పోయిన ఫోన్‌లను వెతికి పట్టుకోవటం చాలా సులువు..

స్మార్ట్‌ఫోన్‌లను ఆదమరుపున ఎక్కడో ఒకచోటు వదిలిపేట్టేయటం లేదా దొంగతనానికి గురువటం వంటి సంఘటనలు నిత్యం చోటుచేసుకుంటూనే ఉన్నాయి. మిగిలిన ఆపరేటింగ్ సిస్టంల పై రన్ అయ్యే ఫోన్‌లతో పోలిస్తే ఆండ్రాయిడ్ ఓఎస్ ఆధారంగా స్పందించే ఫోన్‌లను సులువుగా వెతికిపట్టుకునేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

Read More : డిసెంబర్ 3 తరువాత Jio నుంచి మరో ఆఫర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్ సెట్టింగ్స్‌ను ఎనేబుల్ చేసుకుని ఉండాలి

చోరీకి గురైన మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను లోకేట్ చేసే క్రమంలో యూజర్ ముందస్త జాగ్రత్తగా తన ఫోన్‌లో నౌ కార్డ్స్, వెబ్, యాప్ యాక్టివిటీ ఆప్షన్స్‌కు సంబంధించి గూగుల్ సెట్టింగ్స్‌ను ఎనేబుల్ చేసుకుని ఉండాలి.

Location Reporting

ఇదే సమయంలో "Location Reporting" ఆప్షన్‌ను high accuracy మోడ్ లో ఉంచాలి. ఈ ఆప్షన్స్ అన్ని మీ ఫోన్‌లో ఎనేబుల్ అయి ఉన్నట్లయితే ఐదే ఐదు సింపుల్ ట్రిక్స్‌ను అనుసరించి పోయిన మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను లొకేషన్‌తో సహా కనిపెట్టవచ్చు.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇదుగోండి మార్గం..

రిమోట్ విధానం ద్వారా మీ ఆండ్రాయిడ్ ఫోన్ కు సంబంధించిన లోకేషన్ ను కనిపెట్టడంతో పాటు ఫోన్‌లోని డేటాను పూర్తిగా డిలీట్ చేయవచ్చు. ఇందుకుగాను మీ ఫోన్‌లో Android Device Manager feature ఎనేబుల్ చేసి ఉంచుకోండి.

మీ ఫోన్‌లో ముందుస్తుగా..

ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేయాలంటే Google Settings >> Security >> Android Device Manager. Now look for 'allow remote lock and erase and switch it on.

ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వండి..

ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్ యాప్ లేదా ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి  ఫోన్ అకౌంట్ లోకి లాగిన్  అవటం ద్వారా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను రిమోట్ విధానంలో లోకేట్ చేయవచ్చు. డివైస్ లోకేషన్‌ను మ్యాప్‌లో చూడొచ్చు. (గమనిక: ఫోన్ ఆన్ చేసిన ఉంటేనే దాని లోకేషన్‌ను మీరు ట్రేస్ చేయగలరు).

మూడు ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి..

ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్ ద్వారా మీ డివైస్‌ను ట్రేస్ చేసిన తరువాత మూడు ఆప్షన్‌లు కనిపిస్తాయి. అందులో ఒకటి రింగ్, మరొకటి లాక్ అండ్ ఎరేజ్.

రింగ్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్నట్లయితే..

రింగ్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవటం ద్వారా మీ డివైస్ ఫుల్ వాల్యుమ్‌తో 5 నిమిషాల పాటు బెగ్గరగా రింగ్ అవుతుంది. లాక్ ఆప్షన్‌ను ఎంపిక చేసేుకున్నట్లయితే రిమోట్ విధానం ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌ను లాక్ చేసేయవచ్చు.

Erase ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్నట్లయితే

Erase ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్నట్లయితే మీ ఫోన్‌లోని అన్ని సెట్టింగ్స్‌తో సహా మ్యూజిక్, ఫోటోస్, వీడియోస్, యాప్స్ ఇలా మొత్తం డేటా డిలీట్ అయిపోతుంది. ఎస్డీ కార్డ్‌లోని డేటా మాత్రం అలానే ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Locate Your Lost Android Phone Just By Typing “Find My Phone” On Google. Read More in Telugu Gizbot.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot