ఈ ఫోన్ 3 నిమిషాలకే అవుట్ ఆఫ్ స్టాక్

Written By:

కొత్త కొత్త ఫీచర్లతో అద్బుతమైన స్మార్ట్‌ఫోన్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్న చైనా మొబైల్‌ మేకర్‌ షియోమి మరోసారి స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దుమ్మురేపింది. ఈ కంపెనీ తాజా హై ఎండ్‌ వెర్షన్‌ మి మిక్స్ 2 డివైస్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడు పోయింది. బెజెల్‌-లెస్‌ డిస్‌ప్లేతో విడుదలైన షియోమి ఎంఐ మిక్స్‌ 2 ఫోన్‌ విక్రయానికి ఉంచిన కేవలం మూడు నిమిషాల్లోపే పూర్తి అమ్మకాలను సాధించింది. దీంతో తదుపరి సేల్‌ అక్టోబర్‌ 24ను చేపట్టనున్నట్టు కంపెనీ తెలిపింది.

వాట్సప్‌లోకి మరో కొత్త ఫీచర్, యాక్టివేట్ చేసుకోవడం చాలా సింపుల్‌

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ.కాం ద్వారా తొలిసారిగా..

రూ.35,999కు ఎంఐ మిక్స్‌2 స్మార్ట్‌ఫోన్‌ గత వారం భారత్‌లో విడుదలైంది. ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ.కాం ద్వారా తొలిసారిగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను అక్టోబర్‌ 17న విక్రయానికి ఉంచింది. ​ కాగా గతంలో కూడా షియోమి స్మార్ట్‌ఫోన్లు నిమిషాల వ్యవధిలోనే రికార్డు అమ్మకాలను సాధించిన సంగతి తెలిసిందే.

ఎంఐ మిక్స్‌2 ఫీచర్లు

5.99 అంగుళాల డిస్‌ప్లే
2.4 గిగాహెడ్జ్‌ ఆక్టా-కోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్‌
6జీబీ/8జీబీ ర్యామ్‌
64జీబీ/128జీబీ, 256జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
12 ఎంపీ రియర్‌ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్‌ ఫేసింగ్‌ కెమెరా
ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌
3400 ఎంఏహెచ్‌ బ్యాటరీ

డిస్కౌంట్‌

హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో కొనుగోలుచేస్తే 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ను, ఒకవేళ ఫోన్‌ పే ద్వారా కొనుగోలు చేస్తే 20 శాతం క్యాష్‌బ్యాక్‌ను, యాక్సిస్‌ బ్యాంకు బుజ్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 5 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తున్నారు.

12 నెలల పాటు హంగామా మ్యూజిక్‌ ఉచితం

ఎంఐ. కామ్‌లో అయితే కంపెనీ 12 నెలల పాటు ఉచితంగా హంగామా మ్యూజిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది.

బెజెల్ లెస్ ఎల్‌సిడి డిస్‌ప్లే

కాగా ఈ ఫోన్ 5.99-inch బెజెల్ లెస్ ఎల్‌సిడి డిస్‌ప్లేతో వచ్చింది.ఈ తరహా స్ర్కీన్‌తో వచ్చే ఫోన్ ముందు భాగం దాదాపుగా డిస్‌ప్లేతో కవర్ అయి ఉంటుంది. అంచులు అనేవి చాలా సన్నగా ఉంటాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Mi Mix 2 sold out in less than three minutes on Flipkart & Mi.com, claims Xiaomi More News At Gizbot Telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting