దేశమంతటా OnePlus 6T ఫీవర్!

న్యూఢిల్లీ వేదికగా అక్టోబర్ 29న నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్‌లో భాగంగా వన్‌ప్లస్ 6టీ (OnePlus 6T) భారీ అంచనాల మధ్య ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన విషయం తెలిసిందే.

|

న్యూఢిల్లీ వేదికగా అక్టోబర్ 29న నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్‌లో భాగంగా వన్‌ప్లస్ 6టీ (OnePlus 6T) భారీ అంచనాల మధ్య ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన విషయం తెలిసిందే. ఈ ఫోన్ గతంలో లాంచ్ అయిన ఇతర వన్‌ప్లస్ మోడల్స్ తరహాలోనే పెర్ఫామెన్స్ స్థాయిని మరో లెవల్‌కు తీసుకువెళ్లింది. వన్‌ప్లస్ 6టీ లాంచ్ ఈవెంట్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న వన్‌ప్లస్ అభిమానులు ఓ పండుగలా జరుపుకున్నారు. ఇదే సమయంలో ఈ ఫోన్‌ను తొలిగా దక్కించుకునేందుకు చాలా మంది ప్రయత్నించారు.

 

12 లొకేషన్‌లలో పాప్-అప్స్ ఈవెంట్స్..

12 లొకేషన్‌లలో పాప్-అప్స్ ఈవెంట్స్..

ఈ విధమైన డిమాండ్‌ను ముందుగానే అంచనా వేసిన వన్‌ప్లస్ నవంబర్ 2న దేశవ్యాప్తంగా 12 లొకేషన్‌లలో పాప్-అప్స్ (pop-ups) ఈవెంట్‌లను నిర్వహించింది. 9 ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేసిన ఈ పాప్-అప్స్ ఈవెంట్స్‌కు వన్‌ప్లస్ అభిమానులతో పాటు ఫోన్ కొనుగోలుదారులు భారీగా తరలివచ్చి తన ఫేవరెట్ స్మార్ట్‌ఫోన్‌ను హ్యాండ్స్‌ఆన్ ఎక్స్‌పీరియన్స్ చేయటంతో పాటు కొనుగోలు చేసారు. పాప్-అప్స్ ఈవెంట్స్‌కు హాజరై వన్‌ప్లస్ 6టీ డివైస్ ను కొనుగోలు చేసిన యూజర్లకు వన్‌ప్లస్ 6టీ ఫోన్ కవర్స్ ఇంకా బంపర్స్, వన్‌ప్లస్ స్కెచ్ బుక్, వన్‌ప్లస్ నెవర్-సెటిల్ టీ-షర్ట్స్, వన్‌ప్లస్ టోట్ బ్యాగ్స్ వంటి బహుమతులను ఈవెంట్ నిర్వాహకులు అందించారు.

భారీ క్యూలైన్లు కనిపించాయి...

భారీ క్యూలైన్లు కనిపించాయి...

వన్‌ప్లస్ 6టీ పాప్-అప్స్ ఈవెంట్‌లకు వేలాది మంది వన్‌ప్లస్ కమ్యూనిటీ మెంబర్స్‌తో పాటు ఫోన్ కొనుగోలుదారులు హాజరయ్యారు. దీంతో ఈవెంట్స్ వద్ద భారీ క్యూలైన్లు కనిపించాయి.ఫోన్‌ను తొలిగా దక్కించుకోవాలనుకున్న కొంత మంది అభిమానులు ఈవెంట్‌కు ముందు రోజు రాత్రే వన్‌ప్లస్ బెంగుళూరు ఎక్స్‌పీరియన్స్ స్టోర్ ముందు క్యాంప్ ఏర్పాటు చేసుకోవటం విశేషం.

 

 

క్యూలో 62 సంవత్సరాల వన్‌ప్లస్ అభిమాని..
 

క్యూలో 62 సంవత్సరాల వన్‌ప్లస్ అభిమాని..

చెన్నైలో నిర్వహించిన పాప్-అప్స్ ఈవెంట్‌లో ఓ ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. ఈ ఫ్లాగ్‌షిప్ డివైస్‌ను దక్కించుకునేందుకు ఓ 62 సంవత్సరాల వన్‌ప్లస్ అభిమాని క్యూలైన్‌లో నిలుచొని అందరికి ఆశ్చర్యానికి గురిచేసారు. వెంటనే స్పందించిన ఈవెంట్ నిర్వాహకులు సదరు అభిమానిని క్యూలైన్‌లో నిలబెట్టకుండా సాదరంగా స్టోర్‌లోకి ఆహ్వానం పలికి ఫోన్‌ను అందించారు. మరో ఘటనలో భాగంగా కొందరు మిత్రులు వన్‌ప్లస్ 6టీని సొంతం చేసుకునేందుకు ఉదయ్‌పూర్ నుంచి రాజస్థాన్ వరకు 250 కిలోమీటర్ల మేర బైక్ ప్రయాణం చేసి పాప్-అప్స్ ఈవెంట్‌కు హాజరయ్యారు.

ఇన్-స్క్రీన్  ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో..

ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో..

ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వచ్చిన మొట్టమొదటి వన్‌ప్లస్ ఫోన్‌గా వన్‌ప్లస్ 6టీ గుర్తింపు తెచ్చుకుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో ఎక్విక్ చేసిన ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కేవలం 0.32 సెకన్ల వ్యవధితో ఫోన్‌ను అన్‌లాక్ చేయగలుగుతుందట. ఒప్పో, వివో స్మార్ట్‌ఫోన్స్ తరహాలో వన్‌ప్లస్ 6టీ కూడా వాటర్‌డ్రాప్ నాట్చ్‌తో వస్తోంది. గ్లాస్ డిజైన్‌తో వస్తోన్న OnePlus 6Tలో 6.4 ఇంచ్ ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ప్లేను వన్‌ప్లస్ ఎక్విప్ చేసింది. ఈ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేను కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్ట్ చేస్తుంది. 19.5:9 యాస్పెక్ట్ రేషియోతో వస్తోన్న ఈ డిస్‌ప్లేలో sRGB, DCI-P3, అడాప్టివ్ కలర్స్ వంటి ఐదు కలర్ సెట్టింగ్స్ అందుబాటులో ఉంటాయి. వీటిని సందర్భాన్ని బట్టి ఉపయోగించుకోవచ్చు.

 

 

మూడు వేరియంట్‌లలో..

మూడు వేరియంట్‌లలో..

ఆండ్రాయిడ్ 9.0 పై ఆపరేటింగ్ సిస్టిం పై ఫోన్ రన్ అవుతుంది. ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 సాక్‌ను ఈ ఫోన్‌లో ఎక్విప్ చేసారు. ర్యామ్ ఇంకా స్టోరేజ్ ఆప్షన్స్ విషయానికి వచ్చేసరికి వన్‌ప్లస్ 6టీ మూడు రకాల కాన్ఫిగరేషన్స్‌లో అందుబాటులో ఉంటుంది. అందులో మొదటి కాన్ఫిగరేషన్ వచ్చేసరికి 6జీబి ర్యామ్ + 128జీబి స్టోరేజ్‌తోనూ, రెండవ వేరియంట్ వచ్చేసరికి 8జీబి ర్యామ్ + 128జీబి స్టోరేజ్‌తోనూ, మూడవ కాన్ఫిగరేషన్ వచ్చేసరికి 8జీబి ర్యామ్ + 256జీబి స్టోరేజ్ ఆప్షన్‌తోనూ అందుబాటులో ఉంటుంది.

 

 

డ్యుయల్ కెమెరా సెటప్..

డ్యుయల్ కెమెరా సెటప్..

ఇక కెమెరా స్పెక్స్ విషయానికి వచ్చేసరికి, OnePlus 6T వెనుక భాగంలో ఏర్పాటు చేసిన డ్యుయల్ కెమెరా సెటప్ 16 మెగా పిక్సల్ + 20 మెగా పిక్సల్ కాంభినేషన్‌లో ఉంటుంది. ఈ రెండు సెన్సార్స్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో పాటు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ను సపోర్ట్ చేస్తాయి. ఇదే సమయంలో 480 పిక్సల్ స్లో మోషన్‌లో ఇవి వీడియోలను క్యాప్చుర్ చేయగలగుతాయి.

 

 

క్కువు వెళుతురు కండీషన్స్‌లోనూ..

క్కువు వెళుతురు కండీషన్స్‌లోనూ..

ఈ కెమెరా సెటప్‌లో యాడ్ చేసిన నైట్‌స్కేప్ మోడ్ తక్కువు వెళుతురు కండీషన్స్‌లోనూ హైక్వాలిటీ ఫోటోగ్రఫీని ఆఫర్ చేయగలుగుతుందట. పోర్ట్రెయిట్ షాట్స్‌ను మరింత అందంగా మలిచే క్రమంలో స్టూడియో లైట్నింగ్ మోడ్‌ను వన్‌ప్లస్ ఈ కెమెరాలో యాడ్ చేసింది. ఫోన్ ముందు భాగంలో ఎక్విప్ చేసిన 20 మెగా పిక్సల్ షూటర్ f/1.7 అపెర్చుర్ తో హై-క్వాలిటీ వీడియ కాలింగ్ తో పాటు సెల్ఫీలను ప్రొడ్యూస్ చేస్తుంది.

ఇక బ్యాటరీ విఫయానికి వచ్చేసరికి 6టీ డివైస్‌లో 3,700mAh బ్యాటరీని వన్‌ప్లస్ లోడ్ చేసింది. ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ బ్యాటరీ సపోర్ట్ చేస్తుంది. ఇక కెనెక్టువిటీ ఫీచర్స్ విషయానికి వచ్చేసరికి ఈ డివైస్‌లో 4జీ వోల్ట్, బ్లుటూత్ 5.0, జీపీఎస్, గ్లోనాస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి ముఖ్యమైన ఫీచర్స్ ఈ డివైస్‌లో ఉన్నాయి.

 

 

Best Mobiles in India

English summary
Massive queues at Pop-ups event show OnePlus rules the smartphone market.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X