రూ. 4,799కే Eros 4జీ వోల్ట్ స్మార్ట్‌ఫోన్

Posted By: ChaitanyaKumar ARK

M -Tech మొబైల్స్ అనే సంస్థ ఇండియాలో సరికొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. Eros Smart అను పేరుతో వస్తున్న ఈ మొబైల్ 4,799 రూపాయలకు రిలీజ్ చేసింది. ఈ మొబైల్ బ్లాక్,గోల్డ్ మరియు రోస్ గోల్డ్ రంగులలో రానుంది. దేశవ్యాప్తంగా 20,000 ఆఫ్లైన్ రీటైల్ దుకాణాలలో మరియు ఈ- కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్ డీల్ మరియు షాప్ క్లూస్ లలో ప్రత్యేకంగా అందుబాటులోకి రానుంది. ఇక స్పెసిఫికేషన్స్ పరoగా వస్తే, ఈ M-Tech ఈరోస్ స్మార్ట్ ఫోన్ 5 inch IPS LCD డిస్ప్లే, HD రిసొల్యూషన్ తో , క్వాడ్ కోర్ 1.3 GHZ ప్రాసెసర్, 1 GB రామ్, 8 GB అంతర్గత మెమొరీ, 32GB మెమొరీ ను కార్డ్ స్లాట్ ద్వారా పెంచుకునే వెసులుబాటుతో వస్తుంది.ఇక కెమరా విషయానికి వస్తే, 5 MP రేర్ కెమరా, ఫ్లాష్, 2MP ఫ్రంట్ కెమరా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ OS తో వస్తున్న ఈ మొబైల్ , 2400 mah బాటరీ కలిగి ఉండి 6-7 గంటల టాక్ టైమ్ ఇస్తుంది.

రూ. 4,799కే Eros 4జీ వోల్ట్ స్మార్ట్‌ఫోన్

బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అయినా కూడా ఫింగర్ ప్రింట్ స్కానర్, 4g వోల్ట్, OTG , GPS, blootooth, వైఫై , ప్రాక్సీమిటీ సెన్సార్, రికార్డింగ్ ఫీచర్ తో FM రేడియో వంటి అన్నీ రకాల ఫీచర్లను కలిగి ఉండడం ఆహ్వానించదగ్గ విషయం. బడ్జెట్ లో 5 వేల లోపు మొబైల్ కావాలి అనుకునే వారికి సరైన స్మార్ట్ ఫోన్ గా ఉంటుంది అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్, పని తీరు, మన్నిక, దృఢత్వం అన్నీ అంశాల ప్రకారం బడ్జెట్ ఫోన్స్ సెగ్మెంట్ లో అన్నీ బెంచ్ మార్క్ టెస్టులను దాటుకుని మంచి పోటీని ఇవ్వడానికి వస్తుంది అని M-Tech Informatics Ltd, Co- Founder Mr.గౌతమ్ కుమార్, స్మార్ట్ ఫోన్ లాంచింగ్ సమయంలో తెలిపారు.

ఐపీఎల్ 2018 కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్

మరియు దేశం మొత్తం మీద 600+ సర్వీసు సెంటర్లను కలిగి ఉండి, వినియోగదారులకు అన్నిరకాలుగా అందుబాటులో ఉంటుందని తెలిపారు. తద్వారా ఈ స్మార్ట్ ఫోన్ వినియోగదారుల మనుసు చూరగొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. M-Tech మొబైల్ ఇంతకు ముందే FOTO 3 అనే స్మార్ట్ ఫోన్ ను 4,499 రూపాయలకు లాంచ్ చేసింది. ఈ Foto3, Eros-smart ఫీచర్లను ఇంచుమించు పోలి ఉంటుంది. కాకపోతే Eros-స్మార్ట్ ఫోన్, డిస్ప్లే రిసొల్యూషన్ పరoగా కెమరా సెగ్మెంట్ పరంగా అప్గ్రేడ్ చేయబడింది. ఇక్కడ ఆండ్రాయిడ్ OEMs, ధరలను బట్టి నిర్ణయాలు తీసుకునే ఇండియా వంటి దేశాలలో ఎక్కువగా బడ్జెట్ ఫోన్ల మీదనే దృష్టి కేంద్రీకరించాయి.

English summary
M-tech Mobile launches Eros Smart budget smartphone at Rs. 4,799 More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot