హానర్ ‘బీ’: తక్కువ బడ్జెట్.. దుమ్ము రేపు ఫీచర్లు

|

భారత్‌లోని బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ యూజర్లను టార్గెట్ చేస్తూ చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీ హువావీ ‘హానర్ బీ' పేరుతో సరికొత్త తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లతో కనువిందు చేస్తోన్న ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ ఎంట్రీ లెవల్ యూజర్లకు బెస్ట్ ఆప్షన్ అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. హువావీ హానర్ ‘బీ' స్మార్ట్‌ఫోన్‌లోని 10 ఆసక్తికర ఫీచర్లను ఇప్పుడు చూద్దాం..

(Read More: 5,000 ధరల్లో.. అదరగొట్టే స్మార్ట్‌ఫోన్‌లు)

డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ

డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ

హానర్ బీ, బిల్డ్‌క్వాలిటీ విషయంలో హువావీ ఏమాత్రం రాజీపడలేదనే చెప్పాలి. డిజైనింగ్ విషయంలోనూ ఈ ఫోన్ ప్రొఫెషనల్ లుక్‌ను సంతరించుకుంది. చేతిలో సౌకర్యవంతంగా ఇమిడిపోయే ఈ ఫోన్ ఆర్గానిక్ షేప్ ఇంకా మాటీ ఫినిష్ అద్భుతమనిపిస్తుంది.

 

ఫోన్ చుట్టుకొలత ఇంకా బరువు

ఫోన్ చుట్టుకొలత ఇంకా బరువు

హానర్ బీ స్మార్ట్‌ఫోన్ పరిమాణం 129 x 66.3 x 10మిల్లీ మీటర్లు, బరువు 170 గ్రాములు.

డిస్‌ప్లే

డిస్‌ప్లే

హువావీ హానర్ బీ 480 x 854పిక్సల్ రిసల్యూషన్‌తో కూడిన 4.5 అంగుళాల క్లియర్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

ప్రాసెసర్ ఇంకా ర్యామ్

ప్రాసెసర్ ఇంకా ర్యామ్

మల్టీ టాస్కింగ్ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే క్రమంలో 1జీబి ర్యామ్‌తో కూడిన ఎస్‌సీ7731 క్వాడ్‌కోర్ (1.2గిగాహెర్ట్జ్ క్లాక్ వేగంతో) ప్రాసెసర్‌ను హువావీ హానర్ బీ స్మార్ట్‌ఫోన్‌లో ఏర్పాటు చేసారు. దీంతో ఫోన్ పనితీరు మరింత వేగవంతంగా ఉంటుంది.

స్టోరేజ్

స్టోరేజ్

హువావీ హానర్ బీ, 8జీబి ఇంటర్నల్ మెమరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఫోన్‌లో ఏర్పాటు చేసిన మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు పెంచుకోవచ్చు.

కెమెరా

కెమెరా

ఫోన్ కెమెరా విషయానికొస్తే ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన 8 మెగా పిక్సల్ కెమెరా డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో అత్యుత్తమ ఫోటోగ్రఫీని చేరువ చేస్తుంది. ముందు భాగంలో ఏర్పాటు చేసిన 2 మెగా పిక్సల్ కెమెరా ద్వారా సెల్ఫీలను సూపర్ క్వాలిటీతో ఆస్వాదించవచ్చు.

కనెక్టువిటీ ఫీచర్లు

కనెక్టువిటీ ఫీచర్లు

ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే... డ్యుయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్ 4.0 + ఇడీఆర్, జీపీఎస్ ఇంకా ఏజీపీఎస్

కలర్ వేరియంట్స్

కలర్ వేరియంట్స్

హానర్ బీ స్మార్ట్‌ఫోన్ స్నో వైట్ ఇంకా మ్యాటీ బ్లాక్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.

బ్యాటరీ

బ్యాటరీ

హానర్‌ బీ స్మార్ట్‌ఫోన్‌లో ఏర్పాటు చేసిన 1730 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సింగిల్ చార్జ్ పై 24 గంటల టాక్‌ టైమ్‌ను అందిస్తుంది. ఫోన్‌లో ఏర్పాటు చేసిన పవర్ సేవింగ్ టెక్నాలజీ బ్యాటరీ పనితీరును మరింత మెరుగుపరుస్తుంది.

ధర

ధర

హానర్ బీ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.4,499కే సొంతం చేసుకునే అవకాశాన్ని హువావీ కల్పిస్తోంది. త్వరపడండి మరి.

Best Mobiles in India

English summary
Huawei recently launched its budget smartphone called the Honor Bee to cater to the budget conscious consumers in the market. Here are the ten features of the Honor Bee that will make you fall in love with the phone.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X