8జీబి ర్యామ్‌తో చైనా ఫోన్, సరికొత్త లోహంతో?

ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ మిజు (Meizu) సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. Meizu Pro 7 పేరుతో రాబోతున్న ఈ ఫోన్ సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ తరహాలో డ్యుయల్ కర్వ్ డిస్‌ప్లేను కలిగి ఉండబోతోందట.

Read More : మీ స్మార్ట్‌ఫోన్‌ను మీరే తయారు చేసుకోండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టైటానియమ్ లోహంతో

తాజాగా లీక్ అయిన మరో రూమర్ ప్రకారం మిజు ప్రో 7 టైటానియమ్ లోహంతో రూపుదిద్దుకుంటోందట. ఇదే గనుకు నిజమైతే టైటానియమ్ మెటల్ బిల్డ్ తో రానున్న మొట్టమొదటి ఫోన్ గా మిజు ప్రో 7 నిలుస్తుంది.

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ తరహాలో...

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ తరహాలో కనిపిస్తోన్న ఈ ఫోన్‌కు సంబంధించి అన్‌అఫీషియల్ స్పెసిఫికేషన్స్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Meizu Pro 7 స్పెసిఫికేషన్స్ (అన్ అఫీషియల్)

5.7 అంగుళాల 4కే డిస్‌ప్లే, 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ Sony IMX362 సెన్సార్, ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 6జీబి, 8జీబి), 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మీడియాటెక్ హీలియో ఎక్స్30 64 బిట్ డెకా కోర్ ప్రాసెసర్. మార్కెట్లో 8జీబి ర్యామ్ వేరియంట్‌ మిజు ప్రో 7 ధర రూ.38,000గా ఉండొచ్చు, 6జీబి వేరియంట్ ధర రూ.30,700గా ఉండొచ్చు.

మిజు ప్రో 6

మిజు ఇప్పటికే ప్రో 6 (Pro 6) పేరుతో డెకా కోర్ ప్రాసెసర్‌ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. (10-కోర్) డెకా కోర్ ప్రాసెసర్‌తో వస్తోన్న ఈ ఫోన్ 21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వంటి శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. చైనా మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ.26,000. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Meizu Pro 7 rumored to sport titanium alloy. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot