Flagship మొబైల్స్ కోసం వేచి ఉన్నారా.. అయితే ఆగ‌స్టులో మీకు పండ‌గే!

|

మీరు Flagship స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయ‌డానికి వేచి చూస్తున్నారా.. అయితే అందుకు ఆగ‌స్టు నెల మీకు స‌రైన స‌మ‌యం. ఈ నెల‌లో (ఆగ‌స్టు) వివిధ బ్రాండ్లు త‌మ కంపెనీల నుంచి ప‌లు ఫ్లాగ్‌షిప్ల‌ను లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. Samsung, OnePlus, iQOO మరియు Motorola వంటి కంపెనీలు తమ సరికొత్త హై-ఎండ్ పరికరాలను ఆవిష్క‌రించ‌డానికి సిద్ధంగా ఉన్నాయి.

 Smartphones Expected In August

OnePlus 10T మరియు iQOO 9T మొబైల్స్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoC ప్రాసెస‌ర్‌ని క‌లిగి ఉన్న‌ట్లు కంపెనీలు నిర్దారించ‌గా, మ‌రోవైపు Moto Edge X30 మొబైల్స్ ప్ర‌పంచంలోనే తొలిసారిగా 200MP కెమెరాతో వ‌స్తున్న‌ట్లు కంపెనీ పేర్కొంది. ఆగస్ట్ 2022లో లాంచ్ అవుతున్న అన్ని ప్రధాన స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను ఇక్క‌డ మీకోసం అందిస్తున్నాం. మీరు కూడా ఓ లుక్కేయండి.

OnePlus 10T స్మార్ట్‌ఫోన్‌:

OnePlus 10T స్మార్ట్‌ఫోన్‌:

వ‌న్‌ప్ల‌స్ కంపెనీ ఈ OnePlus 10T మొబైల్ ను ఆగ‌స్టు 3న లాంచ్ చేయ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. ఇప్పుడు ఈ మొబైల్ ఎక్స్‌పెక్టెడ్‌ స్పెసిఫికేష‌న్ల‌ను ఓ సారి చూద్దాం.

ఈ మోడ‌ల్‌కు సంబంధించి ఇటీవ‌ల లీకైన స్పెసిఫిష‌న్ల‌ను చూస్తే.. ఈ మొబైల్ కు 6.7 అంగుళాల full-HD + Fluid AMOLED డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఓఎస్‌పై ప‌ని చేస్తుంది. ఈ ఫోన్ Qualcomm Snapdragon 8+ Gen1 SoC ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. ఈ OnePlus 10T మొబైల్‌కు ట్రిపుల్ కెమెరా సెట‌ప్‌ను అందిస్తున్నారు . 8GB RAM|128GB స్టోరేజీ స‌దుపాయాన్ని క‌ల్పిస్తున్నారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4800mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. 150W ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్టును క‌లిగి ఉంది.

Moto Razr 2022 స్మార్ట్‌ఫోన్‌:

Moto Razr 2022 స్మార్ట్‌ఫోన్‌:

మోటో కంపెనీకి చెందిన ఈ స్మార్ట్‌ఫోన్ కూడా ఈ నెల‌లోనే రానున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ మొబైల్‌కు సంబంధించిన లీక్ఢ్ స్పెసిఫికేష‌న్ల‌ను చూద్దాం.

ఈ మోడ‌ల్‌కు సంబంధించి ఇటీవ‌ల లీకైన స్పెసిఫిష‌న్ల‌ను చూస్తే.. ఈ మొబైల్ కు 6.67 అంగుళాల full-HD +OLED డిస్‌ప్లే ను అందిస్తున్నారు.ఈ మొబైల్‌కు 50 మెగా పిక్సెల్‌తో ప్రైమ‌రీ కెమెరా ను అందిస్తున్నారు . 8GB, 12GB, 18GB RAM కెపాసిటీ వేరియంట్ల‌లో ల‌భిస్తుంది. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 3200mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు.

Infinix Hot 12 Pro స్మార్ట్‌ఫోన్‌:

Infinix Hot 12 Pro స్మార్ట్‌ఫోన్‌:

Infinix కంపెనీ ఈ Infinix Hot 12 Pro మొబైల్ ను ఆగ‌స్టు 2న లాంచ్ చేయ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. ఇప్పుడు ఈ మొబైల్ ఎక్స్‌పెక్టెడ్‌ స్పెసిఫికేష‌న్ల‌ను ఓ సారి చూద్దాం.

ఈ మోడ‌ల్‌కు సంబంధించి ఇటీవ‌ల లీకైన స్పెసిఫిష‌న్ల‌ను చూస్తే.. ఈ మొబైల్ కు 6.7 అంగుళాల full-HD + AMOLED డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఓఎస్‌పై ప‌ని చేస్తుంది. ఈ ఫోన్ Octa Core MediaTek Helio G99 6nm ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. ఈ మొబైల్‌కు 108 మెగాపిక్సెల్ క్వాలిటీ కెమెరా సెట‌ప్‌ను అందిస్తున్నారు . 8GB RAM|256GB స్టోరేజీ స‌దుపాయాన్ని క‌ల్పిస్తున్నారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు.

Samsung Galaxy Z Flip 4 స్మార్ట్‌ఫోన్‌:

Samsung Galaxy Z Flip 4 స్మార్ట్‌ఫోన్‌:

Samsung కంపెనీ ఈ Galaxy Z Flip 4 మొబైల్ ను ఆగ‌స్టు 10న లాంచ్ చేయ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. ఈ మొబైల్స్‌కు సంబంధించి కంపెనీ త‌మ సైట్‌లో ఇప్ప‌టికే ప్రీ ఆర్డ‌ర్ బుకింగ్స్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఈ మొబైల్ ఎక్స్‌పెక్టెడ్‌ స్పెసిఫికేష‌న్ల‌ను ఓ సారి చూద్దాం.

ఈ మోడ‌ల్‌కు సంబంధించి ఇటీవ‌ల లీకైన స్పెసిఫిష‌న్ల‌ను చూస్తే.. ఈ మొబైల్ కు 6.7 అంగుళాల full-HD + AMOLED డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఓఎస్‌పై ప‌ని చేస్తుంది. ఈ ఫోన్ Qualcomm Snapdragon 8 Gen 1+ ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. 8GB RAM|128GB స్టోరేజీ స‌దుపాయాన్ని క‌ల్పిస్తున్నారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 3700mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు.

IQoo 9T స్మార్ట్‌ఫోన్‌:

IQoo 9T స్మార్ట్‌ఫోన్‌:

IQoo కంపెనీ ఈ IQoo 9T మొబైల్ ను ఆగ‌స్టు 2న లాంచ్ చేయ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. ఇప్పుడు ఈ మొబైల్ ఎక్స్‌పెక్టెడ్‌ స్పెసిఫికేష‌న్ల‌ను ఓ సారి చూద్దాం.

ఈ మోడ‌ల్‌కు సంబంధించి ఇటీవ‌ల లీకైన స్పెసిఫిష‌న్ల‌ను చూస్తే.. ఈ మొబైల్ కు 6.78 అంగుళాల full-HD + AMOLED డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఓఎస్‌పై ప‌ని చేస్తుంది. ఈ ఫోన్ Octa Core Snapdragon 8+ Gen 1 4nm ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. ఈ మొబైల్‌కు ట్రిపుల్ కెమెరా సెట‌ప్‌ను అందిస్తున్నారు . 8GB, 12GB RAM కెపాసిటీ వేరియంట్ల‌లో క‌ల్పిస్తున్నారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4700mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు.

Samsung Galaxy Z Fold 4 స్మార్ట్‌ఫోన్‌:

Samsung Galaxy Z Fold 4 స్మార్ట్‌ఫోన్‌:

Samsung కంపెనీ ఈ Galaxy Z Fold 4 మొబైల్ ను ఆగ‌స్టు 10న లాంచ్ చేయ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. ఈ మొబైల్స్‌కు సంబంధించి కంపెనీ త‌మ సైట్‌లో ఇప్ప‌టికే ప్రీ ఆర్డ‌ర్ బుకింగ్స్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఈ మొబైల్ ఎక్స్‌పెక్టెడ్‌ స్పెసిఫికేష‌న్ల‌ను ఓ సారి చూద్దాం.

ఈ మోడ‌ల్‌కు సంబంధించి ఇటీవ‌ల లీకైన స్పెసిఫిష‌న్ల‌ను చూస్తే.. ఈ మొబైల్ కు 7.6 అంగుళాల డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఓఎస్‌పై ప‌ని చేస్తుంది. ఈ ఫోన్ Qualcomm Snapdragon 8 Gen 1 chipset ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. ఈ మొబైల్‌కు ట్రిపుల్ కెమెరా సెట‌ప్‌ను అందిస్తున్నారు . 12GB RAM|256GB స్టోరేజీ స‌దుపాయాన్ని క‌ల్పిస్తున్నారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4400mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు.

Realme GT Neo 3T స్మార్ట్‌ఫోన్‌:

Realme GT Neo 3T స్మార్ట్‌ఫోన్‌:

Realme కంపెనీ ఈ GT Neo 3T మొబైల్ ను ఆగ‌స్టు 2న లాంచ్ చేయ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. ఇప్పుడు ఈ మొబైల్ ఎక్స్‌పెక్టెడ్‌ స్పెసిఫికేష‌న్ల‌ను ఓ సారి చూద్దాం.

ఈ మోడ‌ల్‌కు సంబంధించి ఇటీవ‌ల లీకైన స్పెసిఫిష‌న్ల‌ను చూస్తే.. ఈ మొబైల్ కు 6.62 అంగుళాల full-HD + AMOLED డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఓఎస్‌పై ప‌ని చేస్తుంది. ఈ ఫోన్ Octa Core with Snapdragon 870 7nm ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. ఈ మొబైల్‌కు ట్రిపుల్ కెమెరా సెట‌ప్‌ను అందిస్తున్నారు . 8GB RAM |128GB స్టోరేజీ కెపాసిటీ క‌ల్పిస్తున్నారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు.

Motorola Edge X30 Pro స్మార్ట్‌ఫోన్‌:
Motorola కంపెనీ ఈ Edge X30 Pro మొబైల్ ను ఆగ‌స్టు 2న లాంచ్ చేయ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. ఇప్పుడు ఈ మొబైల్ ఎక్స్‌పెక్టెడ్‌ స్పెసిఫికేష‌న్ల‌ను ఓ సారి చూద్దాం.

ఈ మోడ‌ల్‌కు సంబంధించి ఇటీవ‌ల లీకైన స్పెసిఫిష‌న్ల‌ను చూస్తే.. ఈ మొబైల్ కు 6.67 అంగుళాల full-HD (1,080x2,400 pixels) రిసొల్యూష‌న్ క‌లిగిన‌ డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే అత్య‌ధికంగా 144Hz రిఫ్రెష్ రేటును క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఓఎస్‌పై ప‌ని చేస్తుంది. ఈ ఫోన్ Snapdragon 8+ Gen 1 SoC ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ 16GB RAM| 512GB స్టోరేజీ కెపాసిటీలో అందుబాటులో ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌పై ప‌నిచేస్తుంది. ప్ర‌పంచంలోనే తొలిసారిగా ఈ మొబైల్‌కు 200 మెగా పిక్సెల్ కెమెరా ఇవ్వ‌నున్న‌ట్లు కంపెనీ పేర్కొంది.

Best Mobiles in India

English summary
List Of Upcoming Smartphones Expected In August 2022

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X