ఈ కేస్ వాడితే ఐఫోన్ కాస్తా ఆండ్రాయిడ్ ఫోన్‌లా మారిపోతుంది
ఐఫోన్ యూజర్లకు ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్...
ప్రముఖ ఈ-కామర్స్ స్టార్టప్ Yerha.com సరికొత్త స్మార్ట్ ఐఫోన్ కేస్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. Jijia's Mesuit పేరుతో ఈ కేస్ అందుబాటులో ఉంటుంది. ధర రూ.9,999.

ఫోన్ యూజర్లకు ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్..
ఈ ఐఫోన్ కేస్ అదనపు బ్యాటరీ, అదనపు స్టోరేజ్, అదనపు సిమ్ కార్డ్ స్లాట్‌తో పాటు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంను ఆఫర్ చేస్తుంది. ఐఫోన్ యూజర్లకు ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆఫర్ చేయటమే ఈ కేస్ ముఖ్య ఉద్దేశ్యం.

ఐఫోన్ 6, ఐఫోన్ 6ఎస్ యూజర్లకు మాత్రమే
ఈ కేస్ ప్రస్తుతానికి ఐఫోన్ 6, ఐఫోన్ 6ఎస్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. మీస్యూట్ కేస్ ఐఫోన్‌కు డ్యుయల్ సిమ్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. కేస్‌లో నిక్షిప్తం చేసిన 1700mAh ఇన్‌బిల్ట్ బ్యాటరీ ఫోన్‌కు అదనంగా 7 గంటల బ్యాటరీ లైఫ్‌ను యాడ్ చేస్తుంది. కేస్‌లో పొందురిచిన 16జీబి ఇన్‌బిల్ట్ స్టోరేజ్ కూడా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని పెంచుతుంది.

Mesuit app కంట్రోల్‌లో...
ఐఫోన్‌ను ఈ కేస్‌కు అటాచ్ చేసిన వెంటనే ఫోన్ కంట్రోల్ మొత్తం Mesuit app చేతుల్లోకి వెళ్లిపోతోంది. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తీసుకోవల్సి ఉంటుంది.

ఐఫోన్‌లో మిస్ అయిన ఆండ్రాయిడ్ యాప్స్‌ను..
ఆండ్రాయిడ్ ఆధారిత Mesuit OS 1.0 పై ఈ కేస్ రన్ అవుతుంది. ఈ ఆండ్రాయిడ్ ఇంటర్‌ఫేస్ ద్వారా ఐఫోన్‌లో మిస్ అయిన ఆండ్రాయిడ్ యాప్స్‌ను వినియోగించుకునే వీలుంటుంది. అలానే ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి అకౌంట్‌లను రెండేసి చొప్పున ఉపయోగించుకునే వీలుంటుంది.


Click it and Unblock the Notifications








