Xiaomi 8వ వార్షికోత్సవం,అభిమానులకు 8తో అదిరిపోయే గిఫ్ట్ !

మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న చైనా దిగ్గజం షియోమి 8వ వార్షికోత్సవంలోకి అడుగుపెడుతోంది.

|

మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న చైనా దిగ్గజం షియోమి 8వ వార్షికోత్సవంలోకి అడుగుపెడుతోంది. ఈ వార్షికోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకునేందుకు షియోమి రెడీ అయింది. ఇందులో భాగంగానే యూజర్లకు మరో అదిరిపోయో బహుమానాన్ని సరికొత్త స్మార్ట్ ఫోన్ రూపంలో అందించనుంది. ఈ వార్షికోత్సవ సందర్భంగా వచ్చే వారం ఎంఐ సిరీస్‌లో కొత్త ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని షియోమి ఇప్పటికే ధృవీకరించేసింది. మే 31న ఎంఐ 8 లాంచ్‌ ఈవెంట్‌ను షియోమి నిర్వహిస్తున్నట్లుగా తెలిపింది.

3జిబి ర్యామ్ 4జీ వోల్ట్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.74,99 మాత్రమే,ఫుల్‌ వ్యూ డిస్‌ప్లేతో..3జిబి ర్యామ్ 4జీ వోల్ట్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.74,99 మాత్రమే,ఫుల్‌ వ్యూ డిస్‌ప్లేతో..

ఎంఐ 8 స్మార్ట్‌ఫోన్‌

ఎంఐ 8 స్మార్ట్‌ఫోన్‌

అప్‌కమింగ్‌ లాంచ్‌పై ధృవీకరణ చేసిన షియోమి, ఎంఐ 6 సక్సెసర్‌గా ఎంఐ 7ను లాంచ్‌ చేయనుందనే విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దాని బదులు 8వ వార్షికోత్సవ సందర్భంగా ఎంఐ 8 స్మార్ట్‌ఫోన్‌నే తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది.

ఫేస్‌ ఐడీకి ధీటుగా

ఫేస్‌ ఐడీకి ధీటుగా

ఇందులో ఆపిల్‌ ఫేస్‌ ఐడీకి ధీటుగా 3డీ ఫేసియల్‌ సెన్సింగ్‌ టెక్నాలజీతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ లాంచ్‌ చేయబోతున్నట్టు రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. వైబోలో టీజర్‌ ఇమేజ్‌ను పోస్టు చేసిన కంపెనీ ఎంఐ 8 లాంచింగ్‌ను ధృవీకరించింది.

ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌

ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌

షియోమీ విడుదల చేయనున్న ఎంఐ 8 స్మార్ట్‌ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను డిస్‌ప్లే కిందే ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే వివో తన నూతన స్మార్ట్‌ఫోన్లలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఇలా డిస్‌ప్లే కిందే ఏర్పాటు చేయగా, ఆ కోవలోకి ఇప్పుడు షియోమీ కూడా వచ్చి చేరనుంది.

మే 31న

మే 31న

కంపెనీ గ్లోబల్‌ అధికార ప్రతినిధి దోనోవాన్‌ సంగ్‌ కూడా ప్రత్యేకంగా మరో ట్వీట్‌ చేసి కొత్త లాంచింగ్‌ను ప్రకటించారు. ‘మేము 8వ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. షెన్జెన్‌లో మే 31న తమ వార్షిక ఫ్లాగ్‌షిప్‌ ప్రొడక్ట్‌ ఎంఐ 8ను లాంచ్‌ చేస్తున్నాం' అని సంగ్‌ ట్వీట్‌ చేశారు. కంపెనీ ఇప్పటికే ఈ ఈవెంట్‌కు సంబంధించిన టిక్కెట్లను విక్రయించడం ప్రారంభించింది.

షియోమి ఎంఐ 8 రూమర్‌ స్పెషిఫికేషన్లు

షియోమి ఎంఐ 8 రూమర్‌ స్పెషిఫికేషన్లు

క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 845 ఎస్‌ఓసీ, ఓలెడ్ డిస్‌ప్లే, 8జీబీ ర్యామ్‌,256/512జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారిత ఎంఐయూఐ 10 ఓఎస్, డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. కాగా ఈ ఫోన్ ప్రారంభ దర రూ.34వేలుగా ఉండనున్నట్లు సమాచారం.

ఎంఐ 6 మార్కెట్లో..

ఎంఐ 6 మార్కెట్లో..

ఈ ఫోన్ వన్ ప్లస్ 6కి గట్టి పోటీనిచచ్చే అవకాశం ఉందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా కంపెనీ ఎంఐ 7ను మార్కెట్లోకి తీసుకువస్తుందా లేదా అనేదానిపై ఇంకా ఎటువంటి ప్రకటనా చేయలేదు. ఇప్పటికే ఎంఐ 6 మార్కెట్లో సత్తా చాటుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

షియోమీ ఎం ఐ6

షియోమీ ఎం ఐ6

ఎంఐ6 ఫోన్ 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ వేరియెంట్లలో విడుదల అయింది.4 జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.20,525, 6 జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.24,278 గా ఉంది.
షియోమీ ఎం ఐ6ఫీచర్లు

5.15 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్రెజర్ సెన్సిటివ్ డిస్‌ప్లే
గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్
64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 7.1.1 నూగట్, డ్యుయల్ సిమ్
12 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ
డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2
ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి
3000 ఎంఏహెచ్ బ్యాటరీ

షియోమీ ఎంఐ 6ఎక్స్

షియోమీ ఎంఐ 6ఎక్స్

బ్లాక్, బ్లూ, రెడ్, గోల్డ్, రోజ్ గోల్డ్ రంగుల్లో విడుదలైన షియోమీ ఎంఐ 6ఎక్స్ మన దగ్గర మూడు వేరియెంట్లలో లభ్యం కానుంది. 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.16,910 ధరకు, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.19,025 ధరకు, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.21,140 ధరకు వినియోగదారులకు లభ్యం అవుతున్నాయి.

షియోమీ ఎంఐ 6ఎక్స్ ఫీచర్లు...

షియోమీ ఎంఐ 6ఎక్స్ ఫీచర్లు...

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, యూఎస్‌బీ టైప్ సి, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, 3010 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.

Best Mobiles in India

English summary
Xiaomi has announced May 31 as the launch date for the Mi 8 and the company is working on its own 3D facial recognition technology More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X