Just In
- 56 min ago
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- 2 hrs ago
వివో X90 ప్రో స్మార్ట్ ఫోన్లు ఇండియాలో లాంచ్ అయింది! ధర ,స్పెసిఫికేషన్లు!
- 7 hrs ago
కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్ తో మీ ఫోన్ ను వెబ్ కెమెరా లాగా వాడొచ్చు
- 19 hrs ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
Don't Miss
- News
Student: క్లాస్ మధ్యలో వెళ్లిపోయి హాస్టల్ లో ఉరి వేసుకున్న కాలేజ్ అమ్మాయి, అసలు ఏం జరిగింది ?
- Lifestyle
కఫం, గొంతునొప్పి మరయు గొంత ఇన్ఫెక్షన్ తరిమికొట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే మిరియాల కషాయం... ఇంట్లోనే తయారీ
- Sports
Asia Cup 2023 : ఆసియా కప్ వేదిక మార్పుపై మీటింగ్.. గ్యారంటీ అంటున్న బీసీసీఐ!
- Finance
Vijaya Dairy: విజయ డైరీ నుంచి మరో 100 కొత్త ఉత్పత్తులు..
- Movies
Butta Bomma Review తెలుగుదనం ఉట్టిపడే బుట్టబొమ్మ.. ప్లస్, మైనస్‌లు ఏమిటంటే?
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
డ్యూయెల్ డిస్‌ప్లేతో తొలిసారిగా మిజు ప్రొ 7, బడ్జెట్ ధర, పరిమిత స్టాకు..
చైనా దిగ్గజం మిజు ఇండియాలో సైలెంట్‌గా తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్ మిజు ప్రొ 7ను లాంచ్ చేసింది. కంపెనీ నుంచి వస్తున్న ఫస్ట్ డ్యూయెల్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం గమనార్హం. కంపెనీ ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఈ ఫోన్ విడుదల చేసి ఆ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపింది. అయితే పరిమిత సంఖ్యలో మాత్రమే ఈ ఫోన్లను అందుబాటులో ఉంచినట్లు కంపెనీ తెలిపింది. ఆసక్తి ఉన్న వారు అమెజాన్ ద్వారా ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. కాగా ఈ ఫోన్లు అమెజాన్లో మూడవపార్టీ ITECH ద్వారా అమ్మకానికి రానున్నాయి. దీని ధరను కంపెనీ రూ.22,999గా నిర్ణయించింది. 4జిబి ర్యామ్ 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ తో వచ్చిన ఈ ఫోన్ పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండటం.. డ్యూయెల్ డిస్ ప్లే కావడంతో హాట్ కేకుల్లా అమ్ముడుపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ పూర్తి ఫీచర్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

మెయ్‌జు ప్రొ 7 ఫీచర్లు
5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.9 ఇంచ్ సెకండరీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 240 x 536 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

ప్రొ 7 ప్లస్ పేరుతో..
కాగా గతేడాది చైనాలో ప్రొ 7 ప్లస్ పేరుతో ఓ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. దీన్నే ఇప్పుడు ఇండియా మార్కెట్లోకి ప్రొ7 పేరుతో తీసుకొచ్చింది. డ్యూయెల్ స్క్రీన్ తో ప్రధాన ఆకర్షణగా ఈ ఫోన్ అక్కడి మార్కెట్లో దూసుకుపోయింది.

1.9-inch secondary Super AMOLED display
notifications, weather, time, music లాంటివి ఓ స్క్రీన్లో డిస్ ప్లే అయితే మరొక స్క్రీన్ ద్వారా సెల్పీలు లాంటివి తీసుకునే విధంగా రూపొందించారు. సెకండరీ స్క్రీన్ 1.9-inch secondary Super AMOLED displayగా ఉంది.

12 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను..
వెనుక భాగంలోనే 12 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటికి బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ ఆప్షన్‌ను అందిస్తున్నారు. అలాగే ముందు భాగంలో 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంది. దీంతో తీసుకునే సెల్ఫీలు క్వాలిటీని కలిగి ఉంటాయి. ఫోన్‌ను మొత్తం యూనిబాడీ మెటల్ డిజైన్‌తో రూపొందించారు.

కేవలం బ్లాక్ రంగులో మాత్రమే .
మెయ్‌జు ప్రొ 7 స్మార్ట్‌ఫోన్ కేవలం బ్లాక్ రంగులో మాత్రమే అందుబాటులో ఉంది. రూ.22,999 ధరకు ఈ ఫోన్‌ను అమెజాన్ సైట్ నుంచి వినియోగదారులు ప్రత్యేకంగా కొనుగోలు చేయవచ్చు. అయితే ప్రస్తుతం ఈ ఫోన్‌ను పరిమిత సంఖ్యలోనే విక్రయిస్తున్నారు. కనుక ఫోన్ కావాలనుకునే వారు త్వరగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470