మాక్స్ మొబైల్ నుంచి 26 కొత్త ఫోన్‌లు

Posted By:

దేశవాళీ మొబైల్‌ఫోన్‌ల తయారీ కంపెనీ మాక్స్ మొబైల్ (Maxx Mobile) తాజాగా 26 కొత్త‌శ్రేణి మొబైల్ ఫోన్‌లను మార్కెట్లో ఆవిష్కరించింది. మధ్య ఇంకా దిగువ తరగతి మొబైల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ రూపొందించబడిన ఈ మొబైల్ హ్యాండ్‌సెట్‌ల ధరలు రూ.1,100 నుంచి రూ.7,777 మధ్య ఉన్నాయి. ఈ 26 మొబైల్ ఫోన్‌లలో 19 ఫీచర్ ఫోన్లతో, 7 స్మార్ట్‌ఫోన్ మోడల్స్ ఉన్నాయి.

మాక్స్ మొబైల్ నుంచి 26 కొత్త ఫోన్‌లు

ఫీచర్ ఫోన్ మోడల్స్ వివరాలు:

MX180, MX422, MX187, MX12, MX444, MX105, MX125, MX553, MX472, MX168, MX467, MX445, MX11, MX103, MX254, MX255, MX433, MX442, MT352. ఈ 19 ఫీచర్ ఫోన్‌లు డ్యుయల్ సిమ్ కనెక్టువిటీని కలిగి ఉన్నాయి. సుధీర్ఘమైన బ్యాటరీ వ్యవస్థ, ఎక్స్‌టర్నల్ మెమరీని 8జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, మెరుగుపరచబడిన సెక్యూరిటీ ఫీచర్లను ఈ సాధారణ హ్యాండ్ సెట్‌లలో నిక్షిప్తం చేసారు.

స్మార్ట్‌ఫోన్ మోడల్స్ వివరాలు:

AX44, AX 45, AX5i, MSD7 Smarty II, AX06, AX409, AX04. మాక్స్ మొబైల్ విడుదలు చేసిన ఈ 7 స్మార్ట్‌ఫోన్ మోడల్స్ ఆండ్రాయిడ్ జింజర్‌బ్రెడ్ లేదా జెల్లీబీన్ ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్ పై రన్ అవుతాయి. 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ ఫీచర్‌తో), 1600ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 256 ఎంబి నుంచి 512 ఎంబి వరకు ర్యామ్ సామర్ధ్యం.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot