప్లికేషన్‌లను టర్న్ ఆఫ్ చేయాలి. ఫోన్ స్ర్కీన్‌ను టర్న్ ఆఫ్ చేయండి. చార్జింగ్ సమయంలో మీ ఫోన్ వైబ్రేషన్ మోడ్‌లో ఉన్నట్లయితే సాధారణ సౌండ్ మోడ్‌కు తీసుకురండి. చార్జింగ్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో మ్యూజిక్ వినటం అంత శ్రేయస్కరం కాదు.

ఈ వారం కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్‌లు!

ఈ వారం కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్‌లు!

1.) సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 5.8, గెలాక్సీ మెగా 6.3 (Samsung Galaxy Mega 5.8 and Galaxy Mega 6.3):

సామ్‌సంగ్ రెండు సరికొత్త ఫాబ్లెట్‌లకు సంబంధించి అధికారిక ప్రకటనను ఈ వారంలో వెలువరించింది. గెలాక్సీ మెగా 5.8, గెలాక్సీ మెగా 6.3 మోడళ్లలో డిజైన్ కాబడిన ఈ గాడ్జెట్‌లు గెలాక్సీ ఎస్4 తరహా సాఫ్ట్‌వేర్ ఫీచర్లను కలిగి ఉన్నాయి.

గెలాక్సీ మెగా 6.3:

6.3 అంగుళాల ఎల్‌సీడీ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.7గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), ఇంటర్నల్ స్టోరేజ్ 8జీబి/16జీబి, 1.5జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత, బ్లూటూత్ 4.0, వై-ఫై, జీపీఎస్, గ్లోనాస్, ఐఆర్ సెన్సార్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 4జీ ఇంకా 3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గెలాక్సీ మెగా 6.8:

5.8 అంగుళాల ఎల్‌సీడీ క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్), 1.7గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా(వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్ 1.5జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత, బ్లూటూత్ 4.0, వై-ఫై, జీపీఎస్, గ్లోనాస్, ఐఆర్ సెన్సార్, 2600ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఇండియన్ మార్కెట్లో వీటి విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

ఈ వారం కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్‌లు!

ఈ వారం కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్‌లు!

2.) హెచ్‌టీసీ వన్ (HTC One):

రూ.42,900 ధరకు హెచ్‌టీసీ వన్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించటం జరిగింది. ఏప్రిల్ ఆఖరి వారం నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి.

ఫీచర్లు: 4.7 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ 3 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్(హైడెఫినిషన్ రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), 1.7గిగాహెట్జ్ క్వాడ్‌‌కోర్ క్వాల్కమ్ ఏపీక్యూ8064టీ స్నాప్‌డ్రాగెన్ 600 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 4 మెగా పిక్సల్ అల్ట్రాపిక్సల్ రేర్ కెమెరా విత్ బీఎస్ఐ సెన్సార్, 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 2జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ (32జీబి, 64జీబి), వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 4జీ కనెక్టువిటీ, హైస్పీడ్ హెచ్ఎస్‌పీఏ+, మైక్రోయూఎస్బీ, 2,300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ఈ వారం కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్‌లు!

ఈ వారం కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్‌లు!

3.) సోనీ ఎక్స్‌పీరియా ఎస్‌పి (Sony Xperia SP):

ఇండియన్ మార్కెట్ ధర రూ.27,490. ప్రధాన స్పెసిఫికేషన్‌లు:

4.6 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), రెటీనా డిస్‌ప్లే, మొబైల్ బ్రావియో ఇంజన్ 2 టెక్నాలజీ, 1.7గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.1జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా(ఆటో ఫోకస్, ఎక్స్‌మార్ ఆర్ఎస్ టెక్నాలజీ), వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ విత్ ఏ-జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 2370ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ఈ వారం కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్‌లు!

ఈ వారం కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్‌లు!

4.) ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్3 2 ఇంకా ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్7 2 (LG Optimus L3 2 and Optimus L7 2):

ప్రముఖ మొబైల్ బ్రాండ్ ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్3 2 ఇంకా ఆప్టిమస్ ఎల్7 2 మోడళల్లో రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఆప్టిమస్ ఎల్3 2 ధర రూ.8,800 కాగా ఆప్టిమస్ ఎల్7 2 ధర రూ.18,650.

ఆప్టిమస్ ఎల్3 2:

3.2 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 240 x 320పిక్సల్స్), 1గిగాహెట్జ్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, వై-ఫై, బ్లూటూత్, ఏ-జీపీఎస్, 1540ఎమ్ఏమెచ్ బ్యాటరీ.

ఆప్టిమస్ ఎల్7 2:

4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్), 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ5 ప్రాసెసర్, 768ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, 8మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), వై-ఫై, 3జీ కనెక్టువిటీ, బ్లూటూత్, 2460ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ఈ వారం కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్‌లు!

ఈ వారం కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్‌లు!

5.) నోకియా 105 (Nokia 105):

1.45 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే, 8ఎంబి మాస్ మెమెరీ, ఫ్లాష్ లైట్, ఎఫ్ఎమ్ రేడియో, 800ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (35రోజుల స్టాండ్‌బై, 12.5 గంటల టాక్‌టైమ్), ధర రూ.1249.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X