6 జీబీ ర్యామ్‌, 128 జీబి స్టోరేజ్‌తో కొత్త ఫోన్

Written By:

ఇప్పటివరకూ 2, 3 జీబి ర్యామ్‌లను కలిగి ఉన్న స్మార్ట్‌ఫోన్లను చూశాం. 6జీబీ ర్యామ్ ఫోన్ ఎప్పుడైనా చూశామా.. ఇంతకు ముందు చైనాకు చెందిన వివో సంస్థ 6 జీబీ ర్యామ్‌తో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి తీసుకువస్తోందని వార్తలు గుప్పుమన్నా అది కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు తాజాగా మరో చైనా మొబైల్ సంస్థ మైజూ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ సామర్ధ్యంతో కూడిన స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ప్రో 6 సీరిస్‌లో భాగంగా ఇది విడుదలవుతుందని దీంతో పాటు 4జీబీ ర్యామ్ ,64 జీబీతో సెకండ్ మోడల్ కూడా ఉంటుందని సమాచారం. ఈ మేరకు సోషల్ మీడియాలో రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. మరి ఫీచర్స్ కూడా ఆ రేంజ్‌లోనే ఉన్నాయని సమాచారం.

Read more: ఈసారి శాంసంగ్‌దే రికార్డు : రెండురోజులు..లక్ష ఫోన్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వైఫై తదుపరి వర్షన్ హైఫై 3.0

వైఫై తదుపరి వర్షన్ హైఫై 3.0

దీనిలో 1080x1920 పిక్సెల్ డిస్ ప్లే ఉంటుందని, వైఫై తదుపరి వర్షన్ హైఫై 3.0, ఫాస్ట్ చార్జింగ్ సౌకర్యంతో లభించే ఫోన్ ఫ్లైయ్ మీ ఆపరేటింగ్ సిస్టమ్ సాయంతో పనిచేస్తుందని తెలుస్తోంది.

ఎక్సీనస్ 7420 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఇందులో ఉంటుందని సమాచారం

ఎక్సీనస్ 7420 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఇందులో ఉంటుందని సమాచారం

శాంసంగ్ తయారు చేసిన ఎక్సీనస్ 7420 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఇందులో ఉంటుందని సమాచారం. ప్రో-6 సిరీస్‌లో ఫోన్ల ధరలు రూ. 30 వేల నుంచి రూ. 40 వేల మధ్య ఉంటాయని అంచనా. సెప్టెంబర్ లో ఇండియాలా లాంచ్ అయ్యే అవకాశం.

3డీ టచ్

3డీ టచ్

6 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజి, 4జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజి ( మరొక మోడల్ ) 3డీ టచ్. ఇది ఐ ఫోన్ 6ఎస్ లో ఉంటుంది. అలాగే హైఫై 3.0 , ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ.

ప్రో 5 కూడా త్వరలోనే ఇండియాలో రిలీజ్ అయ్యే అవకాశం

ప్రో 5 కూడా త్వరలోనే ఇండియాలో రిలీజ్ అయ్యే అవకాశం

ప్రో 5 కూడా త్వరలోనే ఇండియాలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మైజూ ప్రో 5లో 5.7 అమోల్డ్ కెపాక్టివ్ టచ్ స్క్రీన్, 1,080x1,920 ఫిక్సల్, 168 గ్రాముల బరువు, రెండు కలర్లలో లభిస్తుంది.

4 జిబి ర్యామ్, 64 జిబి ఇంటర్నల్ మెమొరీ

4 జిబి ర్యామ్, 64 జిబి ఇంటర్నల్ మెమొరీ

ఒకటి 3 జిబి ర్యామ్, 32 జిబి ఇంటర్నల్ మెమొరీ, మరొకటి 4 జిబి ర్యామ్, 64 జిబి ఇంటర్నల్ మెమొరీ. ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్, ఎక్సాన్స్ 7420 ప్రాసెసర్, Mali-T760MP8 GPU, విస్తరణ సామర్ధ్యం 128 జిబి

21 మెగా ఫిక్సల్ కెమెరా

21 మెగా ఫిక్సల్ కెమెరా

21 మెగా ఫిక్సల్ కెమెరా f/2.2 aperture, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా , నాన్ రిమూవబుల్ Li-Ion 3,050mAh బ్యాటరీ.

ఇండియాలో రూ. 28,990 ఉండే అవకాశం

ఇండియాలో రూ. 28,990 ఉండే అవకాశం

దీని ధర ఇండియాలో రూ. 28,990 ఉండే అవకాశం ఉంది. అదే టైంలో ప్రో 6 కూడా కొంచెం అటు ఇటులో ఉండే అవకాశం కూడా ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Meizu Pro 6 Tipped to Sport 6GB of RAM, 128GB Storage
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting