తక్కువ ధరా లేక ఎక్కువ ఫీచర్సా, మీరే నిర్ణయించుకోండి..?

By Super
|
Maxx Scope MT150 Vs ViewSonic V350
గత కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ మొబైల్ మార్కెట్‌‌ని గమనిస్తే మొబైల్ తయారీదారులు మొబైల్ రంగంలోకి తమ అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి వచ్చినట్లు తెలుస్తుంది. వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గ కంపెనీలు మ్యాక్స్, వివ్ సోనిక్. ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసిన వివ్ సోనిక్ వి350 సేల్స్ బాగా పెరిగిపోవడంతో మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాయి ఈ మొబైల్ కంపెనీలు. ఇక వివ్ సోనిక్ వి350 విషయానికి వస్తే పవర్ పుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వి2.2తో రన్ అవడమే కాకుండా, 1GHz Qualcomm ప్రాసెసర్‌ని కలిగి ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్మార్ట్ ఫోన్స్‌‌తో గనుక పొల్చినట్లైతే వివ్ సోనిక్ వి350కి ఓ ప్రత్యేకమైన ఫీచర్ ఉంది. అదేంటని అనుకుంటున్నారా.. 3డి కెపాసిటివ్ టచ్ స్క్రీన్.

ఇదే కొవల్ దేశీయ మొబైల్ దిగ్గజం మైక్రోమ్యాక్స్ మొబైల్స్ పుల్ టచ్ స్క్రీన్ జావా ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్ మైక్రో స్కోప్ ఎమ్‌టి150ని మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఇప్పటి వరకు మొబైల్ మార్కెట్లోకి వచ్చిన స్మార్ట్ పోన్స్, టచ్ స్క్రీన్ మొబైల్‌లలో కెల్లా మైక్రో స్కోప్ ఎమ్‌టి150 యాజర్ ప్రెండ్లీ టచ్ ఫోన్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. అంతేకాకుండా మైక్రో స్కోప్ ఎమ్‌టి150లో డ్యూయల్ సిమ్ ఫంక్షనాలిటీతోపాటు, ఇండియన్ కస్టమర్స్‌కి ఏమేమి ఫీచర్స్ ఐతే కావాలో అలాంటి అన్ని రకాల ఫీచర్స్‌తో ఇది రూపోందించబడింది.

మైక్రో స్కోప్ ఎమ్‌టి150 మొబైల్‌లో ఉన్న 5 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో చక్కని వీడియోలను, ఫోటోలను కూడా తీసుకోవచ్చు. మొబైల్‌తో పాటు ఇంటర్నల్ గా 2జి మొమొరీ వస్తుండగా అదే మైక్రో ఎస్ డి స్లాట్ ద్వారా 8 జివి వరకు మొమొరీని ఎక్పాండ్ చేసుకోవచ్చు. ఇక వివ్ సోనిక్ వి350 విషయానికి వస్తే 3.5 ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ ప్లేని కలిగి ఉండి యూజర్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందిస్తుంది. ఇండియన్ మార్కెట్లో మైక్రోమ్యాక్స్ ఎమ్‌టి 150 తర్వాత డ్యూయల్ సిమ్ ఫీచర్‌ని అందించే మొబైల్ వివ్ సోనిక్ వి350 కావడం విశేషం.


మార్కెట్లో ప్రస్తుతం ఉన్న అన్ని రకాల ఆడియో వీడియో ఫార్మెట్లను సపోర్ట చేస్తాయి. అంతేకాకుండా కమ్యూనికేషన్, కనెక్టివిటీ టెక్నాలజీలైన బ్లూటూత్, వై-పై, యుఎస్‌బి సింక్ లాంటి అన్నింటిని కూడా ఈ రెండు మొబైల్స్ సపోర్ట్ చేస్తాయి. జులైలో విడుదలైన వివ్ సోనిక్ వి350 మొబైల్ ధర సుమారుగా ఇండియన్ మార్కెట్లో రూ 17,000 వరకు ఉంది. అదే మైక్రో మ్యాక్స్ ప్రస్తుతం ఇండియాలో ఉన్న మొబైల్ షాపులలో లభ్యమవుతుండగా దీని ధర రూ 3,272 వరకు ఉంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X