'డ్రీమ్' ఆధారంగా మీజు మొబైల్ విడుదల..

Posted By: Prashanth

'డ్రీమ్' ఆధారంగా మీజు మొబైల్ విడుదల..

 

చైనా బ్రాండెడ్ మొబైల్ తయారీదారు 'మీజు' కొత్తగా మార్కెట్లోకి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ని 'మీజు ఎమ్‌ఎక్స్'ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. మీజు మొబైల్స్ ఎప్పుడూ 'కుపిర్టినో' ఉత్పత్తులను కాపీ కొడుతూ గొడవలతో మార్కెట్లో నిలిచే విషయం అందరికి తెలిసిందే. మీజు మొబైల్స్ ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌కి ప్రత్యేకించి 'ఎమ్‌ఎక్స్' పేరు పెట్టడానికి కారణం కూడా ఉంది. చైనాలో భాషలో డ్రీమ్‌ని 'meng xiang' అని పిలుస్తారు. ఇందులోని మొదటి రెండు అక్షరాలను కలిపి మీజు మొబైల్ కంపెనీ 'మీజు ఎమ్‌ఎక్స్'ని ప్రవేశపెట్టడం జరిగింది.

మీజు కంపెనీ నుండి వస్తున్న మొట్టమొదటి డ్యూయల్ కోర్ స్మార్ట్‌ఫోన్ 'మీజు ఎమ్‌ఎక్స్'. 'మీజు ఎమ్‌ఎక్స్' మొబైల్స్ పీచర్స్‌ని ఒక్కసారి గమనించినట్లేతే యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించేందుకు గాను దీని స్క్రీన్ సైజు 4 ఇంచ్‌గా రూపొందించడం జరిగింది. ASV డిస్ ప్లేని కలిగి ఉండి, 960 x 640 ఫిక్సల్ రిజల్యూషన్‌ దీని సొంతం. మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను ఇందులో 1.4GHz dual-core Samsung Exynos ప్రాససెర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది.

మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 16GB మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో‌ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకోవచ్చు. 1GB RAM ప్రత్యేకం. ఇక కెమెరా విషయానికి వస్తే మొబైల్ వెనుక భాగాన ఉన్న 8 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అందమైన వీడియోలను 1080p ఫార్మెట్లో తీయవచ్చు. మొబైల్ ముందు భాగాన ఉన్న విజిఎ కెమెరా సహాయంతో వీడియో కాలింగ్ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొని రావచ్చు. కమ్యూనికేషన్, కనెక్టివిటీ ఫీచర్స్ అయిన బ్లూటూత్, వై - పై లను కూడా ఇది సపొర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 2.3.5 ఐస్ క్రీమ్ శాండ్ విచ్‌తో రన్ అయ్యేటటువంటి ఈ స్మార్ట్‌ఫోన్ విడుదలపై మొబైల్ అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్‌అప్ అందించేందుకు గాను ఇందులో 1,600mAh బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది. 16జిబి మెమరీ కలిగిన 'మీజు ఎమ్‌ఎక్స్' స్మార్ట్ ఫోన్‌ని జనవరి 1, 2012న విడుదల చేయనున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot