భారీ ఆఫర్లతో ప్రారంభమైన LeEco సేల్, ఫోన్ పగిలినా ఫ్రీ సర్వీసింగ్

LeEco సొంత ఈ-కామర్స్ మార్కెట్ ప్లేస్ అయిన LeMall.com దీపావళి పండుగను పురస్కరించుకుని "LeMall For All" దివాళీ ఎడిషన్ షాపింగ్ ఈవెంట్‌ను మంగళవారం ఇండియాలో ప్రారంభించింది.

 భారీ ఆఫర్లతో ప్రారంభమైన LeEco సేల్, ఫోన్ పగిలినా ఫ్రీ సర్వీసింగ్

అక్టోబర్ 20 వరకు జరగనున్న ఈ మూడు రోజుల షాపింగ్ ఫెస్ట్‌లో భాగంగా అన్ని రకాల లీఇకో ఉత్పత్తుల పై భారీ నుంచి అతిభారీ డిస్కౌంట్‌లను లీఇకో ఆఫర్ చేస్తోంది. ఈ షాపింగ్ ఈవెంట్‌లో పాల్గొనే లీఇకో కస్టమర్‌లు, లక్షన్నర విలువ చేసే అల్ట్రా ప్రీమియమ్ Max65 3D టీవీ గెలుచుకునే అవకాశం కూడా కల్పించారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.5,000 వరకు తగ్గింపు

ఈ మూడు రోజుల సేల్2లో భాగంగా లీమాక్స్2 ఫోన్ పై రూ.5,000, లీ2 ఫోన్ పై రూ.1,000 తగ్గింపును లీఇకో ఆఫర్ చేస్తోంది. ఈ సూపర్‌ఫోన్స్ కోనుగోలు పై ICICI అలానే HDFC క్రెడిట్, డెబిట్ కార్డ్ యూజర్లు అదనంగా 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.

లీకేర్ ప్రొటెక్షన్ ప్లాన్‌

ఇవే కాకుండా తన ప్రతి సూపర్‌ఫోన్స్ కొనుగోలు పై లీకేర్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను లీఇకో ఆఫర్ చేస్తుంది. ఈ ప్రొటెక్షన్ ప్లాన్‌లో భాగంగా మీ ఫోన్‌కు యాక్సిడెంటల్ లేదా లిక్విడ్ డామెజ్‌లు ఏర్పడినట్లయితే కంపెనీ సిబ్బంది మీ ఇంటికి వచ్చి ఫోన్ తీసుకువెళ్లి రిపేర్ చేసి ఇస్తారు. మీరు ఎటుంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆడియో అలానే మొబైల్ యాక్సెసరీస్ పై..

ఈ సేల్‌లో భాగంగా లీఇకో తన ఆడియో అలానే మొబైల్ యాక్సెసరీస్ పై 20 నుంచి 40 శాతం వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేస్తుంది. . లీఇకో బ్లుటూత్ స్పీకర్స్, బ్లుటూత్ హెడ్‌ఫోన్స్ ఇంకా అన్ని రకాల మెటల్ ఇయర్ ఫోన్స్ పై రూ.5,00, రూ.750, రూ.250 తగ్గింపును పొందవచ్చు. రివర్స్ ఇన్-ఇయర్ హెడ్‌ఫోన్స్, మొబైల్ కేసెస్ అండ్ కవర్స్ ఇంకా రింగ్ బ్రాకెట్స్ పై రూ.200 వరకు డిస్కౌంట్ లభించే అవకాశం.

సూపర్‌టీవీల పైనా ఆకర్షణీయమైన ఆఫర్లు...

ఈ సేల్‌లో భాగంగా లీఇకో తన సూపర్ టీవీల పైనా ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. ఈ సూపర్‌ టీవీల కోనుగోలు పై ICICI అలానే HDFC క్రెడిట్, డెబిట్ కార్డ్ యూజర్లు అదనంగా రూ.4000 వరకు  క్యాష్‌బ్యాక్‌ను పొందటంతో పాటు 12 నెలల వడ్డీ రహిత EMIలను చెల్లించవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Super3 X55 టీవీ కొనుగోలు పై

లీఇకో 55 ఇంచ్ Super3 X55 టీవీ కొనుగోలు పై అదనంగా 4 సంవత్సరాల ప్యానల్ వారంటీతో పాటు రెండు సంవత్సరాల సినిమా అలానే లైవ్ టీవీ సబ్‌స్ర్కిప్షన్ మీకు లబిస్తుంది.

లీఇకో అసలు పేరు Letv

లీఇకో అసలు పేరు Letv, చైనా ప్రధాన కేంద్రంగా పనిచేస్తోన్న ఈ ఇంటర్నెట్ అండ్ టెక్నాలజీ కంపెనీ డిజిటల్ టెక్నాలజీ విభాగంలో దూసుకుపోతుంది. Jia Yueting, Liu Hongలు ఈ సంస్థను నవంబర్ 2004లో ప్రారంభించారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రపంచపు మొట్టమొదటి వీడియో కంపెనీగా..

ఈ కంపెనీలో 10,000కు పైగా ఉద్యోగులు ఉన్నారు. ప్రపంచపు మొట్టమొదటి వీడియో కంపెనీగా మార్కెట్లోకి అడుగుపెట్టిన LeEcoకు వ్యాపార పెట్టుబడుల రూపంలో 12 బిలియన్ యూస్ డాలర్లు ఉన్నాయి. చైనాలోని బీజింగ్ లో ప్రధాన కార్యాలయం, హాంగ్ కాంగ్, లాస్ యాంజిల్స్ ఇంకా సిలికాన్ వ్యాలీలలో ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Make this Diwali memorable with “LeMall For All” from Oct 18 to Oct 20. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot