ఐఫోన్ 8లో నచ్చేవేంటి, నచ్చనివేంటి

By: BOMMU SIVANJANEYULU

ఐఫోన్ 7కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా ఆపిల్ కంపెనీ అందుబాటులోకి తీసుకువచ్చిన ఐఫోన్ 8 ఇప్పటికే మార్కెట్లో హల్‌చల్ చేస్తోంది. స్పెసిఫికేషన్స్ పరంగా ఈ ఫోన్ మెప్పించగలిగినప్పటికి డిజైనింగ్ పరంగా పాత పద్థతిని అనుసరించింది. భారీ అంచనాల మధ్య మార్కెట్లో లాంచ్ అయిన ఐఫోన్ 8లో ఉత్సాహపరిచిన ఫీచర్లతో పాటు నిరుత్సాహపరిచిన అంశాల పై ప్రత్యేక విశ్లేషణ...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐఫోన్ 8లో సూపర్ స్పీడ్ ప్రాసెసర్

ఐఫోన్ 8కు ప్రధాన హైలైట్ ప్రాసెసర్. ఈ డివైస్‌లో అమర్చిన A11 Bionic chipset సూపర్ స్పీడ్ ప్రాసెసింగ్‌ను ఆఫర్ చేయగలుగుతోంది. చిప్‌సెట్‌లోని సిక్స్-కోర్ సీపీయూ, సిక్స్-కోర్ జీపీయూ, ఎమ్11 మోషన్ కోప్రాసెసర్లు హైక్వాలిటీ పనితీరును ఆఫర్ చేస్తున్నాయి.

యాపిల్ కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం ఐపోన్ 8లో పొందపరిచిన ఏ11 చిప్‌సెట్ టాప్ స్పీడ్‌లో 25% రెట్టింపు వేగాన్ని ఆఫర్ చేయగలుగుుతంది. మల్టీటాస్కింగ్ సమయంలో ఇధి 70 శాతం అదనపు వేగాన్ని అందుకోగలుగుతంది.

స్టన్నింగ్ డిస్‌ప్లే

ఐఫోన్ 8కు మరో ప్రధానమైన హైలైట్ డిస్‌ప్లే. ఈ ఫోన్‌లో అమర్చిన 4.7 అంగుళాల ఎల్ఈడి బ్యాక్‌లైట్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే 65.6% స్ర్కీన్ టు బాడీ రేషియోను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లేలో వినియోగించిన ట్రో టోన్ టెక్నాలజీ అన్ని సందర్భాల్లో కచ్చితమైన కలర్ బ్యాలన్స్‌ను నిర్థారించగలుగుతుంది.

క్వాలటీ కెమెరా

ఐఫోన్ 8కు మరో ప్రధానమైన హైలైట్ కెమెరా. ఈ ఫోన్‌లో సెటప్ చేసిన 12 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ కెమెరా f/1.8 అపెర్చుర్‌, అప్టికల్ ఇమేజ్ స్టెబిలైషన్ వంటి ప్రత్యేకతలతో ప్రొఫెషనల్ క్వాలిటీ పోటోగ్రఫీని ఆఫర్ చేస్తుంది.

ఫోన్ ముందు భాగంలో అమర్చిన 7 మెగా పిక్సల్ కెమెరా f/2.2 అపెర్చుర్‌‌తో స్టన్నింగ్ సెల్ఫీలను ప్రొవైడ్ చేస్తుంది. ఏ11 బయోనికో ప్రాసెసర్ సహాయంతో ఈ కెమెరాలు నాణ్యమైన క్వాలిటీ పిక్సల్ ప్రాసెసింగ్‌తో పాటు లో-లైట్ ఆటో ఫోకస్ ఇంకా నాయిస్ రిడక్షన్‌ను అందించగలుగుతున్నాయి.

జియో దెబ్బకు విలవిల, భారీగా నష్టపోయిన దేశీయ కంపెనీ

విప్లవాత్మక వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్..

ఐఫోన్ 8కు మరో ప్రధానమైన హైలైట్ వైర్‌లెస్ ఛార్జింగ్. ఈ ఫోన్ 7.5వాట్ స్టాండర్డ్‌తో కూడిన క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీంతో వైర్లు సహాయం లేకుండా ఐఫోన్ 8ను చార్జ్ చేసుకునే వీలుటుంది. ఈ ఫెసిలిటీని కల్పించే క్రమంలో మెటల్ బ్యాక్ ప్యానల్‌ను గ్లాస్ బ్యాక్ ప్యానల్‌తో రీప్లేస్ చేసారు.

డిజైన్ పరంగా నిరుత్సాహపరుస్తుంది

ఐఫోన్ 8 డిజైనింగ్ పరంగా నిరుత్సాహపరుస్తుంది. ఈ ఫొన్ ను చూడగానే ఐఫోన్ 6ఎక్స్ ను చూసిన భావన కలుగుతుంది. ఐఫోన్ 7తో పోలిస్తే కాస్తంత పెద్దగా కనిపించే ఐఫోన్ 8 చేతికి బల్కీగా అనిపిస్తుంది.

ధర కాస్తంత ఎక్కువే..?

ధర పరంగా ఐఫోన్ 8 మార్కెట్ కు షాకిచ్చింది. ఈ ఫోన్ కు సంబంధించిన 64జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.64,000గానూ, 256జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.77,000గాను ఉంది. సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఈ ఫోన్ అందని ద్రాక్షే అని చెప్పక తప్పదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Merits and demerits of upgrading to iPhone 8 from iPhone 7. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting