ఆ ఇద్దరి కాంభినేషన్‌లో.....

Posted By: Prashanth

ఆ ఇద్దరి కాంభినేషన్‌లో.....

 

ప్రముఖ మొబైల్ నెట్‌‍వర్క్ ప్రొవైడర్ ఎయిర్‌సెల్ ... మ్యాజికాన్ ఇంపెక్స్‌తో జతకట్టి కొత్తశ్రేణి డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తెచ్చింది. మ్యాజికాన్ ఎం1, మ్యాజికాన్ ఎం2, మ్యాజికాన్ ఎంనోట్ మోడళ్లలో డిజైన్ కాబడిన ఈ డ్యూయల్ సిమ్ హ్యాండ్‌సెట్‌లు 3జీ సామర్ధ్యాన్ని కలిగి ఉన్నాయి. యువతను దృష్టిలో ఉంచుకని వీటిని డిజైన్ చేసినట్లు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ల ఎంపిక పై ఎయిర్‌సెల్ ఆకర్షణీయమైన వాయిస్ ఇంకా డాటా ప్లాన్‌లను ఆఫర్ చేస్తోంది.

స్పెసిఫికేషన్‌లు.......

మ్యాజికాన్ ఎం1: 3.5 అంగుళాల డబ్ల్యూవీజీఏ అల్ట్రాటచ్ స్ర్కీన్ డిస్‌ప్లే, సింగిల్ కోర్ 1గిగాహెడ్జ్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రెంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 2జీ కనెక్టువిటీ, బ్లూటూత్, వై-ఫై. (ప్రీలోడెడ్ అప్లికేషన్‌లు .... స్కైప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, యాంగ్రీ‌బర్డ్స్, ఫ్రూట్ నింజా), ధర రూ.4,499.

మ్యాజికాన్ ఎం2: 3.5 అంగుళాల డబ్ల్యూవీజీఏ అల్ట్రాటచ్ స్ర్కీన్ డిస్‌ప్లే, సింగిల్ కోర్ 1గిగాహెడ్జ్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 3జీ కనెక్టువిటీ, బ్లూటూత్, వై-ఫై. (ప్రీలోడెడ్ అప్లికేషన్‌లు .... స్కైప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, యాంగ్రీ‌బర్డ్స్, ఫ్రూట్ నింజా), ధర రూ.4,999.

మ్యాజికాన్ ఎంనోట్: 5 అంగుళాల అల్ట్రాటచ్ టచ్‌స్ర్కీన్, డ్యూయల్ కోర్ 1గిగాహెడ్జ్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, 8మెగాపిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియా కాలింగ్ నిర్వహించుకునేందుకు), 3జీ, వై-ఫై, బ్లూటూత్, 2,000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, (ప్రీలోడెడ్ అప్లికేషన్‌లు .... స్కైప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, యాంగ్రీ బర్డ్స్, ఫ్రూట్ నింజా), ధర రూ.9,999.

4జీబి మెమరీ కార్డుతో.......

ఈ ఫోన్‌ల పై 4జీబి మెమరీ కార్డ్‌లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. 18 నెలలు వారంటీ కూడా.

ఎయిర్‌సెల్ ప్లాన్‌లు......

ఈ ఫోన్‌ల పై ఎయిర్‌సెల్ ఆకర్షణీయమైన వాయిస్ ఇంకా డాటా ప్లాన్‌లను అందిస్తోంది. ఆఫర్‌లో భాగంగా యూజర్ 250 నిమిషాల ఉచిత టాక్‌టైమ్, 250 ఉచిత ఎస్ఎంఎస్‌లు, 1జీబి డేటాను మూడు నెలల వ్యాలిడిటీతో పొందవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot