నోకియా X నోకియా (ఫ్యామిలీ ఫైట్)

Posted By:

 నోకియా  X నోకియా (ఫ్యామిలీ ఫైట్)
సామ్‌సంగ్, హెచ్‌టీసీ, నోకియా వంటి గ్లోబల్ మొబైల్ బ్రాండ్‌లు పెద్ద మొత్తంలో స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నాయి. సామ్‌సంగ్ నుంచి విడుదలవుతున్న గెలాక్సీ సిరీస్ అలానే నోకియా నుంచి విడుదలవుతున్న లూమియా సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు ఇండియన్ మార్కెట్లో పెద్దఎత్తున ఆదరణ లభిస్తోంది. ఆండ్రాయిడ్ ఇంకా విండోస్ ఆపరేటింగ్ సిస్టంలను ఎంచుకున్న ఈ బ్రాండ్‌లు వివధ ధర శ్రేణుల్లో స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి. నోకియా విషయానికొస్తే ఇటీవల కాలంలో మూడు లూమియా సిరీస్ మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. వాటి పేర్లు లూమియా 920, లూమియా 820, లూమియా 620 (మార్కెట్లో విడుదల కావల్సి ఉంది). వీటిలో మొదటి రెండు మోడళ్లు అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్‌లు కాగా చివరి మోడల్ మధ్య ముగింపు వర్షన్ (ధర అంచనా రూ.16,000). ఈ సొగసరి హ్యాండ్‌సెట్‌లు విండోస్ ఫోన్8 ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తాయి. మరోవైపు బడ్జెట్ ఫ్రెండ్లీ ధర శ్రేణిలో లూమియా 510 మోడల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ డివైజ్ విండోస్ ఫోన్ 7.8 వోఎస్ పై రన్ అవుతుంది. ధర అంచనా రూ.9,999. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో నోకియా స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకుందామనుకునే వారి కోసం లూమియా 620, లూమియా 510 స్మార్ట్‌ఫోన్‌ల స్పెసిఫికేషన్‌ల పై విశ్లేషణ......

బరువు ఇంకా చుట్టుకొలత......

నోకియా లూమియా 620: చుట్టుకొలత 115.4 x 61.1 x 11మిల్లీమీటర్లు, బరువు 127 గ్రాములు,
నోకియా లూమియా 510: చుట్టుకొలత 120.7 x 64.9 x 11.5మిల్లీ మీటర్లు, బరువు 129 గ్రాములు,

డిస్‌ప్లే.......

నోకియా లూమియా 620: 3.8 అంగుళాల డబ్ల్యూవీజీఏ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్,
నోకియా లూమియా 510: 4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,

ప్రాసెసర్.....

నోకియా లూమియా 620: 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్,
నోకియా లూమియా 510: 800మెగాహెట్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం...

నోకియా లూమియా 620: విండోస్ ఫోన్ 8 అపోలో ప్లాట్ ఫామ్,
నోకియా లూమియా 510: విండోస్ ఫోన్ 7.8 ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా.....

నోకియా లూమియా 620: 5 మెగాపిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
నోకియా లూమియా 510: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, ఫ్రంట్ కెమెరా లేదు,


స్టోరేజ్...

నోకియా లూమియా 620: 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత,
నోకియా లూమియా 510: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

కనెక్టువిటీ.....

నోకియా లూమియా 620: వై-ఫై, బ్లూటూత్, మైక్రోయూఎస్డీ 2.0, ఎన్ఎఫ్‌సీ కనెక్టువిటీ
నోకియా లూమియా 510: వై-ఫై, బ్లూటూత్, మైక్రోయూఎస్డీ 2.0,

బ్యాటరీ......

నోకియా లూమియా 620: 1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బ్యాకప్ వివరాలు తెలియాల్సి ఉంది,
నోకియా లూమియా 510: 1300ఎమ్ఏహెచ్ బీపీ-3ఎల్ బ్యాటరీ (టాక్‌టైమ్ 6.2 గంటలు, స్టాండ్‌బై టైమ్ 653 గంటలు),

ధర......

నోకియా లూమియా 620: అంచనా ధర రూ.16,000.
నోకియా లూమియా 510: రూ.9,999.

ప్రత్యేకతలు......

నోకియా లూమియా 620: 7జీబి ఉచిత స్కై డ్రైవ్ స్టోరేజ్,
నోకియా లూమియా 510: 7జీబి ఉచిత స్కై డ్రైవ్ స్టోరేజ్,

తీర్పు......

తక్కువ ధర ఇంకా పెద్ద డిస్‌ప్లేను కోరుకునే వారికి లూమియా 510 బెస్ట్ ఛాయిస్. అలాగే.. వీడియో కాలింగ్, వేగవంతమైన డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ఇంకా ఎన్ఎఫ్‌సీ కనెక్టువిటీ కోరుకునే వారికి లూమియా 620 బెస్ట్ ఆప్షన్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot