MediaTek vs Qualcomm, మీ ఫోన్‌కు ఏది సరైన ప్రాసెసర్..?

మీడియాటెక్ లాంచ్ చేసే చిప్‌సెట్స్ పవర్ పై ఎక్కువ ఫోకస్ చేస్తే, క్వాల్కమ్ లాంచ్ చేసే చిప్‌సెట్స్ మంచి సమర్థత పై ఎక్కువుగా ఫోకస్ చేస్తాయి.

|

స్మార్ట్‌ఫోన్ ప్రాసెసర్‌ల విభాగంలో ప్రస్తుతం నడుస్తోన్న ట్రెండ్‌ను పరిశీలించినట్లయితే Qualcomm, MediaTekల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది.

SMS ద్వారా జియోఫోన్‌ను బుక్ చేసుకోవటం ఎలా..?SMS ద్వారా జియోఫోన్‌ను బుక్ చేసుకోవటం ఎలా..?

క్వాల్కమ్ ఫ్రం అమెరికా, మీడియాటెక్ ఫ్రం తైవాన్..

క్వాల్కమ్ ఫ్రం అమెరికా, మీడియాటెక్ ఫ్రం తైవాన్..

క్వాల్కమ్ కంపెనీ తయారు చేసే మొబైల్ ప్రాసెసర్లు అమెరికా సహా యూరోప్ దేశాల్లో బాగా పాపులర్ కాగా, మీడియాటెక్ అభివృద్ది చేస్తోన్న మొబైల్ ప్రాసెసర్లు దక్షిణ ఆసియా మార్కెట్లో అత్యధిక మార్కెట్ వాటాను కొల్ల గొడుతున్నాయి. ప్రాసెసర్‌ల తయారీలో ఈ రెండు కంపెనీలు అనుసరిస్తోన్న వ్యూహాలు, మార్కెట్లో ఎదరువుతోన్న అనుకూలతులు, ప్రతికూలతులు గురించిన ఆసక్తికర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Qualcomm, MediaTek కంపెనీల నేపథ్యం...

Qualcomm, MediaTek కంపెనీల నేపథ్యం...

క్వాల్కమ్ కంపెనీ అమెరికాకు చెందినది. ఈ కంపెనీని 1985లో స్థాపించారు. మొదట్లో ఈ కంపెనీ OmniTRACS పేరుతో శాటిలైట్ లొకేటింగ్ అండ్ మెసేజింగ్ సర్వీసులను నిర్వహించేది. క్వాల్కమ్ కంపెనీ తన మొట్టమొదటి స్నాప్‌డ్రాగన్ మొబైల్ ప్రాసెసర్‌ను 2005లో లాంచ్ చేసింది. తైవాన్‌కు చెందిన మీడియాటెక్ కంపెనీని 1997లో ప్రారంభించారు. తొలినాళ్లలో ఈ కంపెనీ డీవీడీ అలానే డిజిటల్ టీవీ సెట్‌‌లకు చిప్‌సెట్‌లను సమకూర్చేది.

ఖరీదు vs చౌక

ఖరీదు vs చౌక

మీడియోటెక్ ప్రాసెసర్‌లతో పోలిస్తే క్వాల్కమ్ ప్రాసెసర్లు ఖరీదైనవిగా ఉండటంతో ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్షురర్స్, ఈ ప్రాసెసర్‌లతో ఫోన్‌లను తయారుచేసుందుకు వెనకడుగు వేస్తున్నారు. ఈ పాయింట్‌ను క్యాష్ చేసుకుంటున్న మీడియాటెక్ చౌక ధరల్లో ప్రాసెసర్‌లను తయారు చేస్తూ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలను తనవైపు తిప్పుకుంటోంది. ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతోన్న చాలా వరకు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు మీడియాటెక్ ప్రాసెసర్‌లతోనే వస్తున్నాయి. మీడియోటెక్ ప్రాసెసర్‌లు మార్కెట్‌ను ముంచెత్తే ప్రయత్నం చేస్తున్నప్పటికి మిడ్‌రేంజ్ అలానే హై-ఎండ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో క్వాల్కమ్ నెం.1 స్థానంలో కొనసాగుతూనే ఉంది.

పవర్  vs  సమర్థత

పవర్ vs సమర్థత

మీడియాటెక్ లాంచ్ చేసే చిప్‌సెట్స్ పవర్ పై ఎక్కువ ఫోకస్ చేస్తే, క్వాల్కమ్ లాంచ్ చేసే చిప్‌సెట్స్ మంచి సమర్థతను కలిగి ఉంటాయి. ఈ కారణంగానే మీడియాటెక్ ప్రాసెసర్‌లతో వచ్చే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు క్వాల్కమ్ ప్రాసెసర్ ఫోన్‌లతో పోటీగా పనిచేస్తాయి. అయితే ఒక్కోసారి పవర్ శాతం ఎక్కువ అవటం కారణంగా బ్యాటరీ లైఫ్ పై చెడు ప్రభావం చూపటం, ఓవర్ హీటింగ్ సమస్యలు తలెత్తటం వంటి సమస్యలు మీడియాటెక్ ఫోన్‌లలో ఉత్పన్నమవుతుంటాయి.

GPU విషయానికి వచ్చేసరికి...

GPU విషయానికి వచ్చేసరికి...

మొబైల్ చిప్‌సెట్‌ల తయారీలో భాగంగా క్వాల్కమ్ అలానే మీడియాటెక్‌లు వేరు‌వేరు గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్‌లను ఉపయోగించటం జరుగుతుంది. మీడియాటెక్ లాంచ్ చేసే అన్ని ప్రాసెసర్లలో దాదాపుగా Mali GPU కంబైన్ అయి ఉంటుంది. ఇదే సమయంలో క్వాల్కమ్ లాంచ్ చేసే అన్ని చిప్‌సెట్‌లలో Adreno లైనప్ జీపీయూలు కంబైన్ అయి ఉంటాయి. మొబైల్ గేమర్స్ ఎక్కువుగా వీటిలో Adreno లైనప్ GPUలనే ఇష్టపడతారు.

మీ ఫోన్‌కు ఏది సరైన ప్రాసెసర్..?

మీ ఫోన్‌కు ఏది సరైన ప్రాసెసర్..?

మీ స్మార్ట్‌ఫోన్ పవర్ విషయంలో ఏ మాత్రం రాజీపడకుండా ఉండాలంటే మీడియాటెక్ చిప్‌సెట్‌లతో వచ్చే స్మార్ట్‌ఫోన్‌లను సెలక్ట్ చేసుకోండి. మీ ఫోన్ అన్ని విభాగాల్లో సమర్థవంతంగా రాణించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో వచ్చే స్మార్ట్‌ఫోన్‌ను మాత్రమే ఎంపిక చేసుకోండి.

Best Mobiles in India

English summary
MediaTek vs Qualcomm: Which smartphone processor should you choose?. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X