ఫోన్‌లో నాయిస్ వస్తుందా, ఐతే ఇది ట్రై చేయండి

Posted By: Staff

ఫోన్‌లో నాయిస్ వస్తుందా, ఐతే ఇది ట్రై చేయండి

ప్రస్తుతం ఇండియాలో జీవించే ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్ అనేది సర్వసాధారణమై పోయింది. కస్టమర్స్‌ని దృష్టిలో పెట్టుకోని మొబైల్ తయారీదారులు బేసిక్ మోడల్స్ లలో మెసెజ్ పంపే ఫోన్స్ నుండి హై డెపినేషన్ వీడియోస్ తీసేటటువంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న మోడల్స్‌ని మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అత్యాధునిక మొబైల్స్‌ని గనుక చూసినట్లైతే మొబైల్‌తో ఏమైనా చేయవచ్చుననే నమ్మకం కలుగుతుంది.

సాధారణంగా మొబైల్‌ని ఎవరైనా వేరే వారితో మాట్లాడడం కోసమే ఉపయోగిస్తూ ఉంటారు. ఐతే ప్రస్తుతం ప్రపంచం చాలా వేగంగా అభివృద్ది చెందుతుండడంతో మనం కూడా దానిని అందుకోవాల్సి వస్తుంది. అందులో భాగంగా టెక్నాలజీ అభివృద్ది చెందింది. మనం ఫోన్‌లో మాట్లాడేటప్పుడు కొన్ని సమయాల్లో మనకు అవాంతరాలు ఏర్పడుతుంటాయి. సరిగ్గా వాయిస్ వినిపించకపోవడం లాంటివన్నమాట. అలాంటి ఇబ్బందులను అధిగమించేందుకు గాను మ్యాక్స్ మొబైల్ కంపెనీ ఇండియన్ మార్కెట్లోకి తక్కువ నాయిస్ ఉండేటటువంటి ఖామోస్ సిరిస్ మొబైల్ ఫోన్స్‌ని విడుదల చేసింది.

ఫోన్‌లో మాట్లాడేటప్పడు తక్కువ నాయిస్ రావడం కోసం ఖామోస్ సిరిస్‌లో కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ టెక్నాలజీ పేరు స్మాల్ యరే మైక్రోఫోన్ (SAM) టెక్నాలజీ. ఈ స్మాల్ యరే మైక్రోఫోన్ (SAM) టెక్నాలజీ స్పెషల్ సిగ్నలింగ్ పద్దతులను ఉపయోగించి బ్యాక్ గ్రౌండ్ నాయిస్‌‌ని రాకుండా అదుపు చేస్తాయి. అవతలివైపు ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వారికి క్లియర్ వాయిస్‌ని అందివ్వడంలో ఈ టెక్నాలజీని పరీక్షించి చూస్తే ఇది విజయవంతం అయింది. ఇక ఖామోస్ సిరిస్‌కు సంబంధించి మ్యాక్స్ మొబైల్ కంపెనీ రెండు మొబైల్స్‌ని విడుదల చేసింది. అవి ఒకటి మ్యాక్స్ ఎమ్‌ఎక్స్ 401, రెండవది మ్యాక్స్ ఎమ్‌క్యూ 601.

మ్యాక్స్ ఎమ్‌ఎక్స్ 401 డ్యూయల్ సిమ్ కెపబులిటీని కలిగి ఉండి, హై మల్టీమీడియా ఫీచర్స్ ప్రత్యేకం. ఆడియో, వీడియో ఫైల్ ఫార్మెట్స్ అయిన MP3, WMV, AAC+ మొదలగు వాటిని సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే 2 మెగా ఫిక్సల్ కెమెరాతో చక్కని ఫోటోలను తీయవచ్చు. ఇవి మాత్రమే కాకుండా ఎఫ్ ఎమ్ రేడియో, యూనివర్సల్ హెడ్ ఫోన్ జాక్, మైక్రో ఎస్‌డి కార్డ్ ద్వారా ఎక్సపాండబుల్ మొమొరీ ప్రత్యేకం.

The notable features of Maxx MX 401:

Dual SIM
2 .0 Mega Pixel Camera
2.4 inch display
Large 1500mAh battery that provide 5.5 hours of talk time
Up to 8 GB micro SD memory
FM Radio with FM scheduling

మ్యాక్స్ ఎమ్‌క్యూ 601 విషయానికి వస్తే క్వర్టీ కీప్యాడ్ తోటి, డ్యూయల్ సిమ్ వేసుకునేందుకు అనువుగా మంచి క్వాలిటీ ఉన్న కెమెరాని కలిగి ఉంది. ఎంటర్టెన్మెంట్ విషయంలో కూడా కస్టమర్స్ ఎటువంటి నిరాశకు గురి కావాల్సిన అవసరం ఉండదు. మ్యాక్స్ ఎమ్‌క్యూ 601 మంచి బ్యాటరీ బ్యాక్ అప్‌ని కలిగి ఉండి వైర్ లెస్ ఎఫ్ ఎమ్ రేడియోని సపోర్ట్ చేస్తుంది.

The notable specs of Maxx MQ 601:

2 .0 Mega Pixel camera with video recording
A 1000mAh battery that offers 4.5 hours of talk time
Up to 8 GB Micro SD support
Wire-free FM Radio with FM scheduling
Bluetooth
JAVA

మ్యాక్స్ ఎమ్‌ఎక్స్ 401 ఖరీదు విషయానికి వస్తే కేవలం రూ 2833 కాగా, అదే మ్యాక్స్ ఎమ్‌క్యూ 601 ఖరీదు మాత్రం రూ 2970గా నిర్ణయించడమైంది. మ్యాక్స్ మొబైల్స్ విడుదల చేసిన ఈ ఖామోస్ సిరిస్ మొబైల్ ఫోన్స్ ఖచ్చితంగా మార్కెట్లో సక్సెస్ సాధిస్తాయని నమ్మకంతో ఉన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot