ఇన్‌స్టాగ్రామ్‌లో ఆత్మహత్యల కోసం వెతికితే ఏం జరుగుతుంది?
సోషల్ మీడియా వినియోగం పెరుగుతోంది. ముఖ్యంగా మెటాకు (Meta) చెందిన ఇన్‌స్టా వంటి (Instagram) ప్లాట్‌ఫాంలను చిన్నారులు సైతం ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే దీని వల్ల మంచితోపాటు చెడు ప్రభావం కూడా ఉంటోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు సోషల్ మీడియాపై పరిమితులు విదిస్తున్నాయి. ఇప్పటికే చాలా దేశాలు చిన్నారుల సోషల్ మీడియా వినియోగంపై ఆంక్షలు అమలు చేస్తున్నాయి.
చిన్నారుల సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణ కోసం ఇప్పటికే ఆస్ట్రేలియా కీలక చర్యలు తీసుకుంటుండగా.. బ్రిటన్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. దీంతోపాటు స్పెయిన్, స్లోవేనియా, గ్రీస్ వంటి దేశాలు కూడా చిన్నారుల భద్రత కోసం చర్యలు తీసుకొనే విధంగా ఆలోచన చేస్తున్నాయి.

మరో సూపర్ ఫీచర్ :
ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్ కూడా సొంతంగా అనేక ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే టీన్స్ అకౌంట్స్ తోపాటు పేరెంటల్ కంట్రోల్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే చిన్నారుల భద్రత దృష్ట్యా మరో ఫీచర్‌ను ప్రకటించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆత్మహత్యలు లేదా స్వయంగా హానిచేసుకొనే అంశాల గురించి సెర్చ్ చేస్తే.. ఆ వివరాలు వెంటనే తల్లిదండ్రులకు తెలుస్తాయి.
తల్లిదండ్రులను వెంటనే అలెర్ట్ చేస్తుంది :
చిన్నారుల ఖాతాల్లో పేరెంటల్ కంట్రోల్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకున్న తల్లిదండ్రులకు ఈ సమాచారం అలెర్ట్ రూపంలో చేరుతుంది. దీంతోపాటు ఈ తరహా సెర్చ్‌లను కట్టడి చేసే విధంగా ఇన్‌స్టా చర్యలు తీసుకుంటుంది. వచ్చే వారం అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుందని తెలిపింది.
సెట్టింగ్స్ మార్చాలన్నా.. అనుమతి కావాల్సిందే :
ఇన్‌స్టా్లో అసభ్యకరమైన, హానికర కంటెంట్ నుంచి చిన్నారులకు రక్షణ కల్పించేందుకు వీలుగా ఈ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు మెటా చెబుతోంది. దీంతోపాటు 16 ఏళ్లలోపు చిన్నారులు ఇన్‌స్టా అకౌంట్ సెట్టింగ్స్ మార్చాలన్నా కూడా తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అయ్యేలా రూల్స్‌లో మార్పులు చేసింది.
ఈ ఫీచర్లు భారత్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. టీన్స్, పేరెంటల్ ఫీచర్లు కూడా తొలుత అమెరికా వంటి దేశాల్లో అందుబాటులోకి తీసుకొచ్చిన కొన్ని నెలలకు భారత్‌లో తీసుకొచ్చారు. చిన్నారుల కోసం తీసుకొచ్చిన ఈ ఫీచర్ కూడా భారత్‌లో త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇండియాలో ఈ ఫీచర్ తీసుకురావడంపై ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.
మెటాకు చెందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం త్వరలో సిమ్ బైడింగ్ ఫీచర్‌ను తీసుకురానున్నట్లు తెలిపింది. అంటే బ్యాంకింగ్ యాప్స్ తరహాలో రిజిస్టర్డ్ సిమ్ కార్డు ఫోన్‌లో ఎల్లప్పుడూ ఉంటేనే ఆయా నంబర్లపై వాట్సాప్ పనిచేస్తుంది. దీంతోపాటు వెబ్ లేదా ఇతర లింక్డ్ డివైజ్‌లో ప్రతి 6 గంటలకు లాగౌట్ కానుంది. సైబర్ నేరాల నుంచి భద్రత కోసం వాట్సాప్ తరహా మెసేజింగ్ ప్లాట్‌ఫాంలు ఈ తరహా సిమ్ బైండింగ్ నిబంధనలను అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫిబ్రవరి 1 వ తేదీ వరకు గడువు విధించింది.


Click it and Unblock the Notifications








