మిజు 3జీబి ర్యామ్ ఫోన్, రూ.6,999కే

చైనా స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీ మిజు మరో బడ్జెట్ ఫ్రెండ్లీ బ్లాక్ బస్టర్ స్మార్ట్‌ఫోన్‌తో మార్కెట్లోకి దూసుకువచ్చింది. Meizu M5 పేరుతో ఈ బ్రాండ్ లాంచ్ చేసిన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను రెండు ర్యామ్ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది.

మిజు 3జీబి ర్యామ్ ఫోన్, రూ.6,999కే

మొదటి వేరియంట్ వచ్చే సరికి 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ధర రూ.6,999. రెండవ వరియంట్ వచ్చే సరికి 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తోంది. ధర రూ.8,900.

Read More : మీ ఫోన్‌లో Jio నెట్ స్పీడ్ తగ్గుతోందా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ మినిమల్ డిజైన్

Meizu M5 ఫోన్ 2.5డి కర్వుడ్ గ్లాస్‌తో కూడిన 5.2 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లేతో రాబోతోంది. పాలీకార్బోనేట్ మెటీరియల్‌తో డిజైన్ చేయబడిన ఈ ఫోన్ మింట్ గ్రీన్, గ్రాసియర్ వైట్, చాంపేన్ గోల్డ్, సఫైర్ బ్లూ, మాటీ బ్లాక్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

కెమెరా విషయానికి వచ్చేసరికి

Meizu M5 ఫోన్ డ్యుయల్ టోన్ ఎల్ఈడి ప్లాష్, ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ వంటి ప్రత్యేకతలతో కూడిన 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో రాబోతోంది. ఫోన్ ముందు భాగంలో పొందుపరిచిన 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ద్వారా క్వాలిటీ సెల్పీలను చిత్రీకరించుకోవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీడియాటెక్ ఎంటీ6750 ప్రాసెసర్

మిజు ఎం5 ఫోన్ మీడియాటెక్ ఎంటీ6750 ఆక్టా కోర్ ప్రాసెసర్ పై రన్ అవుతుంది. మాలీ టీ860 జీపీయూ ఫోన్ గ్రాఫిక్ విభాగాన్ని చూసుకుంటుంది.

శక్తివంతమైన 3070 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

మిజు ఎం5 ఫోన్ శక్తివంతమైన 3070 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో రాబోతోంది. కనెక్టువిటీ ఫీచర్లు వచ్చేసరికి 4జీ ఎల్టీఈ విత్ VoLTE సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్ 4.0, జీపీఎస్ ఇంకా ఏ-జీపీఎస్ సపోర్ట్.

హైబ్రీడ్ డ్యుయల్ సిమ్

మింజు ఎం5 ఫోన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తోంది. హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ స్లాట్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం ఉంటుంది. 16జీబి ఇంకా 32జీబి స్టోరేజ్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

ఆపరేటింగ్ సిస్టం..

ఆపరేటింగ్ సిస్టం విషయానికి వచ్చేసరికి మిజు ఎం5 ఫోన్ ఆండ్రాయిడ్ ఆధారంగా డిజైన్ చేసిన Flyme OS 5.5 యూజర్ ఇంటర్‌ఫేస్ పై రన్ అవుతుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Meizu M5: Everything You Need to Know About the Latest Budget Smartphone. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot