ప్రపంచంలోనే ఫస్ట్ నైట్ కెమెరా ఫోన్

Written By:

ప్రముఖ డానిష్ టెక్నాలజీ కంపెనీ లుమిగాన్, నైట్ విజన్ కెమెరా టెక్నాలజీతో కూడిన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. లుమిగాన్ టీ3 పేరుతో ఆవిష్కరించబడిన ఈ ఫోన్ కటిక చీకట్లోనూ క్లారిటీ ఫోటోలను చిత్రీకరిస్తుంది.

ప్రపంచంలోనే ఫస్ట్ నైట్ కెమెరా ఫోన్

ఈ పోన్ బేస్ మోడల్ ధర 925 డాలర్లు. మన కరెన్సీలో ఈ విలువ రూ.61,748. లుమిగాన్ ఈ ఫోన్‌ను 24 క్యారెట్ గోల్డ్ ఎడిషన్‌లో అందించే ప్రయత్నం చేస్తోంది. బ్లాక్ గోల్డ్ వేరియంట్ ధర 1200 డాలర్లు. మన కరెన్సీలో రూ.80,000. ఫోన్ ప్రత్యేకతలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More : మీ పాత ఫోన్ పై రెట్టింపు లాభం రావాలంటే..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లుమిగాన్ టీ3 స్పెసిఫికేషన్స్

లుమిగాన్ టీ3 ఫోన్ ప్రత్యేకమైన ఇన్నోవేటివ్ డిజైన్‌తో వస్తోంది. ఫోన్ లుక్ ఇంకా ఫీల్ కంఫర్ట్‌గా ఉంటుంది. బ్యాక్ టచ్, నైట్‌విజన్, 3డీ ఫింగర్ ప్రింట్, స్టీరియో స్పీకర్స్ వంటి విప్లవాత్మక ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.

 

లుమిగాన్ టీ3 స్పెసిఫికేషన్స్....


మెరైన్ గోల్డ్ 316 స్టెయిన్‌లెస్ స్టీల్ వంటి ప్రీమియమ్ స్థాయి లోహాలను ఉపయోగించి లుమిగాన్ టీ3 ఫోన్‌ను బిల్డ్ చేసారు. డిస్‌ప్లే మన్నికను రెట్టింపు చేసే క్రమంలో ఫైబర్ గ్లాస్, గొరిల్లా గ్లాస్ 4 వంటి దృఢమైన ప్రొటక్షన్ వ్యవస్థను ఏర్పాటు చేసారు. డస్ట్ ఇంకా వాటర్ రిసిస్టెంట్ ఫీచర్లు ప్రమాదాల నుంచి ఫోన్‌ను కాపాడతాయి.

లుమిగాన్ టీ3 స్పెసిఫికేషన్స్....

లుమిగాన్ టీ3 ఫోన్ 4.8 అంగుళాల హైడెఫినిషన్ 720 పిక్సల్ సూపర్ అమోల్డ్ డైమండ్ డిస్‌ప్లేతో వస్తోంది.

 

లుమిగాన్ టీ3 స్పెసిఫికేషన్స్....

లుమిగాన్ టీ3 ఫోన్ వెనుక భాగంలో 13 మెగా పిక్సల్ 4కే రిసల్యూషన్ కెమెరాను ఏర్పాటు చేసారు. వేగవంతమైన ఆటో ఫోకస్, ఫేస్ డిటెక్షన్ ఆటోఫోకస్ వంటి ఫీచర్లు నాణ్యమైన ఫోటోగ్రఫీని చేరువచేస్తాయి. కెమెరాను ఆపరేట్ చేసేందుకు ప్రత్యేకమైన ఫిజకల్ బటన్‌ను ఫోన్‌లో ఏర్పాటు చేసారు. ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ హైడెఫినిషన్ కెమెరా తక్కువ వెళుతురులోనూ హైక్వాలిటీ సెల్ఫీలను అందిస్తుంది.

 

లుమిగాన్ టీ3 స్పెసిఫికేషన్స్....

లుమిగాన్ టీ3 ఫోన్ వెనుక భాగంలో 4 మెగా పిక్సల్ నైట్ విజన్ కెమెరాను మనం చూడొచ్చు.ఈ కెమెరా వ్యవస్థలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన ఐఆర్ సెన్సార్లు చిమ్మ చీకట్లోనూ హైక్వాలిటీ ఫోటోగ్రఫీ ఇంకా వీడియో రికార్డింగ్‌ను అందిస్తాయి. ఫోన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన యాక్షన్ కీ ద్వారా నైట్ విజన్ కెమెరాను ఆపరేట్ చేయవచ్చు.

 

లుమిగాన్ టీ3 స్పెసిఫికేషన్స్....

ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన బ్యాక్ టచ్ ఫీచర్ ద్వారా ఫోన్‌ను పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు.

 

లుమిగాన్ టీ3 స్పెసిఫికేషన్స్....

లుమిగాన్ టీ3 ఫోన్‌లో హైసెక్యూర్ వాల్ట్ ఫీచర్‌ను ఏర్పాటు చేసారు. ఈ వాల్ట్‌లో ఫోటోలు, కాంటాక్ట్స్, యాప్స్ ఇంకా డాక్యుమెంట్‌లను సేఫ్‌గా భద్రపరుచుకోవచ్చు.

లుమిగాన్ టీ3 స్పెసిఫికేషన్స్....

లుమిగాన్ టీ3 ఫోన్‌ను యూనివర్శల్ రిమోట్ కంట్రోల్‌లా ఉపయోగించుకోవచ్చు. ఎయిర్ కండీషనర్, టీవీ, ఆడియో ఇంకా ఇతర గృహోపకరణాలను లుమిగాన్ టీ3 ఫోన్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు.

లుమిగాన్ టీ3 స్పెసిఫికేషన్స్....

లుమిగాన్ టీ3 ఫోన్ ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. 2.2గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lumigon T3: World's First Night Vision Camera Phone. Read more in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot