మాక్స్ మొబైల్స్ నుంచి 19 ఫోన్‌లు

Posted By:

రూ.2000కే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దేశవాళీ బ్రాండ్‌ల జోరు రోజురోజుకు విస్తరిస్తోంది. మైక్రోమాక్స్, కార్బన్, జోలో, సెల్‌కాన్ సహా పలు బ్రాండ్‌లు బడ్జెట్ ఫ్రెండ్లీ ధర వేరియంట్‌లలో లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌కు పరిచయం చేస్తున్నాయి. ఈ కోవకే చెందిన మరో ఇండియన్ బ్రాండ్ మాక్స్ మొబైల్స్ రాబోయే వారాల్లో 9 సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లతో పాటు 8 ఫీచర్ ఫోన్‌లను మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ల ధరలు రూ.2,000 నుంచి రూ.6,000 మధ్య ఉంటాయి.

ఫీచర్ ఫోన్ స్ధాయి నుంచి స్మార్ట్‌ఫోన్ వర్షన్‌కు అప్‌గ్రేడ్ కావాలనుకుంటున్న వారికోసం తమ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు దోహదపడతాయని మాక్స్ మొబైల్ చైర్మన్ ఇంకా మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ అగర్వాల్ తెలిపారు. రూ.2000 ధర ట్యాగ్‌లో మాక్స్ మొబైల్స్ ప్రవేశపెడుతున్న ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో విజయవంతం కావాలని ఆశిద్దాం.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot