Home
Mobile

డిలీట్ అయిన ఆండ్రాయిడ్ ఫైల్స్‌ను నిమిషాల్లో రికవరీ చేయాలా.. ఈ ట్రిక్ మీకోసమే!

Recover Deleted Files: ఆండ్రాయిడ్ ఫోన్‌లో ముఖ్యమైన డేటా పోతే చాలా టెన్షన్‌గా ఉంటుంది. ఫొటోలు, వీడియోలు, కాంటాక్ట్‌లు లేదా డాక్యుమెంట్లు.. ఏదైనా డిలీట్ అయిపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు, మీరు వెంటనే రియాక్ట్ అయితే వాటిని తిరిగి పొందడం సాధ్యమే. గూగుల్ బ్యాకప్, గూగుల్ ఫొటోలు, డేటా రికవరీ సాఫ్ట్‌వేర్ ఇంకా గూగుల్ డ్రైవ్‌ను ఉపయోగించి రిమూవ్ అయిన డేటాను ఎలా తిరిగి తెచ్చుకోవాలో తెలుసుకుందాం.

* గూగుల్ బ్యాకప్‌తో డేటాను తిరిగి పొందండిలా

డేటా డిలీట్ అయిపోయినప్పుడు గూగుల్ బ్యాకప్ నిజంగా లైఫ్‌సేవర్ లాగా పనిచేస్తుంది. మీరు గూగుల్ బ్యాకప్ ఎనేబుల్ చేసి ఉంటే, మీ కాంటాక్ట్‌లు, యాప్ డేటా ఇంకా డివైజ్ సెట్టింగ్‌లు మీ గూగుల్ అకౌంట్‌లో స్టోర్ అవుతాయి. ఆ డేటాను ఎలా రిస్టోర్ చేయాలో చూద్దాం.

Lost Your Data  Recover Deleted Files on Android in Minutes

ఆండ్రాయిడ్ ఫోన్‌లో సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేయాలి. గూగుల్ మీద ట్యాప్ చేసి, తర్వాత బ్యాకప్ సెలెక్ట్ చేసుకోవాలి. "బ్యాకప్ బై గూగుల్ వన్" ఆన్‌లో లేకపోతే, దాన్ని ఎనేబుల్ చేయాలి. బ్యాకప్ చేయాలనుకుంటున్న డేటా (ఫొటోలు/వీడియోలు)ను ఎంచుకోవాలి. "బ్యాకప్ నౌ" మీద ట్యాప్ చేసి, ప్రాసెస్ పూర్తయ్యే వరకు వెయిట్ చేయాలి.

* ముఖ్యమైన విషయాలు

మీరు డేటా పోగొట్టుకునే ముందు గూగుల్ బ్యాకప్ ఎనేబుల్ చేసి ఉంటేనే ఈ పద్ధతి పనిచేస్తుంది. SMS మెసేజ్‌లు ఇంకా కొన్ని యాప్ డేటాను ఈ పద్ధతిలో తిరిగి పొందలేరు. "బ్యాకప్ & సింక్" ఆన్ చేసి ఉంటే, గూగుల్ ఫోటోస్‌ ఆటోమేటిక్‌గా మీ ఇమేజ్‌లను స్టోర్ చేస్తుంది.

గూగుల్ ఫోటోస్‌ నుంచి డిలీట్ చేసిన ఫోటోలు, వీడియోలను తిరిగి పొందడానికి బ్యాకప్ & సింక్" చేయడమే ఏకైక మార్గం. డిలీట్ చేసిన ఫోటోలు ట్రాష్‌లోకి వెళ్తాయి. అవి అక్కడ ఎంతకాలం ఉంటాయంటే బ్యాకప్ చేయకపోతే 30 రోజులు, బ్యాకప్ చేస్తే 60 రోజులు.

* ఫొటోలను రిస్టోర్ చేసే టిప్స్

గూగుల్ ఫొటోస్‌ ఓపెన్ చేయాలి. ఫొటో ఆర్కైవ్‌లో ఉందేమో చూడండి. ఉంటే, దాన్ని అన్‌ఆర్కైవ్ చేయాలి. లేకపోతే, ట్రాష్‌కి వెళ్లి, ఫొటో ఇంకా ఉంటే రిస్టోర్ చేయాలి. ఆండ్రాయిడ్ డేటా రికవరీ సాఫ్ట్‌వేర్‌తో డేటాను రికవర్ చేసుకోవచ్చు. మీ దగ్గర బ్యాకప్ లేకపోతే, ఈ డేటా రికవరీ సాఫ్ట్‌వేర్ హెల్ప్ చేస్తుంది.

టెనోర్‌షేర్ ఉల్టాడేటా ఫర్ ఆండ్రాయిడ్ (Tenorshare UltData for Android) అలాంటి ఒక టూల్. ఇది చాలా ఆండ్రాయిడ్ బ్రాండ్స్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫొటోలు, వీడియోలు, వాట్సాప్ మెసేజ్‌లు, కాంటాక్ట్‌లు ఇంకా ఇతర ఫైల్స్‌ను తిరిగి పొందడానికి ఇది హెల్ప్ చేస్తుంది.

ఇది విండోస్, మ్యాక్ రెండింటిలోనూ పనిచేస్తుంది. మార్కెట్‌లో ఇలాంటి చాలా టూల్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఏదైనా టూల్‌ని వాడే ముందు అది సురక్షితమైన కాదా అనేది చెక్ చేసుకోవాలి. రివ్యూలను బాగా చదివిన తర్వాతే దానిని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. లేకపోతే మాల్వేర్ ఎటాక్ అయ్యే ప్రమాదముంది.

* గూగుల్ డ్రైవ్ నుంచి ఫైల్స్‌ను తిరిగి పొందడం

గూగుల్ డ్రైవ్ PDFలు, డాక్యుమెంట్లు, స్ప్రెడ్‌షీట్‌ల లాంటి వాల్యూబుల్ ఫైల్స్‌ను స్టోర్ చేస్తుంది. అవి పొరపాటున డిలీట్ అయితే, ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి. ముందుగా బ్రౌజర్‌లో drive.google.com ఓపెన్ చేయాలి. లెఫ్ట్ సైడ్‌బార్‌లో ట్రాష్ క్లిక్ చేయాలి. మీ ఫైల్ అక్కడ ఉంటే, దానిపై రైట్-క్లిక్ చేసి రిస్టోర్ సెలెక్ట్ చేయాలి.

* డేటా లాస్ కాకుండా ఎలా కాపాడుకోవాలి

ముఖ్యమైన ఫైల్స్ ఫ్యూచర్‌లో పోకుండా ఉండాలంటే, ఈ బెస్ట్ ప్రాక్టీస్‌లు ఫాలో అవ్వాలి. ముఖ్యంగా గూగుల్ బ్యాకప్ ఇంకా గూగుల్ ఫొటోస్‌ ద్వారా రెగ్యులర్ బ్యాకప్‌లు ఎనేబుల్ చేయాలి. నమ్మకమైన SD కార్డ్‌ను యూజ్ చేయాలి. డేటా కరప్షన్ రాకుండా ఉండడానికి అప్పుడప్పుడు ఫార్మాట్ చేయాలి.

నమ్మకం లేని సోర్స్‌ల నుంచి థర్డ్-పార్టీ యాప్స్‌ను అవాయిడ్ చేయాలి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే ఇన్‌స్టాల్ చేయాలి. ఫోన్‌ను అప్‌డేట్ చేస్తూ ఉండాలి. ఇది సెక్యూరిటీని పెంచుతుంది. ఈ పద్ధతులు ఫాలో అవ్వడం ద్వారా, మీరు పోయిన డేటాను ఈజీగా తిరిగి పొందవచ్చు, మీ ఫైల్స్‌ను ఫ్యూచర్ లాస్ నుంచి కాపాడుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Recover deleted Android files using Google Backup, Photos, Drive, or recovery software. Enable backups to prevent data loss. Act quickly for best results recovering photos, videos, contacts and documents.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X