ప్రీఆర్డర్ పై ‘నోకియా లూమియా 620’: ఉత్తమ అనుకూలతలు

Posted By:

నోకియా నుంచి ఇటీవల ఆవిష్కరించబడిన బడ్జెట్ ఫ్రెండ్లీ విండోస్8 ఫోన్ ‘లూమియా 620' దేశీయ మార్కెట్లో విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటనల వెలువడలేదు. ఇండియన్ మార్కెట్లో మార్చి 12న ఈ హ్యాండ్‌సెట్‌ను విడుదల చేసే అవాకాశముందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ విండోస్ మొబైల్‌ను ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్డ్ (లింక్ అడ్రస్: ) రూ.15,199కి ప్రీఆర్డర్ పై ఆఫర్ చేస్తోంది. మరో రిటైలర్ ఇన్ఫీబీమ్ (లింక్ అడ్రస్:)రూ.2,000 ప్రీఆర్డర్ ధర పై డివైజ్‌ను బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తుంది.

మొబైల్, స్మార్ట్‌ఫోన్‌ ఇంకా ల్యాప్‌టాప్‌లకు సంబంధించి మరిన్నిఫోటో గ్యాలరీల చూసేందుకు క్లిక్ చేయండి:

స్పెసిఫికేషన్‌లు:

3.8 అంగుళాల WVGA కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్ఱంట్ కెమెరా,
నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్‌ఎఫ్‌సీ),
వై-ఫై, బ్లూటూత్,
1300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
కలర్ వేరియంట్స్: ఎల్లో, సియాన్, వైట్ , బ్లాక్, మెజింతాస
ప్రత్యేక ఫీచర్లు: నోకియా డ్రైవ్, సిటీ లెన్స్, నోకియా మ్యాప్స్, మిక్స్ రేడియో.

ప్రీఆర్డర్ పై ‘నోకియా లూమియా 620’: ఉత్తమ అనుకూలతలు

లూమియా 620ని కొనుగోలు చేసేందుకు ప్రత్యేక కారణాలు:

లూమియా 620 ప్రత్యేక బిజినెస్ టూల్స్‌ను కలిగి ఉంది. ఫోన్‌లో లోడ్ చేసిన వర్డ్, ఎక్సీల్, పవర్ పాయింట్, వన్ నోట్, షేర్ పాయింట్ వంటి ప్రత్యేక ఫీచర్లతో పీసీ తరహాలోనే డాక్యుమెంట్‌లను ఎడిట్ చేసుకోవచ్చు. హార్డ్‌వేర్ యాక్సిలరేటెడ్ ఎన్‌క్రిప్షన్, రిమోట్ లాకింగ్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు సురక్షిత వెబ్ బ్రౌజింగ్‌కు తోడ్పడతాయి. 7జీబి ఉచిత స్కై డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్‌ను ఫోన్ కొనుగోలు పై పొందవచ్చు. పొందుపరిచిన స్మార్ట్ షూట్ టెక్నాలజీ ఏకకాలంలో మల్టిపుల్ స్నాప్స్‌ను చిత్రీకరిస్తుంది. వాటిలో నచ్చినది ఎంపిక చేసుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot