మ్యాక్స్ మాయాజాలం 'జిప్పీ'

Posted By: Staff

మ్యాక్స్ మాయాజాలం 'జిప్పీ'

దేశీయ మొబైల్ దిగ్గజాలలో ఒకటైన మ్యాక్స్ మొబైల్స్ కొత్తగా మార్కెట్లోకి టచ్ స్క్రీన్ ఫోన్ 'మ్యాక్స్ జిప్పీ(ఎమ్‌టి 105)'ని విడుదల చేసింది. మొబైల్ ధర సుమారుగా రూ 2549. ఇండియన్ మొబైల్ మార్కెట్లో 'మ్యాక్స్ జిప్పీ(ఎమ్‌టి 105)' మొబైల్ బ్లాక్ రంగుని కామన్‌గా కలిగి ఉండి, బ్లూ, మెటాలిక్ రెడ్, ఆరంజ్ కలర్స్‌లలో లభ్యమవుతుంది. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు 2.4 ఇంచ్ టిఎప్‌టి పుల్ టచ్ స్క్రీన్‌తో డిస్ ప్లేని రూపొందించడం జరిగింది.

'మ్యాక్స్ జిప్పీ(ఎమ్‌టి 105)' మొబైల్ డిజిటల్ కెమెరాతో పాటు, ఎల్‌ఈడి ఫ్లాష్‌ని కూడా కలిగి ఉంది. ఇందులో ఉన్న మరో స్పెషల్ ఫీచర్ ఏమిటంటే డ్యూయల్ సిమ్ ఫీచర్. ఈ ఫీచర్‌తో రెండు నెట్ వర్క్‌లకు అనుగుణంగా మొబైల్ పని చేస్తుంది. పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్ అప్‌ని అందించేందుకు గాను ఇందులో 1000 mAh బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది.

వైర్ ఫ్రీ ఎఫ్ ఎమ్ రేడియో ప్రత్యేకం. దీని సహాయంతో ఎటువంటి వైర్ లేకుండా పాటలు వినొచ్చు. మార్కెట్లో లభ్యమయ్యేటటువంటి MP3, AAC & WAV మ్యూజిక్ ఫార్మెట్లను ఆడియో ప్లేయర్ సపొర్ట్ చేయగా, ఇందులో ఉన్న వీడియో ప్లేయర్ సహాయంతో MP4, 3GPP, AVI ఫార్మెట్ వీడియోలను ప్లే చేయవచ్చు. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 115Kb, సిస్టమ్ మెమరీ 64 Mb మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 4జిబి వరకు విస్తరించుకొవచ్చు. కనెక్టివిటీ ఫీచర్స్ అయిన బ్లూటూత్, జిపిఆర్‌ఎస్ లను కూడా ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. హిందీ, ఇంగ్లీషు రెండు భాషలను కూడా సపోర్ట్ చేస్తుంది.

'మ్యాక్స్ జిప్పీ(ఎమ్‌టి 105)' మొబైల్ ప్రత్యేకతలు:

* నెట్ వర్క్: 2G
* డ్యూయల్ సిమ్: GSM
* చుట్టుకొలతలు: 96 x 54x 13.5mm
* డిస్ ప్లే: 2.4 inch TFT touchscreen display
* కమెరా: Digital Camera with LED Flash
* మల్టీ మీడియా: Audio/Video player, Video Recorder
* రేడియో: Wireless FM radio
* కనెక్టివిటీ ఫీచర్స్ Bluetooth, WAP /GPRS, USB Mass Storage
* బ్యాటరీ: 1000 mAh
* టాక్ టైమ్: 3-4 hours
* బరువు: 155 grams

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting