భార‌త మార్కెట్లో ఈ SmartPhones పై భారీగా ధ‌ర త‌గ్గింపు.. ఓ లుక్కేయండి!

|

ఇటీవ‌లి కాలంలో భార‌త‌ మార్కెట్లో ప్ర‌తి నెలా వివిధ కంపెనీల నుంచి ర‌క‌ర‌కాల‌ మోడ‌ల్ మొబైల్స్ విడుద‌ల అవుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో SmartPhones కొనుగోలుదారుల‌కు మొబైల్స్ ఎంపిక‌కు విస్తృత‌మైన అవ‌కాశాలు ఏర్ప‌డుతున్నాయి. అయితే, కొత్త మోడ‌ల్స్ వ‌చ్చే కొద్దీ, ఆయా కంపెనీలు పాత మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్ల అమ్మ‌కాల‌పై వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షించే ప్ర‌యత్నాలు చేస్తున్నాయి. పాత మోడ‌ల్ మొబైల్స్‌ను త‌క్కువ ధ‌ర‌ల్లో అందుబాటులో ఉంచుతున్నాయి. ఈ క్ర‌మంలో భారతదేశంలో ధర తగ్గింపు గ‌ల ప‌లు స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను మేము మీ ముందుకు తెచ్చాం. ఇందులో సరికొత్త ఫోన్‌లతో పాటు కాస్త పాత మోడల్స్ కూడా ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.

 
భార‌త మార్కెట్లో ఈ SmartPhones పై భారీగా ధ‌ర త‌గ్గింపు.. ఓ లుక్కేయండి!

భారతదేశంలోని ధ‌ర త‌గ్గించిన (ప్రైస్ డ్రాప్) స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో ఆపిల్ ఫోన్‌లు కూడా ఉన్నాయి. ఐఫోన్ 14 లాంచ్‌కు ముందే iPhone 13 మరియు iPhone 12 ఇటీవల భారతీయ మార్కెట్‌లో ధరలో తగ్గుదలని పొందాయి. మీరు iPhone ని పొందాలని ఆలోచిస్తున్నట్లయితే, వీటిని దృష్టిలో పెట్టుకోండి. ఇవే కాకుండా, అనేక Redmi మరియు Xiaomi ఫోన్‌లు కూడా ధర తగ్గింపు పొందాయి. భారతదేశంలో ధర తగ్గింపు స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో Redmi Note 10S మరియు Redmi Note 10T 5G ఉన్నాయి. ఇక వ‌న్‌ప్ల‌స్ కు చెందిన OnePlus 9 5G కూడా ధర తగ్గింపును పొందింది.

OnePlus 9 5G

OnePlus 9 5G

వ‌న్‌ప్ల‌స్ సంస్థ‌కు చెందిన OnePlus 9 5G మొబైల్ ప్ర‌స్తుతం రూ.7000 ధ‌ర త‌గ్గింపుతో అందుబాటులో ఉంది. ఆస‌క్తి ఉన్న‌వారు ఆ త‌గ్గింపు ధ‌ర‌కు ఈ మొబైల్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ఈ మొబైల్ కు 6.55 అంగుళాల ఫుల్‌ HD+ AMOLED పానెల్ డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఇది Octa Core Snapdragon 888 5nm ప్రాసెస‌ర్ క‌లిగి ఉంది. ఇది 8జీబీ ర్యామ్‌|128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ, 12జీబీ ర్యామ్| 256జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ కెపాసిటీల‌ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. దీనికి బ్యాక్ సైడ్ ట్రిపుల్‌ కెమెరాల‌ ఫీచ‌ర్‌ను క‌ల్పించారు. ప్ర‌ధానం 48MP + 50MP + 2MP క్వాలిటీతో కెమెరాల‌ని ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 16 మెగా పిక్సెల్‌ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4500mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది డ్యుయ‌ల్ సిమ్ స‌దుపాయాన్ని క‌లిగి ఉంది.

iPhone 13
 

iPhone 13

యాపిల్‌ సంస్థ‌కు చెందిన iPhone 13 మొబైల్ ప్ర‌స్తుతం రూ.9,901 ధ‌ర త‌గ్గింపుతో అందుబాటులో ఉంది. ఆస‌క్తి ఉన్న‌వారు ఆ త‌గ్గింపు ధ‌ర‌కు ఈ మొబైల్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ఈ మొబైల్ కు 6.1 అంగుళాల డిస్‌ప్లేను అందిస్తున్నారు. 4 జీబీ ర్యామ్| 256జీబీ, 512జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ కెపాసిటీల‌ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ యాపిల్ ఐఓఎస్ 15 పై ప‌నిచేస్తుంది. దీనికి బ్యాక్ సైడ్ డ‌బుల్‌ కెమెరాల‌ ఫీచ‌ర్‌ను క‌ల్పించారు. ప్ర‌ధానం 12MP + 12MP క్వాలిటీతో కెమెరాల‌ని ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 12 మెగా పిక్సెల్‌ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 3227mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు.

iPhone 12

iPhone 12

యాపిల్‌ సంస్థ‌కు చెందిన iPhone 12 మొబైల్ ప్ర‌స్తుతం రూ.12,500 ధ‌ర త‌గ్గింపుతో అందుబాటులో ఉంది. ఆస‌క్తి ఉన్న‌వారు ఆ త‌గ్గింపు ధ‌ర‌కు ఈ మొబైల్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ఈ మొబైల్ కు 6.1 అంగుళాల డిస్‌ప్లేను అందిస్తున్నారు. 4 జీబీ ర్యామ్| 64జీబీ, 128 జీబీ, 256జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ కెపాసిటీల‌ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ యాపిల్ ఐఓఎస్ 14.1 పై ప‌నిచేస్తుంది. దీనికి బ్యాక్ సైడ్ డ‌బుల్‌ కెమెరాల‌ ఫీచ‌ర్‌ను క‌ల్పించారు. ప్ర‌ధానం 12MP + 12MP క్వాలిటీతో కెమెరాల‌ని ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 12 మెగా పిక్సెల్‌ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 2815mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు.

iPhone 13 Mini

iPhone 13 Mini

యాపిల్‌ సంస్థ‌కు చెందిన iPhone 13 Mini మొబైల్ ప్ర‌స్తుతం రూ.5,000 ధ‌ర త‌గ్గింపుతో అందుబాటులో ఉంది. ఆస‌క్తి ఉన్న‌వారు ఆ త‌గ్గింపు ధ‌ర‌కు ఈ మొబైల్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ఈ మొబైల్ కు 5.4 అంగుళాల డిస్‌ప్లేను అందిస్తున్నారు. 4 జీబీ ర్యామ్| 128 జీబీ, 256జీబీ, 512 జీబీ జీబీఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ కెపాసిటీల‌ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ యాపిల్ ఐఓఎస్ 15 పై ప‌నిచేస్తుంది. దీనికి బ్యాక్ సైడ్ డ‌బుల్‌ కెమెరాల‌ ఫీచ‌ర్‌ను క‌ల్పించారు. ప్ర‌ధానం 12MP + 12MP క్వాలిటీతో కెమెరాల‌ని ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 12 మెగా పిక్సెల్‌ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 2438mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు.

Samsung Galaxy M32

Samsung Galaxy M32

సామ్‌సంగ్‌ సంస్థ‌కు చెందిన Samsung Galaxy M32 మొబైల్ ప్ర‌స్తుతం రూ.2000 ధ‌ర త‌గ్గింపుతో అందుబాటులో ఉంది. ఆస‌క్తి ఉన్న‌వారు ఆ త‌గ్గింపు ధ‌ర‌కు ఈ మొబైల్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ఈ మొబైల్ కు 6.5 అంగుళాల ఫుల్‌ HD డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఇది MediaTek MT6853 Dimensity 720, Octa Core ప్రాసెస‌ర్ క‌లిగి ఉంది. ఇది 4 జీబీ ర్యామ్| 128 జీబీ, 8 జీబీ ర్యామ్| 128 ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ కెపాసిటీల‌ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. ప్ర‌ధానంగా 48MP క్వాలిటీతో మెయిన్ కెమెరాని ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 13 మెగా పిక్సెల్‌ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది డ్యుయ‌ల్ సిమ్ స‌దుపాయాన్ని క‌లిగి ఉంది.

Redmi Note 10S

Redmi Note 10S

షావోమీ సంస్థ‌కు చెందిన Redmi Note 10S మొబైల్ ప్ర‌స్తుతం రూ.2000 ధ‌ర త‌గ్గింపుతో అందుబాటులో ఉంది. ఆస‌క్తి ఉన్న‌వారు ఆ త‌గ్గింపు ధ‌ర‌కు ఈ మొబైల్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ఈ మొబైల్ కు 6.43 అంగుళాల ఫుల్‌ HD డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఇది Mediatek Helio G95 (12 nm), Octa Core ప్రాసెస‌ర్ క‌లిగి ఉంది. ఇది 4 జీబీ ర్యామ్, 8 జీబీ ర్యామ్ కెపాసిటీల‌ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. ప్ర‌ధానంగా 64MP క్వాలిటీతో మెయిన్ కెమెరాని ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 13 మెగా పిక్సెల్‌ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది డ్యుయ‌ల్ సిమ్ స‌దుపాయాన్ని క‌లిగి ఉంది.

Redmi Note 11T 5G

Redmi Note 11T 5G

షావోమీ సంస్థ‌కు చెందిన Redmi Note 11T 5G మొబైల్ ప్ర‌స్తుతం రూ.5000 ధ‌ర త‌గ్గింపుతో అందుబాటులో ఉంది. ఆస‌క్తి ఉన్న‌వారు ఆ త‌గ్గింపు ధ‌ర‌కు ఈ మొబైల్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ఈ మొబైల్ కు 6.6 అంగుళాల ఫుల్‌ HD డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఇది MediaTek Dimensity 810 (6nm), Octa Core ప్రాసెస‌ర్ క‌లిగి ఉంది. ఇది 6 జీబీ ర్యామ్, 8 జీబీ ర్యామ్ కెపాసిటీల‌ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. ప్ర‌ధానంగా 50MP క్వాలిటీతో మెయిన్ కెమెరాని ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 16 మెగా పిక్సెల్‌ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది డ్యుయ‌ల్ సిమ్ స‌దుపాయాన్ని క‌లిగి ఉంది.

Samsung Galaxy A53 5G

Samsung Galaxy A53 5G

సామ్‌సంగ్ సంస్థ‌కు చెందిన Samsung Galaxy A53 5G మొబైల్ ప్ర‌స్తుతం రూ.3000 ధ‌ర త‌గ్గింపుతో అందుబాటులో ఉంది. ఆస‌క్తి ఉన్న‌వారు ఆ త‌గ్గింపు ధ‌ర‌కు ఈ మొబైల్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ఈ మొబైల్ కు 6.52 అంగుళాల ఫుల్‌ HD డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఇది Exynos 1280, Octa Core ప్రాసెస‌ర్ క‌లిగి ఉంది. ఇది 6 జీబీ ర్యామ్, 8 జీబీ ర్యామ్ కెపాసిటీల‌ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. ప్ర‌ధానంగా 64 MP క్వాలిటీతో మెయిన్ కెమెరాని ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 32 మెగా పిక్సెల్‌ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది డ్యుయ‌ల్ సిమ్ స‌దుపాయాన్ని క‌లిగి ఉంది.

Best Mobiles in India

English summary
List Of Smartphones Price Drop In India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X