రూ.7,000లో బెస్ట్ బడ్జెట్ ఫోన్ ఏది..?

చైనా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ మిజు 'M3S' పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. స్నాప్‌డీల్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా లభ్యమవుతోన్న ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.7,999గా ఉంది.

రూ.7,000లో బెస్ట్ బడ్జెట్ ఫోన్ ఏది..?

ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన Xiaomi Redmi 3S ఫోన్‌కు ఈ డివైస్ డెరక్ట్ కాంపిటీటర్‌గా నిలిచింది. ఈ రెండు ఫోన్‌లకు సంబంధించి spec comparisonను ఇప్పుడు చూద్దాం...

Read More : వాట్సాప్‌కు షాకిచ్చిన Hike, అందుబాటులోకి వీడియో కాల్స్ ఆఫ్షన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మెటల్ బాడీతో

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు యునిబాడీ మెటల్ డిజైన్‌తో వస్తున్నాయి. రెడ్మీ 3ఎస్ ఫోన్ బరువు 144 గ్రాములుగా ఉండగా, మిజు ఎం3ఎస్ ఫోన్ బరువు 138 గ్రాములుగా ఉంది. ఈ రెండు ఫోన్లు ఫింగర్ ప్రింట్ సెన్సార్ సపోర్ట్‌తో వస్తున్నాయి.

2.5డి కర్వుడ్ గ్లాస్ సపోర్ట్‌తో

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు 720 పిక్సల్ క్వాలిటీ డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి. 2.5డి కర్వుడ్ గ్లాస్ సపోర్ట్‌తో మిజు M3S ఫోన్ ఆకట్టుకుంటుంది. రెడ్మీ 3ఎస్ ఫోన్‌లో ఈ సదుపాయం లోపించింది.

రెండు వేరియంట్‌లలో

ఈ హ్యాండ్‌సెట్‌లు రెండు రకాల ర్యామ్ వేరియంట్‌లలోలభ్యమవుతున్నాయి. వాటి వివరాలు పరిశీలించినట్లయితే..

మిజు ఎం3ఎస్

2జీబి + 16జీబి ఇంటర్సల్ స్టోరేజ్ వర్షన్ ధర రూ.7,999,
3జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్సల్ స్టోరేజ్ వర్షన్ ధర రూ.9,299

షియమీ రెడ్మీ 3ఎస్

2జీబి + 16జీబి ఇంటర్సల్ స్టోరేజ్ వర్షన్ ధర రూ.6,999,
3జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్సల్ స్టోరేజ్ వర్షన్ ధర రూ.8,999

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రాసెసర్ పరంగా చూస్తే..

ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి.. రెడ్మీ 3ఎస్ ఫోన్ 1.4గిగాహెర్ట్జ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 430 ఆక్టా‌కోర్ ప్రాసెసర్‌తో వస్తోంది. ఇదే సమయంలో మిజు ఎం3ఎస్ ఫోన్ 1.5గిగాహెర్ట్జ్ మీడియాటెక్ ఆక్టా‌కోర్ చిప్‌సెట్‌తో వస్తోంది.

కెమెరా విషయానికి వచ్చేసరికి

కెమెరా విషయానికి వచ్చేసరికి ఈ రెండు స్మార్ట్ ఫోన్ లు 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫసింగ్ కెమెరాలతో వస్తున్నాయి. మిజు ఎం3ఎస్ ఫోన్ లో ఏర్పాటు చేసిన రేర్ కెమెరా డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యాన్ని కలిగి ఉంటుంది. ఇదే సమయంలో రెడ్మీ 3ఎస్ రేర్ కెమెరా కేవలం సింగ్ ఎల్ఈడి ఫ్లాష్ ను కలిగి ఉంది.

VoLTE సపోర్ట్,

డ్యుయల్ సిమ్ కనెక్టువిటీతో వస్తోన్న ఈ రెండు ఫోన్‌లలో VoLTE ఫీచర్ ఉంది. జియో నెట్‌వర్క్‌ను సమర్థవంతంగా సపోర్ట్ చేస్తాయి. మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ ద్వారా ఈ ఫోన్‌లకు సంబంధించిన స్టోరేజ్‌ను 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి రెడ్మీ 3ఎస్ ఫోన్ శక్తివంతమైన 4,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ యూనిట్‌తో వస్తోంది. ఇదే సమయంలో మిజు ఎం3ఎస్ ఫోన్ 3020 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది.

ఆపరేటింగ్ సిస్టం విషయానికి వచ్చేసరికి

ఆపరేటింగ్ సిస్టం విషయానికి వచ్చేసరికి మిజు ఎం3ఎస్ ఫోన్ ఆండ్రాయిడ్ 5.0.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ఇదే సమయంలో షియోమీ రెడ్మీ ఎస్ ఫోన్ ఆండ్రాయిడ్ 6.0.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది.

హెడ్ టు హెడ్ తలపడుతున్నాయి....

స్పెసిఫికేషన్స్ పరంగా ఈ రెండు ఫోన్‌లు హెడ్ టు హెడ్ తలపడుతున్నాయి. ప్రాసెసింగ్ పరంగా మిజు ఎం3ఎస్ ఫోన్ ఆకట్టుకుంటుంటే బ్యాటరీ బ్యాకప్ పరంగా రెడ్మీ 3ఎస్ ఫోన్ ఆకట్టుకుంటోంది. ధర విషయానికి వచ్చేసరికి మిజు ఎం3ఎస్ తో పోలిస్తే రూ.1000 తక్కువకే రెడ్మీ 3ఎస్ ఫోన్ దొరుకుతోంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Meizu M3S vs Xiaomi Redmi 3S: The Battle for the Best Budget Smartphone. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot