జనవరి 10, నోకియా అభిమానులకు పండగే!

విశ్వసనీయ మొబైల్ తయారీ బ్రాండ్ నోకియా ఇండియాలో తన లూమియా సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల విడుదలకు శ్రీకారం చుట్టుంది. నోకియా తన లూమియా సిరీస్ నుంచి ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసిన లూమియా 920, లూమియా 820 విండోస్ 8 స్మార్ట్‌ఫోన్‌లను గురువారం (జనవరి 10,2013) న్యూఢిల్లీలో విడుదల చేయనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి నోకియా ఇండియా ఇప్పటికే ఆహ్వాన పత్రాలను స్థానిక మీడియాలకు పంపినట్లు తెలుస్తోంది.
లూమియా 920 స్పెసిఫికేషన్‌లు:
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
4.5 అంగుళాల నోకియా ప్యూర్ మోషన్ హైడెఫినిషన్+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
1.5గిగాహెట్జ్ డ్యూయల్-కోర్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
8.7మెగా పిక్సల్ ప్యూర్ వ్యూ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, కార్ల్‌జిస్ ఆప్టిక్స్),
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ),
వైర్‌లెస్ ఛార్జింగ్, మైక్రోయూఎస్బీ వీ2.0, యూఎస్బీ ఆన్-ద-గో సపోర్ట్,
2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
లూమియా 820:
విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
4.3 అంగుళాల క్లియర్ బ్లాక్ ఆమోల్డ్ డిస్‌ప్లే,
రిసల్యూషన్800x 480పిక్సల్స్,
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ,
8 మెగా పిక్సల్ ఆటోఫోకస్ కెమెరా (ఆటో ఫోకస్, కార్లజిస్ ఆప్టిక్స్),
వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ),
మైక్రోయూఎస్బీ వీ2.0,
1650ఎమ్ఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








