మార్కెట్లో విడుదలైన కొత్త స్మార్ట్‌ఫోన్‌‌లు (టాప్-5)

|

గడిచిన వారం దేశీయటెక్ మార్కెట్ స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలతో హోరెత్తింది. సామ్‌సంగ్, మైక్రోమ్యాక్స్, లావా, మాక్ మొబిలిటీ, సాన్సుయి్ వంటి ప్రముఖ బ్రాండ్‌లు తమతమ కొత్త మొబైల్ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చాయి. మధ్యతరగతి భారతీయులకు ఈ హ్యాండ్‌సెట్‌లు అందుబాటు ధరల్లో లభ్యమవటం విశేషం. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా గత వారం విడుదలైన టాప్-5 స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీముందుంచుతున్నాం. యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లతో మొబైల్ ప్రపంచానికి పరిచయమైన
సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్, మైక్రోమ్యాక్స్ ఏ116 కాన్వాస్ హైడెఫినిషన్, లావా జోలో ఏ500, మాక్ మొబిలిటీ అగ్ని, ఆకాష్, పృథ్వి, సాన్సుయి ఎస్23, ఎస్30 హ్యాండ్‌సెట్‌ల సమాచారాన్ని క్రింది గ్యాలరీలో చూడొచ్చు.

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్(samsung galaxy grand):

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్(samsung galaxy grand):

సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ తన సరికొత్త డ్యూయల్ సిమ్ వర్షన్ స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ గ్రాండ్'ను మంగళవారం ముంబయ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించింది. ఈ కార్యక్రమాన్ని లైవ్ స్ర్కీన్ ద్వారా ఢిల్లీలో ప్రదర్శించటం విశేషం. గెలాక్సీ సిరీస్ నుంచి ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్నఈ ఫోన్ ధర రూ.21,500. స్పెషల్ ఆఫర్‌లో భాగంగా ఈ హ్యాండ్‌సెట్ కొనుగోలు పై 50జీబి డ్రాప్‌బాక్స్ స్టోరేజ్‌తో పాటు ఉచిత ఫ్లిప్ కవర్‌ను సామ్‌సంగ్ ఇండియా అందిస్తోంది. ఫిబ్రవరి మొదటి వారం నుంచి గెలాక్సీ గ్రాండ్ రిటైల్ మార్కెట్లో లభ్యంకానుంది.

గెలాక్సీ గ్రాండ్ కీలక స్పెసిఫికేషన్‌లు:

- 5 అంగుళాల మల్టీ-టచ్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,

- డిస్‌ప్లే రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్,

- డ్యూయల్ కోర్ 1.2గిగాహెట్జ్ ప్రాసెసర్,

- ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

- 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

- 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

- మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

- వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ, హెచ్ డిఎమ్ఐ అవుట్, ఏ-జీపీఎస్, డీఎల్ఎన్ఏ,

- 2100ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.

ప్రీలోడెడ్ అప్లికేషన్‌లు:

చాట్ ఆన్, గేమ్స్ హబ్, మై మూవీస్, మై మ్యూజిక్, మై మొబైల్ టీవీ, మై స్టేషన్. మై రీడర్, మై ఎడ్యుకేషన్.

ధర ఇతర వివరాలు:

ఎలిగెంట్ వైట్ ఇంకా మెటాలిక్ బ్లూ కలర్ వేరియంట్‌లలో సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ లభ్యం కానుంది. ఫిబ్రవరి మొదటి వారం నుంచి రిటైల్ మార్కెట్లో విక్రాయాలు ప్రారంభం కానున్నాయి. ధర రూ.21,500.

 

 

మైక్రోమ్యాక్స్ ఏ116 కాన్వాస్ హైడెఫినిషన్ (Micromax A116 Canvas HD):

మైక్రోమ్యాక్స్ ఏ116 కాన్వాస్ హైడెఫినిషన్ (Micromax A116 Canvas HD):

ప్రముఖ దేశవాళీ మొబైల్ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ పై స్పందించే అధిక ముగింపు ఫాబ్లెట్‌ను సోమవారం ఆవిష్కరించింది. పేరు మైక్రోమ్యాక్స్ ఏ116 కాన్వాస్ హైడెఫినిషన్. ధర అంచనా రూ.15,000. సరికొత్త ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ప్లాట్‌ఫామ్‌ను ఈ పెద్ద‌స్ర్కీన్ మొబైలింగ్ హ్యాండ్‌సెట్‌లో లోడ్ చేశారు. స్పెసిఫికేషన్‌లు క్లుప్తంగా.......


డిస్‌ప్లే: 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, డిస్‌ప్లే రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్,

ప్రాసెసర్: 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియా టెక్ ఎంటీ6589 ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

స్టోరేజ్: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ: 3జీ, వై-ఫై 802.11 బి/జి/ఎన్, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్ కనెక్టువిటీ,

బ్యాటరీ: 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ (బ్యాకప్ వివరాలు తెలియాల్సి ఉంది),

ప్రీలోడెడ్ అప్లికేషన్‌లు: ఎమ్ స్టోర్, ఎమ్ బడ్డి, ఎం ఎస్ఎమ్ఎస్, ఎమ్ జోన్, హుక్ అప్.

ధర ఇతర వివరాలు: మైక్రోమ్యాక్స్ ఏ116 కాన్వాస్ హైడెఫినిషన్ ఫాబ్లెట్ ధర అంచనా రూ.15,000. ఫిబ్రవరి నుంచి రిటైల్ మార్కెట్లో లభ్యంకానుంది.

 

లావా జోలో ఏ500 (Lava Xolo A500):

లావా జోలో ఏ500 (Lava Xolo A500):

దేశవాళీ మొబైల్ బ్రాండ్ లావా మొబైల్స్ జోలా ఏ500 పేరుతో సరికొత్త ఇంటెల్ ఆధారిత డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. ధర రూ.6,999. ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్తే....

డిస్‌ప్లే: 4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్,

ప్రాసెసర్: 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

స్టోరేజ్: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ: డ్యూయల్ సిమ్, బ్లూటూత్, జీపీఎస్, 3జీ, మైక్రోయూఎస్బీ 2.0 కనెక్టువిటీ,

బ్యాటరీ: 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

ధర ఇంకా ఇతర అందుబాటు వివరాలు: ధర 6,999. ఈ వివరాలను ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్డ్ తన లిస్టింగ్స్‌లో ఉంచింది.

 

మాక్ మొబిలిటీ అగ్ని, ఆకాష్, పృథ్వి (Mak Mobility Agni, Aakash and Prithvi):

మాక్ మొబిలిటీ అగ్ని, ఆకాష్, పృథ్వి (Mak Mobility Agni, Aakash and Prithvi):

దేశీయంగా కోన్కా (Konka) స్మార్ట్‌ఫోన్‌లను పంపిణి చేస్తున్న ప్రముఖ టెక్ బ్రాండ్ మాక్ మొబిలిటీ ‘ట్రయో' బ్రాండ్ కింద మూడు సరికొత్త ఫీచర్ ఫోన్‌లను ఆవిష్కరించింది. అగ్ని, ఆకాష్, పృథ్వీ మోడళ్లలో ఈ హ్యాండ్‌సెట్‌లు లభ్యంకానున్నాయి. వీటి ధరలు రూ.1,199 నుంచి రూ.2,999 మధ్య ఉన్నాయి. 2.6 అంగుళాల డిస్‌ప్లే, 1400ఎమ్ఏహెచ్ బ్యాటరీ, జీపీఆర్ఎస్ కనెక్టువిటీ, స్టీరియో బ్లూటూత్ వంటి స్పెసిఫికేషన్‌లు ఈ మూడు ఫోన్‌లలో సమాన ప్రాతిపదికను కలిగి ఉంటాయి.

ఆకాష్ (టీ2424), అగ్ని(టీ2626) మోడళ్లు ఎంపీత్రీ ఇంకా ఎఫ్ఎమ్ స్టీరియోతో కూడిన కింగ్ మూవీ హైడెఫినిషన్ వీడియో ప్లేయర్ అప్లికేషన్‌ను కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు1.3 మెగా పిక్సల్ కెమెరా ఫీచర్‌ను కలిగి 16జీబి మెమరీ కార్డ్‌ను సపోర్ట్ చేస్తాయి. మరో మోడల్ పృథ్వీ (టీ2020) వీజీఏ కెమెరాను కలిగి స్పెషల్ బాక్స్ స్పీకర్లతో ఉత్తమ క్వాలిటీ ఆడియోను ఉత్పత్తి చేస్తుంది.

 

సాన్సుయి ఎస్23, ఎస్30 (Sansui S23 and S30):

సాన్సుయి ఎస్23, ఎస్30 (Sansui S23 and S30):

ప్రముఖ ఫీచర్ మొబైల్ ఫోన్‌ల తయారీ సంస్థ ‘సాన్సుయి' తన విజయవంతమైన ‘ఎస్' సిరీస్ నుంచి ఎస్23, ఎస్30 మోడళ్లలో రెండు సరికొత్త మొబైల్ ఫోన్‌లను ఆవిష్కరించింది. స్పెసిఫికేషన్‌లు క్లుప్తంగా:

ఎస్23:

1.8 అంగుళాల డిస్ ప్లే,
1,000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ఎల్ఈడి టార్చ్,
8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
ధర రూ 1,100.

ఎస్30:

2.2 అంగుళాల డిస్ ప్లే,
1,800ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ఎల్ఈడి టార్చ్,
8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
ధర రూ.1290.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X