మాక్స్ మొబైల్ నుంచి చవక ధర ఆండ్రాయిడ్ ఫోన్

Posted By:

భారత్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ మాక్స్ మొబైల్ మాక్స్ జెనెక్స్ డ్రాయిడ్7 ఏఎక్స్356 (Maxx GenxDroid7 AX356) పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ హ్యాండ్‌సెట్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.3,696. ప్రముఖ రిటైలర్ Infibeam ఈ స్మార్ట్‌ హ్యాండ్‌సెట్‌లను ప్రత్యేకంగా విక్రయిస్తోంది. ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

మాక్స్ మొబైల్ నుంచి చవక ధర ఆండ్రాయిడ్ ఫోన్

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+డబ్ల్యూసీడీఎమ్ఏ),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
3.5 అంగుళాల HVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 320x480పిక్సల్స్),
డ్యూయల్ కోర్ మీడియాటెక్ ఎంటీ6572ఎమ్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 1గిగాహెట్జ్),
512ఎంబి ర్యామ్,
3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వా
రా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీ కనెక్టువిటీ,
1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మాక్స్ వరల్డ్, మాక్స్‌లైఫ్ బాక్స్, మాక్స్ కేర్, మాక్స్ న్యూలాంచ్, గెటిట్, హంగామా, ఆఫీస్ సూట్, ఒపెరా మినీ, ఓఎల్ఎక్స్, ఫ్లిప్‌కార్ట్, వుయ్‌చాట్ లాంచ్ తదితర గూగుల్ అప్లికేషన్‌లను ఫోన్‌లో ముందుగానే లోడ్ చేసారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot