4000mAh బ్యాటరీతో Shine M815 4జీ ఫోన్, ధర రూ. 4,999 మాత్రమే !
దేశీయ దిగ్గజం మాఫే మొబైల్ అత్యంత తక్కువ ధరలో 4జీ ఫోన్ ని లాంచ్ చేసింది.
దేశీయ దిగ్గజం మాఫే మొబైల్ అత్యంత తక్కువ ధరలో 4జీ ఫోన్ ని లాంచ్ చేసింది. షైన్ ఎం815 పేరుతో వచ్చిన ఈ 4జి మొబైల్ ధరను కంపెనీ రూ 4,999గా నిర్ణయించింది. డ్యూయల్ సిమ్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీతో 15గంటల టాక్ టైంను ఈ ఫోన్ అందిస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే..

మాఫే 'షైన్ ఎం815' స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు
5 అంగుళాల డిస్‌ప్లే
480 x 854
1.3 గిగాహెట్జ్ క్వాడ్-కోర్ స్పెడ్‌ట్రం ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్
1 జీబి ర్యామ్
16 జీబీ ఇంటర్నల్ మెమరీ
64 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం
5ఎంపీ వెనుక కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
2ఎంపీ సెల్ఫీ కెమెరా
4000ఎంఏహెచ్ బ్యాటరీ


Click it and Unblock the Notifications








