Meizu Zero.. ఈ ఫోన్ ఖరీదు రూ.92,000, ప్రత్యేకతలెన్నో..
మిజు (Meizu) బ్రాండ్ అభివృద్ధి చేసిన ప్రపంచపు మొట్టమొదటి హోల్‌లెస్ ఫోన్ మిజు జీరో (Meizu Zero) ఇప్పుడు ప్రీ-ఆర్డర్ పై లభ్యమవుతోంది.
మిజు (Meizu) బ్రాండ్ అభివృద్ధి చేసిన ప్రపంచపు మొట్టమొదటి హోల్‌లెస్ ఫోన్ మిజు జీరో (Meizu Zero) ఇప్పుడు ప్రీ-ఆర్డర్ పై లభ్యమవుతోంది. ఖరీదు1,299 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో ఈ విలువ షుమారుగా రూ.92,000). ప్రముఖ క్రౌడ్‌ఫండింగ్ ఫ్లాట్‌ఫామ్ ఇండిగోగో ద్వారా ఈ డివైస్‌ను ఆర్డర్ చేసుకోవచ్చు.

మిజు జీరో స్మార్ట్‌ఫోన్‌లో పోర్ట్స్, బటన్స్ అనేవి కనిపించవు. ఇదే సమయంలో ఈ ఫోన్‌లో ఎటువంటి హోల్స్ కూడా ఉండవు. ఆధునిక టెక్నాలజీల మేళవింపుతో రూపుదిద్దుకున్న ఈ ప్రయోగాత్మక స్మార్ట్‌ఫోన్ గురించి పలు ఆసక్తికర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మిజు జీరో స్మార్ట్‌ఫోన్‌కు
మిజు జీరో స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన క్రౌడ్‌ఫండింగ్ ప్రచారం ప్రస్తుతం కొనసాగుతోంది. మార్చి 1వ తేదీతో ఈ ప్రచారం ముగుస్తుంది. కేవలం 100 యూనిట్లు మాత్రమే ఈ ప్రచారంలో అందుబాటులో ఉంటాయి. 100 యూనిట్లలో ఇప్పటికే 16 యూనిట్లు బుక్ అయిపోయినట్లు సమాచారం. ఈ ప్రచారం ద్వారా మొత్తం 100000 డాలర్లను సేకరించాలని మిజు భావిస్తోంది.

సామ్‌సంగ్ గెలాక్సీ స్9 తరహాలో మిజు జీరో కూడా
సామ్‌సంగ్ గెలాక్సీ స్9 తరహాలో మిజు జీరో కూడా కర్వుడ్ సైడ్స్, సిరామిక్ బాడీ, ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్‌తో స్లిమ్ టాప్ ఇంకా బోటమ్ బిజెల్స్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లో 5.99 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ అమోల్డ్ డిస్‌ప్లేను హౌస్ చేసారు. ఈ డిస్‌ప్లేలో ఇన్‌బిల్ట్‌గా ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎక్విప్ అయి ఉంటుంది. ఈ స్ర్కీన్ ఎమ్‌సౌండ్ 2.0 అనే టెక్నాలజీని ఉపయోగించుకుని హై-క్వాలిటీ సౌండ్‌ను ఉత్పత్తి చేస్తుంది.

వైర్‌లెస్ ఛార్జింగ్ ద్వారా
మైక్రోఫోన్స్ ఫోన్ బోటమ్ ఎడ్జ్‌లో హైడ్ కాబడి ఉంటాయి. వైర్‌లెస్ ఛార్జింగ్ ద్వారా అ ఫోన్‌ను ఛార్జ్ చేసుకోవల్సి ఉంటుంది. సిమ్ కార్డ్ స్లాట్ స్థానంలో ఈ-సిమ్ స్లాట్‌ను ఉపయోగించుకోవల్సి ఉంటుంది. ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి మిజు జీరో స్నాప్‌డ్రాగన్ 845 చిప్‌సెట్ పై రన్ అవుతుంది. ర్యామ్, స్టోరేజ్ ఇంకా బ్యాటరీ విభాగాలకు సంబంధించిన వివరాలు రివీల్ కావల్సి ఉంటుంది. కెమెరా విషయానికి వచ్చేసరికి ఈ వెనుక భాగంలో 12 మెగా పిక్సల్ + 20 మెగా పిక్సల్ సెన్సార్స్ కాంభినేషన్‌లో డ్యుయల్ సెన్సార్స్ ఎక్విప్‌ను చేసారు. ఫోన్ ముందు భాగంలో 20 మెగా పిక్సల్ సెల్ఫీ స్నాపర్‌ను అమర్చారు.


Click it and Unblock the Notifications








