గెలాక్సీ ఎస్2, ఎక్స్‌టి 720ల మద్య యుద్దం మొదలైంది

Posted By: Super

గెలాక్సీ ఎస్2, ఎక్స్‌టి 720ల మద్య యుద్దం మొదలైంది

ఇండియన్ మొబైల్ మార్కెట్లో కాంపిటేషన్ అనేది కొత్తగా ఉన్నది. ఇండియాలో మొబైల్స్ విడుదల అయిన మొదట్లో కూడా టాప్ స్దానంలోకి రావాలని వివిధ మొబైల్ తయారీదార్లు పోటీపడ్డారు. నెంబర్ వన్ స్దానం కోసం జరుగుతున్న పోటీ నుండి ఏ మొబైల్ కంపెనీ కూడా వైదోలగలేదు అంటే నమ్మండి. జాతీయంగా ఉన్న మొబైల్స్ చాలవన్నట్లు ఇండియన్ మొబైల్ కంపెనీలు అయిన మైక్రోమ్యాక్స్, మాక్స్ మొబైల్స్, స్పైస్ మొబైల్స్, జెన్ లాంటి కంపెనీలు కూడా ఈ రేస్‌లో నిలబడ్డం విశేషం. ఐతే ఈ పోటీ అనేది తక్కువ బడ్జెట్ రకం మొబైల్స్ కానీ, హై ఎండ్ మొబైల్స్‌లలో కానీ పోటీ అనేది సాధారణమై పోయింది.

ఇక స్మార్ట్ ఫోన్స్ విషయంలో ప్రస్తుతం నెలకోన్న పోటీ ఇంతా అంతా కాదు. మనం చర్చించదలచుకున్న ఆ రెండు మొబైల్స్ శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్2, మోటరోలా ఎక్స్‌టి720. ఈ రెండు మొబైల్స్ కూడా ఆయా కంపెనీలు విడుదల ఇండియా పెద్ద మార్కెట్‌ని చేసుకోవడం కోసం విడుదల చేస్తున్నటువంటి స్మార్ట్ ఫోన్స్. రెండు మొబైల్స్‌లలో కూడా ఎంటర్టైన్మెంట్, మల్టీమీడియా ఆఫ్సన్స్ పుష్కలంగా ఉన్నాయి. ఆడియో, వీడియోలకు సంబంధించి ఎన్ని రకాలైన మీడియో ఫార్మెట్స్ ఉన్నాయో అటువంటి అన్నింటిని కూడా ఇవి సపోర్ట్ చేస్తాయి.

రెండు మొబైల్స్‌లలో కూడా పవర్ పుల్ కెమెరాలు ఇమిడికృతం చేయబడ్డాయి. 8 మెగా ఫిక్సల్ కెమాని కలిగి ఉండి హై డెఫినేషన్ వీడియో వీటి సోంతం. మొమొరీని ఎక్సపాండబుల్ చేసేకునేందుకు గాను మైక్రో ఎస్‌డి కార్డ్ ద్వారా 32జిబి వరకు ఎక్పాండ్ చేసుకోవచ్చు. మోటరోలా XT720లో 256Mb ఇంటర్నల్ మొమొరీ ఉంటే అదే శ్యామ్ సంగ్ గెలాక్సీ S2లో మాత్రం 2జి వరకు ఉందని వెల్లడించారు. మోటరోలా మోడల్‌తో గనుక పోల్చినట్లైతే గెలాక్సీ ఎస్2లో పవర్ పుల్ ప్రాసెసర్ అమర్చబడి ఉంది.

కనెక్టివిటీ విషయంలో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కమ్యూనికేషన్ టెక్నాలజీలు అయిన బ్లూటూత్, వై-పైలను సపోర్ట్ చేస్తాయి. 2జి ఇంటర్నెట్ టెక్నాలజీలు అయినటువంటి GPRS, EDGEలను ఇది సపోర్ట్ చేస్తుంది. రెండు మొబైల్స్ కూడా 3జి నెట్ వర్క్‌ని సపోర్ట్ చేస్తాయి. 3జి డేటాని మోటరోలా XT720 14 Mbps స్పీడ్‌తో ట్రాన్పర్ చేయగా అదే శ్యామ్ సంగ్ కెలాక్సీ ఎస్2 మాత్రం 21Mbps స్పీడ్‌తో డేటాని ట్రాన్ఫర్ చేస్తుంది. ఎగ్జిక్యూటివ్స్ కోసం ప్రత్యేకంగా ఇందులో అన్ని రకాలైన బిజినెస్ డాక్యుమెంట్స్‌ని ఎడిట్ చేసే అప్లికేషన్స్ ఇందులో పోందుపరచబడ్డాయి.

ఇక ఖరీదు విషయానికి వస్తే Motorola XT720 ధర కేవలం రూ 6000కాగా, Galaxy S2 ధర రూ 27,000గా నిర్ణయించడమైంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot