ఏ వైపు నుండైనా ఫోటో.. అదే స్పెషల్

Posted By: Staff

ఏ వైపు నుండైనా ఫోటో.. అదే స్పెషల్

మ్యాక్స్ మొబైల్ కమ్యూనికేషన్ లిమిటెడ్ కొత్తగా మార్కెట్లోకి 'మ్యాక్స్ డిట్టో ఎమ్‌ఎక్స్ 222' అనే మొబైల్ ఫోన్‌ని విడుదల చేయనుంది. ఈ మొబైల్ ఫోన్ స్పెషాలిటీ ఏంటంటే రెండు స్క్రీన్స్‌(డ్యూయల్ డిస్ ప్లే)ని కలిగి ఉంది. ఒకే స్లైడ్‌లో స్క్రీన్, కీప్యాడ్‌ని కలిగి ఉండడమే ఈ మొబైల్ ప్రత్యేకత. అంతేకాదండొయ్ ఇందులో ఉన్న 1.3 మెగా ఫిక్సల్ డ్యూయల్ కెమెరా సహాయంతో ఏ వైపు నుండైనా యూజర్ ఫోటోలను తీసుకొవచ్చు. ఇందులో నిక్షిప్తమైన 'ఈమోట్ టాక్' అప్లికేషన్ ద్వారా యూజర్ తన అభిప్రాయాలను స్నేహితులు, బంధువులతో పంచుకొవచ్చు.

మ్యాక్స్ డిట్టో ఎమ్‌ఎక్స్ 222 మొబైల్ 2.0 ఇంచ్ వెడల్పైన టిఎఫ్‌ఎటి స్క్రీన్‌ని కలిగి ఉంది. ఈ మొబైల్‌లో డ్యూయల్ కెమెరా, డ్యూయల్ డిస్ ప్లే ఉన్నప్పటికీ ఖరీదు చాలా తక్కువ. ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయ్యేందుకు వీలుగా ఇందులో WAP బ్రౌజర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. ఈ మొబైల్‌‌లో మైనస్ ఏదైనా ఉంది అంటే అది కేవలం ఒక్క మెమరీ విషయంలోనే. ఈ మొబైల్‌లో మెమరీని 2జిబి వరకు మాత్రమే విస్తరించుకోవచ్చు.

మొబైల్‌ని బయట స్పీకర్స్‌కి కనెక్ట్ చేసుకునేందుకు గాను 3.5mm ఆడియో జాక్ ప్రత్యేకం. ప్రయాణాలలో సరదాగా పాటలు వినేందుకు గాను రేడియో ప్రత్యేకం. మార్కెట్లో లభించే MP3, Wav MP4 ఆడియా, వీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది. ఇక బ్యాటరీ బ్యాక్ అప్ విషయానికి వస్తే 800 mAh బ్యాటరీని నిక్షిప్తం చేయడం జిరిగింది. మార్కెట్లో మ్యాక్స్ డిట్టో ఎమ్‌ఎక్స్ 222 మొబైల్ రెండు కలర్స్‌లలో లభ్యమవుతుంది. ఒకటి రెడ్ అండ్ బ్లూ, రెండవది రెడ్ అండ్ యల్లో కలర్. ఇండియన్ మొబైల్ మార్కెట్లో మ్యాక్స్ డిట్టో ఎమ్‌ఎక్స్ 222 మొబైల్ ధరని రూ 3,788గా నిర్ణయించడమైంది.

మ్యాక్స్ డిట్టో ఎమ్‌ఎక్స్ 222 మొబైల్ ప్రత్యేకతలు:

* 2.0” TFT Screen
* Dual keypad
* Available in Red & Blue and Red & Yellow colours
* WAP Browser
* Dual cameras: 1.3 MP
* 800 mAh battery
* Expandable memory up to 2 GB
* MP3/WAV/AAC music player
* 3GPP/AVI/MP4 video player
* FM Radio with FM scheduling
* 3.5mm audio jack
* Bluetooth with A2DP

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot