Home
Mobile

Amazon సేల్ లో, రూ.40000 లోపు టాప్ 5 బెస్ట్ ప్రీమియం లుక్ స్మార్ట్‌ఫోన్‌లు! లిస్ట్, ధరలు

అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఈ నెల జులై 20 మరియు 21 తేదీలలో జరుగనున్నట్లు ఇప్పటికే ప్రకటించబడింది. అతిపెద్ద ఆన్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్స్‌లో ఒకటైన అమెజాన్ ప్రైమ్ డే సేల్ కు మరికొన్ని రోజులు మాత్రమే ఉంది. దేశం మొత్తం మీద స్మార్ట్ వినియోగదారులు సంవత్సరంలో కొన్ని అద్భుతమైన డీల్‌లను పొందే అవకాశం కోసం సంతోషంగా వేచి చూస్తున్నారు.

మీరు కూడా కొత్త స్మార్ట్‌ఫోన్‌ ను కొనాలని ఆలోచిస్తుంటే ఈ అమెజాన్ ప్రైమ్ డే లో ఏమి కొనుగోలు చేయాలనే విషయం పై మీ నిర్ణయం తీసుకునే ముందు, ఈ సేల్ లో అమ్మకానికి ఉన్న ధర రూ.40000 ల లోపు టాప్ స్మార్ట్‌ఫోన్‌లను ఇక్కడ చూద్దాం.

List Of Top 5 Best Premium Looking Smartphones

OnePlus 12R - రూ. 39,999
వన్‌ప్లస్12R ఫోన్ గ్లాస్ మరియు మెటల్ బిల్డ్ డిజైన్ మరియు 120Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్‌తో అద్భుతమైన 6.7-అంగుళాల అమోలెడ్ ProXDR డిస్‌ప్లేతో వస్తుంది. OnePlus 12R శక్తివంతంగా మరియు స్టైలిష్‌గా కనిపిస్తుంది మరియు ప్రీమియం లుక్ మరియు గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 మరియు 16GB వరకు ర్యామ్‌తో వస్తుంది. ఈ ఫోన్ కు వెనుకవైపు ట్రిపుల్ కెమెరా శ్రేణి ఉంది- ఇది 50MP ప్రధాన సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ మరియు 2MP మాక్రో లెన్స్ ఉంది. 5500mAh బ్యాటరీ సామర్థ్యంతో 100W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

Realme GT 6 - రూ. 35,950
Realme GT 6 ఫోన్ క్వాల్కమ్ యొక్క తాజా స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3s ప్రాసెసర్ మరియు 16GB వరకు RAM ద్వారా అందించబడుతుంది. ఇది 6.78 అంగుళాల, 120Hz డిస్‌ప్లేను ప్యాక్ చేస్తుంది, అది 6000నిట్‌ల వరకు ప్రకాశవంతంగా ఉంటుంది. వెనుకవైపు డ్యూయల్ 50MP మరియు 8MP కెమెరా సిస్టమ్ మరియు మీ ఫోటోగ్రఫీని తదుపరి స్థాయికి తీసుకెళ్లగల 32MP సెల్ఫీ కెమెరా ఉంది. 120W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే భారీ 5500mAh బ్యాటరీ కలిగి ఉంది.

Samsung Galaxy S23 FE - రూ. 37,100
శాంసంగ్ యొక్క ఈ Samsung Galaxy S23 FE స్మార్ట్‌ఫోన్‌ Exynos 2200 ప్రాసెసర్ మరియు 8GB RAM తో వస్తుంది. ఈ గెలాక్సీ S23 FE దాని గాజు మరియు అల్యూమినియం నిర్మాణం మరియు శక్తివంతమైన 6.4-అంగుళాల 120Hz డైనమిక్ అమోలెడ్ డిస్‌ప్లేతో సెగ్మెంట్‌లో ప్రీమియం డిజైన్ ను అందిస్తుంది.ఇప్పుడు ఇది Samsung Galaxy AI ఫీచర్‌లతో కూడా వస్తుంది.

ఈ గెలాక్సీ S23 FE ఫోన్ వెనక ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది - 50MP వైడ్ యాంగిల్, F/1.8తో OIS, 8MP, 3x టెలిఫోటో OIS మరియు 12MP, f/2.2, 123˚ అల్ట్రావైడ్ - 10MP సెల్ఫీ షూటర్‌ ఉంది.

IQOO Neo 9 Pro - రూ. 39,999
ఇది గేమింగ్-సెంట్రిక్ ఫోన్ మరియు ఇది స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 SoC మరియు 12GB వరకు RAMని కలిగి ఉంది. ఇందులో గేమింగ్ చిప్ మరియు 144Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన అల్ట్రా-బ్రైట్ (3000 నిట్స్ పీక్) డిస్‌ప్లే గేమ్‌ప్లేకు ఎలాంటి ఫ్రేమ్ డ్రాప్‌లు అడ్డుకాకుండా చూసుకోవడానికి పనిచేస్తుంది. 120W ఫ్లాష్ ఛార్జింగ్‌తో కూడిన 5160mAh బ్యాటరీ ప్యాక్, 11 నిమిషాల్లో ఫోన్‌ను 50% వరకు ఛార్జ్ చేస్తుంది.

Google Pixel 7A - రూ. 36,999
గూగుల్ పిక్సెల్ 7A స్మార్ట్‌ఫోన్ కొన్ని శక్తివంతమైన ప్రాసెసర్‌లు మరియు భారీ స్టోరేజీ ఆప్షన్లను కలిగి ఉంది.ఈ ఫోన్ లో Android 16 వరకు సాఫ్ట్‌వేర్ మద్దతుతో మరియు 2028 మధ్యకాలం వరకు భద్రతా అప్‌డేట్‌లు అందించబడతాయి. Google యొక్క అత్యుత్తమ ఫొటోగ్రఫీ ఫీచర్ తో జత చేసిన శుభ్రమైన ఆండ్రాయిడ్ అనుభవాన్ని కోరుకునే వారికి Pixel 7a మంచి స్మార్ట్‌ఫోన్ అవుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
List Of Top 5 Best Premium Looking Smartphones You Can Buy Under Rs.40000. In the Coming Amazon Prime day Sale.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X