తక్కవ ధరలో మ్యాక్స్ టచ్ స్క్రీన్ మొబైల్

Posted By: Staff

తక్కవ ధరలో మ్యాక్స్ టచ్ స్క్రీన్ మొబైల్

ప్రపంచ వ్యాప్తంగా టచ్ స్క్రీన్ మొబైల్స్‌కి ఒక్కసారిగా మంచి పాపులారిటీ రావడంతో ఇండియా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి మొబైల్ తయారీదారులు దృష్టి అంతా ఇప్పుడు టచ్ స్క్రీన్ మొబైల్స్‌ని తయారు చేయడంపైనే కేంద్రీకరిస్తున్నారు. మరికొంత మంది మొబైల్ తయారీదారులు టచ్ స్క్రీన్ మొబైల్స్‌ని ఫిజికల్ కీప్యాడ్ పెట్టి టచ్ అండ్ టైప్ మొబైల్స్‌గా కూడా తయారు చేస్తున్నారు. ఇందులో భాగంగా దేశీయ పెద్ద మొబైల్ కంపెనీలలో ఒకటైన మ్యాక్స్ మొబైల్స్ త్వరలో ఇండియాలో పుల్ టచ్ స్క్రీన్ హ్యాండ్ సెట్‌ని విడుదల చేయనుంది. దాని పేరే మ్యాక్స్ స్కోప్ ఎమ్‌టి 150.

మ్యాక్స్ స్కోప్ ఎమ్‌టి 150 విడుదల సందర్బంగా మ్యాక్స్ గ్రూప్ ఛైర్మన్ అజయ్ అగర్వాల్ మాట్లాడుతూ ప్రస్తుతం మొబైల్ ఇండస్ట్రీలో టచ్ స్క్రీన్ మొబైల్స్ ఎక్కువ శాతం షేర్‌ని సొంతం చేసుకుంటున్నాయి కాబట్టి మేము కూడా తక్కవ ధరలో ఎక్కువ ఫీచర్స్ ఉన్నటువంటి మ్యాక్స్ స్కోప్ ఎమ్‌టి 150 అనే పుల్ టచ్ స్క్రీన్ డిస్ ప్లే మొబైల్‌ని మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నామని అన్నారు. యూజర్స్ కోసం చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్ అందించేందుకు గాను 2.8 ఇంచ్ పుల్ టచ్ స్క్రీన్ డిస్లేతో పాటు, ఇందులో జావా ఆధారితి ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగించడం జరిగింది. వీటితోపాటు ఐకాన్స్, మెను బటన్స్ యూజర్‌కి ఈజీగా అర్దమయ్యే విధంగా రూపోందించడం జరిగింది.

మ్యాక్స్ స్కోప్ ఎమ్‌టి 150 డ్యూయల్ సిమ్ సపోర్ట్ తోపాటు డ్యూయల్ సిమ్ ఫంక్షనాలిటీని అందిస్తుంది. ఇంటర్నెట్ యాక్టివిటీస్ కోసం ప్రత్యేకంగా ఈ మొబైల్‌లో యాహూ మెసెంజర్, యాహూ మెయిల్ పోందుపరచడం జరిగింది. ఈ మొబైల్‌లో అందంగా ఇమేజిలను తీయడం కోసం చక్కని క్వాలిటీ కలిగిన కెమెరా, అదే కెమెరా తో వీడియా రికార్డింగ్ కూడా తీసేటటువంటి ఫెసిలిటీ కల్పించడం జరిగింది. మ్యాక్స్ స్కోప్ ఎమ్‌టి 150 కొనడానికి తక్కువ ధర ఉన్నప్పటికీ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది.

మ్యాక్స్ స్కోప్ ఎమ్‌టి 150 మొబైల్ తోపాటు ఎప్ ఎమ్ రేడియో, 3.5 mm ఆడియో జాక్ కూడా లభిస్తుంది. ఇక కనెక్టివిటీ, కమ్యానికేషన్ ఫీచర్స్ అయినటువంటి బ్లూటూత్, వై-పై మొదలగునవాటిని సపోర్ట్ చేస్తుంది. మ్యాక్స్ స్కోప్ ఎమ్‌టి 150 తోపాటు ఇంటర్నల్‌గా 2జిబి మొమొరీ లభిస్తుండగా ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని ఎక్పాండ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.

Maxx Scope MT 150 specifications:

Touch Screen Display
Dual Sim Standby
Yahoo Launcher
2 GB memory with option for up to 8GB expansion
1.3 Mega Pixel Camera
FM Radio
Multi Format Music Player
Java
Games
Good battery backup

మ్యాక్స్ స్కోప్ ఎమ్‌టి 150 మొబైల్ ప్రస్తుతం ఇండియాలో ఉన్న అన్ని లీడింగ్ స్టోర్స్‌లలో రూ 3272 ధరకే లభిస్తుంది. మ్యాక్స్ స్కోప్ ఎమ్‌టి 150 రాకతో ఎంట్రీ లెవెల్ మొబైల్ ఫోన్స్‌లలో కొంత వరకు కాంపిటేషన్ ఇస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot