Home
Mobile

ధర రూ.20000 ల లోపు, బెస్ట్ కెమెరాలు కలిగిన 5G ఫోన్లు! లిస్ట్, ధరలు

By Maheswara

మీరు చెల్లించే బడ్జెట్ ధర లో మంచి పనితీరు మరియు భారీ కెమెరా ఫీచర్లు కలిగిన ఫోన్ కోసం వెతుకుతున్నారా? అయితే, మీరు సరైన చోటుకి వచ్చారు! ఎందుకంటే, మేము ఇప్పుడు రూ.20,000 బడ్జెట్‌లో మీరు కొనుగోలు చేయగల టాప్ 5 ఉత్తమ కెమెరా ఫోన్‌ల లిస్ట్ ను ఇక్కడ ఇస్తున్నాము.

రియల్ మీ 10 ప్రో 5G

రియల్ మీ 10 ప్రో 5G

రియల్ మీ 10 ప్రో 5G చాలా సరసమైన ధరలో రూ.18,999 రూపాయలకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 108MP కెమెరాను అందించే స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. ఈ ఫోన్ యొక్క పెద్ద కెమెరా సెన్సార్ దీనిని మంచి కెమెరా ఫోన్ గా మారుస్తుంది. ఈ ఫోన్ 16MP సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. వివరాలు గమనిస్తే, రూ. 20 వేల లోపు బెస్ట్ కెమెరా ఫోన్‌ల కంటే ఇది ఒక మెట్టు పైన ఉంది!

శాంసంగ్ గెలాక్సీ M33 5G

శాంసంగ్ గెలాక్సీ M33 5G

శాంసంగ్ గెలాక్సీ M33 5G స్మార్ట్ ఫోన్, ధర రూ.15,999 కి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ వెనక వైపు క్వాడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ ధర శ్రేణిలో 4 కెమెరాలు ఉన్న ఫోన్‌ని కనుగొనడం కొంచెం కష్టం. ఈ నాలుగు కెమెరాలలో 50MP మెయిన్ షూటర్, 5MP అల్ట్రా-వైడ్ షూటర్ మరియు రెండు 2MP సెన్సార్లు ఉన్నాయి. దీని కెమెరా సెటప్‌లో పోర్ట్రెయిట్, నైట్ మోడ్ తో సహా, మల్టిపుల్ షూటింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఇక ముందువైపు 8MP సెల్ఫీ కెమెరా ఉంది.

ఒప్పో A78 5G

ఒప్పో A78 5G

ఒప్పో A78 5G స్మార్ట్‌ఫోన్ ధర రూ.19,300 కి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ వెనక వైపు 50MP + 2MP డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇక ముందువైపు కెమెరా విషయానికి వస్తే, ఇది పోర్ట్రెయిట్ మోడ్‌కు మద్దతు ఇచ్చే 8MP సెల్ఫీ కెమెరా ను కలిగి ఉంటుంది. ఇది నైట్ మోడ్, వీడియో, పోర్ట్రెయిట్ ఎక్స్‌పర్ట్, పనోరమిక్ మరియు అనేక ఇతర షూటింగ్ మోడ్‌లను కూడా కలిగి ఉంటుంది.

రెడ్ మీ నోట్ 11 ప్రో

రెడ్ మీ నోట్ 11 ప్రో

రెడ్ మీ నోట్ 11 ప్రో ధర రూ.17,999 కి అందుబాటులో ఉంటుంది. ఈ రెడ్ మీ నోట్ 11 ప్రో కూడా 108MP ప్రధాన కెమెరాతో వస్తున్న చౌకైన స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. ఈ ఫోన్లో 108MP + 8MP అల్ట్రా-వైడ్ కెమెరా + 2MP మాక్రో కెమెరా + 2MP డెప్త్ కెమెరా సెటప్ తో వెనక వైపు నాలుగు కెమెరాలు కలిగి ఉంది. ఇక ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంది.

వన్ ప్లస్ నోర్డ్ CE 2 లైట్ 5G

వన్ ప్లస్ నోర్డ్ CE 2 లైట్ 5G

వన్ ప్లస్ నోర్డ్ CE 2 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ ధర రూ.18,999 కి అందుబాటులో ఉంది.ఈ ఫోన్ వెనక వైపు 64MP + 2MP + 2MP మూడు కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క  ప్రధాన కెమెరా ద్వారా తీసిన ఫోటోల నాణ్యత బాగుంది. మరియు ఇది కొన్ని షూటింగ్ మోడ్‌లను కూడా అందిస్తుంది. ఇంకా, ముందువైపు 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Looking For Best Camera Smartphone Priced Under Rs.20000? Here Is The List And Details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X