5జీ సపోర్ట్‌తో మిజు ఎం3 నోట్!

Written By:

ప్రముఖ చైనా ఫోన్‌‍ల కంపెనీ మిజు 'M3 note' పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లలో విడుదల చేసింది. రెండు ర్యామ్ వేరియంట్‌లలో లభ్యంకానున్న ఈ ఫోన్‌లో 5జీ సపోర్ట్ ఫీచర్‌ను పొందుపరచటం విశేషం. పూర్తి మెటల్ బాడీతో వస్తోన్న ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌లో 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ స్కిన్‌తో వచ్చే Flyme ఆపరేటింగ్ సిస్టం, 1.8 గిగాహెర్ట్జ్ హీలియో పీ10 ఆక్టా కోర్ ప్రాసెసర్, 4,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి శక్తివంతమైన ఫీచర్లను మిజు పొందుపరిచింది.

5జీ సపోర్ట్‌తో మిజు ఎం3 నోట్!

రెండు ర్యామ్ వేరియంట్‌‍లలో ఈ ఫోన్‌ను అందుబాటులో ఉంచారు. 2జీబి ర్యామ్ వేరియంట్ 16జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోండగా, 3జీబి ర్యామ్ వేరియంట్ 32జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని మరింతగా విస్తరించుకునే అవకాశం. 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్ 4.0, యూఎస్బీ వంటి కనెక్టువిటీ ఆప్షన్స్‌ను ఈ ఫోన్ ప్రొవైడ్ చేస్తోంది. చైనా మార్కెట్లో 16జీబి వర్షన్ మిజు ఎం3 నోట్ ధర రూ.8,200గా ఉంది. 32జీబి వర్షన్ ధర రూ.10,300గా ఉంది. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది.

Read More : రూ.10,000 రేంజ్‌లో కేక పుట్టిస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మిజు ‘M3 note’ ప్రత్యేకతలు

మిజు ఎం3 నోట్ స్మార్ట్‌ఫోన్ పూర్తి మెటల్ యునిబాడీ డిజైన్‌‍తో వస్తోంది.

మిజు ‘M3 note’ ప్రత్యేకతలు

మిజు ఎం3 నోట్ స్మార్ట్‌ఫోన్ 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది. రిసల్యూషన్ సామర్థ్యం1920x 1080పిక్సల్స్.

 

మిజు ‘M3 note’ ప్రత్యేకతలు

రెండు ర్యామ్ వేరియంట్‌‍లలో ఈ ఫోన్‌ను అందుబాటులో ఉంచారు. 2జీబి ర్యామ్ వేరియంట్ 16జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోండగా, 3జీబి ర్యామ్ వేరియంట్ 32జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని మరింతగా విస్తరించుకునే అవకాశం.

మిజు ‘M3 note’ ప్రత్యేకతలు

మిజు ‘M3 note' ఫోన్ శక్తివంతమైన బ్యాకప్‌తో కూడిన 4,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది.

మిజు ‘M3 note’ ప్రత్యేకతలు

ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ స్కిన్‌తో వచ్చే Flyme ఆపరేటింగ్ సిస్టం పై  ‘M3 note' ఫోన్ రన్ అవుతోంది.

మిజు ‘M3 note’ ప్రత్యేకతలు

1.8 గిగాహెర్ట్జ్ హీలియో పీ10 ఆక్టా కోర్ ప్రాసెసర్ పై మిుజ ఎం3 నోట్ ఫోన్ రన్ అవుతుంది.

మిజు ‘M3 note’ ప్రత్యేకతలు

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. 

మిజు ‘M3 note’ ప్రత్యేకతలు

ఫింగర్ ప్రింట్ స్కానర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Meizu Launches M3 Note with 5G Support!.Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot