డ్యూయల్ సిమ్ ఫోన్స్‌లో ఏది బెస్ట్..!

Posted By: Super

డ్యూయల్ సిమ్ ఫోన్స్‌లో ఏది బెస్ట్..!

ప్రస్తుతం మొబైల్ మార్కెట్లోకి వెళ్లి ఓ మొబైల్ కోనాలంటే చాలా కష్టం. అదేంటి ఇలా అంటున్నాను అని అనుకుంటున్నారా.. మొబైల్ కోనాలని షాప్‌లోకి వెళ్లామంటే చాలు అక్కడ చూసినటువంటి మోడల్స్‌లలో మనం ఒకటి అనుకుంటే చివరకి ఇంకొకటి కొనుక్కోని వస్తాం. అలా జరగకుండా ఉండాలంటే ముందుగానే మనం కొనాలనుకునే మొబైల్‌పై సరైన క్లారిఫికేషన్‌తో వెళితే ఎటువంటి ఇబ్బంది ఉండదనేది నా అభిప్రాయం.

ఇటువంటి కన్పూషన్‌ని తోలగించడం కోసమే పాఠకుల కోసం వన్ ఇండియా మొబైల్స్ గురించిన సమాచరం అందిస్తుంది. ఇవన్నీ చదివి మీకు ఎటువంటి ఫీచర్స్ ఉన్న మొబైల్ కావాలో చూసుకోని అలాంటిది కొనుక్కోవడం మంచిది. మార్కెట్లోకి అతి తక్కువ ధరలో డ్యూయల్ సిమ్ మొబైల్ ఫోన్‌‌ని ఎక్స్‌ఏజ్ మొబైల్స్ కంపెనీ విడుదల చేయనుంది. ఆ మొబైల్ పేరు ఎక్స్‌ఏజ్ ఎమ్‌టి 711. సరిగ్గా ఎక్స్‌ఏజ్ ఎమ్‌టి 711కి ఏమేమి ఫీచర్స్ ఐతే ఉన్నాయో మరో కంపెనీ మ్యాక్స్ విడుదల చేసినటువంటి మ్యాక్స్ ఎమ్‌టి 150 కూడా సరిగ్గా అలాంటి ఫీచర్స్ తోనే రూపోందించడం జరిగింది.

ఎక్స్‌ఏజ్ ఎమ్‌టి 711పవర్ పుల్ టచ్ స్క్రీన్ సైజుని కలిగి ఉండి, 3.2 మెగా ఫిక్సల్ కెమెరా దీని సోంతం. దీంతోపాటు ఎక్స్‌ఏజ్ ఎమ్‌టి 711 3డి మెను డిస్ ప్లే ని కూడా కలిగి ఉంది. ప్రస్తుతం ఉన్న యూత్ 3డి మెను డిస్ ప్లే మొబైల్స్ మీద ఎక్కువగా ఆసక్తి చూపించడంతో వీటిని తయారు చేయడం జరిగిందని తెలిపారు. గతంలో ఉన్న హ్యాండ్ సెట్స్‌తో పోల్చితే 3డి హ్యాండ్ సెట్స్‌కి మార్కెట్లో మంచి గిరాకీ ఉంది.

అంతేకాకుండా ప్రస్తుతం మార్కెట్లో టచ్ స్క్రీన్ ఫెసిలిటీ అనేది పెద్ద ట్రెండ్. అందుకే ఎక్స్‌ఏజ్ ఎమ్‌టి 711ని పుల్ టచ్ స్క్ర్రీన్‌తో పాటు టిఎఫ్‌టి టెక్నాలజీని కూడా పోందుపరచడం జరిగింది. అదే మ్యాక్స్ ఎమ్‌టి 150 మొబైల్ విషయానికి వస్తే స్క్రీన్ సైజు 2.8 ఇంచ్‌గా ఉంటుంది. ఎక్స్‌ఏజ్ ఎమ్‌టి 711మొబైల్‌లో మెసేజింగ్ ఫెసిలిటీతోపాటు, సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్‌ని కనెక్ట్ అయ్యేందుకు స్పెషల్ మెను రూపోందించడం జరిగింది. ఎక్స్‌ఏజ్ ఎమ్‌టి 711 ‌ఇంటర్నల్‌గా 16జిబి మొమొరీ స్టోరేజిని సపోర్ట్ చేస్తుంది. అదే మ్యాక్స్ ఎమ్‌టి 150 కేవలం 2జిబి ఇంటర్నల్ మొమొరీని లభించగా మొమొరీని 8జిబి వరకు ఎక్పాండ్ చేసుకునే వెసులుబాటు ఉంది.

ఇండియన్ యూత్‌కి ఎక్స్‌ఏజ్ ఎమ్‌టి 711 బాగా సూట్ అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బ్లాక్ కలర్‌లో చూడగానే మొబైల్ ప్రియుల మనసు దోచేంత అందంగా ఉందని సమాచారం. రెండు మొబైల్స్ ఎక్స్‌ఏజ్ ఎమ్‌టి 711, మ్యాక్స్ ఎమ్‌టి 150 కూడా కొన్ని కామన్ ఫీచర్స్ ని షేర్ చేసుకోవడం జరిగింది. ఆ కామన్ ఫీచర్స్ ఏమిటంటే వీడియో రికార్డింగ్, మ్యూజిక్ ప్లేయర్, ఎఫ్ ఎమ్ రేడియో మొదలగునవి. కనెక్టివటీ, కమ్యూనికేషన్స్ ఫీచర్స్ అయినటువంటి బ్లూటూత్, జిపిఆర్ ఎస్ మొదలగున వాటిని సపోర్ట్ చేస్తాయి. రెండు మొబైల్స్‌లలో ఉన్నమరో స్పెషాలిటీ ఏంటంటే రెండు కూడా డ్యూయల్ సిమ్ ఫోన్స్.

ఇక ఖరీదు విషయానికి వస్తే మాత్రం ఎక్స్‌ఏజ్ ఎమ్‌టి 711ధర రూ 5700కాగా, అదే మ్యాక్స్ ఎమ్‌టి 150లో రెండు మోడల్స్ ఉన్నాయి. ఒకటి టచ్ స్క్రీన్ మోడల్ కాగా, రెండవది సాధారణ మోడల్. మ్యాక్స్ ఎమ్‌టి 150 టచ్ స్క్రీన్ మొబైల్ ధర రూ 5000కాగా, అదే సాధారణ మొబైల్ ధర రూ 3200గా నిర్ణయించడమైంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot