Home
Mobile

మార్చి ఆఖరి వారంలో విడుదలైన స్మార్ట్‌ఫోన్స్.. ట్యాబ్లెట్స్

కమ్యూనికేషన్ పరికరాల వినియోగం దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న నేపధ్యంలో స్మార్ట్‌ఫోన్స్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు క్రేజ్ పెరుగుతోంది. ఈ క్రమంలో మార్కెట్లో సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ మోడళ్లతో కళకళలాడుతోంది. అంతర్జాతీయ కంపెనీలకు పోటీగా దేశవాళీ కంపెనీలు తమ ఉత్పత్తులను విడుదల చేస్తున్నాయి. మార్చి ఆఖరి వారానికిగాను మార్కెట్లో విడులైన గాడ్జెట్‌ల వివరాలను గిజ్‌బాట్ మీకు పరిచయం చేస్తోంది.

మీ ఫోన్ త్వరగా చార్జ్ అవ్వాలంటే..?, కొన్ని సందర్భాల్లో మొబైల్ ఫోన్‌లు పూర్తిగా చార్జ్ అయ్యేందుకు నిర్ధేశిత సమయం కంటే అధిక సమయాన్ని తీసుకుంటాయి. అయితే, ఈ జాప్యానికి గల కారణాలు చాల మందికి తెలియదు. ఫోన్ వేగవంతంగా చార్జ్ అయ్యేందుకు పాటించాల్సిన నిబంధనలను ఇప్పుడు తెలుసుకుందాం. ఫోన్ వేగవంతంగా చార్జ్ అవ్వాలంటే సదరు చార్జర్‌ను నేరుగా అవుట్ లెట్‌కే అనుసంధానించండి.

కంప్యూటర్ ద్వారా చార్జింగ్ అంత ఉపయుక్తమైనది కాదు. చార్జింగ్‌కు సిద్ధమయ్యే క్రమంలో ఫోన్‌లో రన్ అవుతున్న అప్లికేషన్‌లను ఆఫ్ చేయటం మంచిది. ముఖ్యంగా జీపీఎస్, బ్లూటూత్ వంటి అప్లికేషన్‌లను టర్న్ ఆఫ్ చేయాలి. ఫోన్ స్ర్కీన్‌ను టర్న్ ఆఫ్ చేయండి. చార్జింగ్ సమయంలో మీ ఫోన్ వైబ్రేషన్ మోడ్‌లో ఉన్నట్లయితే సాధారణ సౌండ్ మోడ్‌కు తీసుకురండి. చార్జింగ్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో మ్యూజిక్ వినటం అంత శ్రేయస్కరం కాదు.

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి
లింక్ అడ్రస్:

నోకియా లూమియా 520 (Nokia Lumia 520):

నోకియా లూమియా 520 (Nokia Lumia 520):

4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా వెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై ఇంకా బ్లూటూత్ కనెక్టువిటీ,
1430ఎమ్ఏహెచ్ బ్యాటరీ
ప్రీఆర్డర్ ధర రూ.10,499.

లావా జోలో బీ700 (Lava Xolo B700):

లావా జోలో బీ700 (Lava Xolo B700):

4.3 అంగుళాల క్యూహెచ్‌డి ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్),
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
4జీబి ఇంటర్నల్ మెమెరీ, 512 ఎంబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ కనెక్టువిటీ,
3450ఎమ్ఏహెచ్ బ్యాటరీ (20 గంటల టాక్‌టైమ్, 363 గంటల స్టాండ్‌బై),
ధర రూ. 8,999.

గూగుల్ నెక్సస్ 7 (Google Nexus 7):

గూగుల్ నెక్సస్ 7 (Google Nexus 7):

7 అంగుళాల 10 పాయిండ్ మల్టీటచ్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్),
క్వాడ్‌కోర్ 1.2గిగాహెట్జ్ ఎన్-విడియా టెగ్రా 3 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (అప్ గ్రేడబుల్ టూ ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్),
1జీబి ర్యామ్,
ఇంటర్నల్ స్టోరేజ్ 16జీబి/32జీబి,
1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
వై-ఫై ఇంకా బ్లూటూత్ కనెక్టువిటీ,
4,325ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ఎన్ఎఫ్‌సీ కనెక్టువిటీ,
ధర రూ.15,999.

విష్‌టెల్ ఐరా క్యాప్సూల్ (WishTel Ira Capsule):

విష్‌టెల్ ఐరా క్యాప్సూల్ (WishTel Ira Capsule):

10.1 అంగుళాల మల్టీ-టచ్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
1.6గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ సిమ్‌కార్డ్ స్లాట్,
బ్లూటూత్, వై-ఫై,
8000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (5 గంటల బ్యాకప్),
ధర రూ.16,000.

డేటావిండ్ యూబీస్లేట్ 7సీ+ఎడ్జ్ (Datawind UbiSlate 7C+ Edge):

డేటావిండ్ యూబీస్లేట్ 7సీ+ఎడ్జ్ (Datawind UbiSlate 7C+ Edge):

7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),
1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
వై-ఫై, యూఎస్బీ కనెక్టువిటీ,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
3,200ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.5,999.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X