షాకిచ్చిన దేశీయ దిగ్గజం, రూ.899కే సెల్ఫీ కెమెరా ఫోన్

Written By:

దేశీయ మొబైల్ రంగంలో దూసుకుపోయేందుకు సిద్ధమైన ఎం.టెక్‌ దిగ్గజాలకు షాకిచ్చింది. అత్యంత తక్కువ ధరలో మొబైల్స్ ను లాంచ్ చేసిన Airtel, Jio, Micromax, Lava, కార్బూన్ లాంటి కంపెనీలను టార్గెట్ చేస్తూ జీ 24పేరుతో ఓ సెల్ఫీ ఫీచర్ ఫోన్‌ను రిలీజ్ చేసింది.

గూగుల్ సెర్చ్ నుంచి అదిరే ఫీచర్, ఒకేసారి రెండు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కేవలం రూ. 899కే

ప్రముఖ మొబైల్‌, టెలికాం కంపెనీలన్నీ రూ.1000-1500 మధ్య ఫీచర్‌ ఫోన్‌ తీసుకొస్తే. ఎం.టెక్‌మాత్రం కేవలం రూ. 899 లుగా దీని ధరను ప్రకటించడం విశేషం.

జీ 24 ఫీచర్లు

1.8 అంగుళాల డిస్‌ప్లే,
1000 ఎంఏహెచ్‌ బ్యాటరీ,
డ్యుయల్‌ సిమ్‌,
డ్యుయల్‌ డిజిటల్‌ కెమెరా
16జీబీ దాకా ఇంటర్నల్‌​ మొమరీ విస్తరణ
7గంటల టాక్‌ టైం
300 గంటల స్టాండ్‌ బై
5 భాషల సపోర్ట్
MP3/MP4/WAV player,
wireless FM radio,
Bluetooth,
audio/video recording,
auto call record
torch light

5 భాషల సపోర్ట్

ఎంటెక్‌ ఇన్‌ఫర్మటిక్స్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ గౌతం కుమార్‌ మాట్లాడుతూ ఈ ఫోన్ English, Hindi, Kannada, Telugu, and Bengali భాషలను సపోర్ట్ చేస్తుందని చెప్పారు. Black, Red, Blue, Grey and Brown రంగుల్లో ఈ ఫోన్ వినియోగదారులను అలరించనుంది.

దేశం మొత్తం మీద 20 వేల అవుట్ లెట్లు

కంపెనీకి దేశం మొత్తం మీద 20 వేల అవుట్ లెట్లు ఉన్నాయి. ఈ ఫోన్ మీద ఆసక్తి ఉన్నారు ఆ అవుట్ లెట్లలో ఫోన్ కొనుగోలు చేయవచ్చు. అలాగే ప్రముఖ ఈ కామర్స్ సైట్లు అయిన Amazon, Flipkartలలో ఈ ఫోన్ లభిస్తుందని కంపెనీ తెలిపింది.

సోషల్ మీడియాను సపోర్ట్ ..?

అయితే ఈ ఫోన్ సోషల్ మీడియాను సపోర్ట్ చేస్తుందా లేదా అనేది ఇంకా తెలియలేదు. వాట్సప్, గూగుల్ సెర్చ్, ఫేస్ బుక్ లాంటి పీచర్లు ఉన్నాయా లేవా అన్నది కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
M-tech G24 feature phone with selfie camera launched in India for Rs. 899 More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot