Snapdragon 845 SoCతో షియోమి నుంచి తొలి స్మార్ట్‌ఫోన్..

ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ షియోమి భారతీయ విపణిలో దూసుకుపోతోంది. ఆ కంపెనీ నుంచి వచ్చిన ప్రతి ఫోన్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతోంది.

|

ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ షియోమి భారతీయ విపణిలో దూసుకుపోతోంది. ఆ కంపెనీ నుంచి వచ్చిన ప్రతి ఫోన్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతోంది. దక్షిణి కొరియా శాంసంగ్ ను ఇండియాలోసవాల్ చేస్తూ ముందుకెళుతోంది. ఈ కంపెనీ నుంచి ఈ మధ్య వచ్చిన రెడ్‌మి నోట్‌ 5, రెడ్‌మి నోట్‌ 5 ప్రోలు రికార్డు స్థాయి అమ్మకాలతో దూసుకుపోయిన విషయం అందిరికీ తెలిసిందే. ఈ ఫోన్లు ఫ్లాష్ సేల్ కి వచ్చిన ప్రతీసారి నిమిషాల వ్యవధిలోనే అమ్ముడువుతున్నాయి. అసలు సేల్‌ ఎప్పుడు ప్రారంభమైందో.. కూడా తెలియకుండా 'సోల్డ్‌ అవుట్'అని దర్శనమిస్తుండటంతో చాలామంది నిరాశతో మరో ఫ్లాష్ సేల్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ ఊపులోనే కంపెనీ మరో ఫోన్ లాంచ్ చేసేందుకు రెడీ అయింది.

Facebookలోకి వాయిస్ క్లిప్ ఫీచర్, టైపింగ్ చేయడం మరచిపోండి !Facebookలోకి వాయిస్ క్లిప్ ఫీచర్, టైపింగ్ చేయడం మరచిపోండి !

ఎంఐ మిక్స్‌2ఎస్‌ పేరుతో..

ఎంఐ మిక్స్‌2ఎస్‌ పేరుతో..

షియోమి మరో ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ను ఎంఐ మిక్స్‌2ఎస్‌ పేరుతో భారత మార్కెట్లోకీ తీసుకువస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్‌ 845 ప్రాసెసర్‌తో దూసుకువస్తోందని తెలుస్తోంది.

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌9..

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌9..

ఇటీవలే శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌9, గెలాక్సీ ఎస్‌9+లను విడుదల చేయగా, సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్‌2, ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్‌2 కాంపాక్ట్‌ లను విడుదల చేశాయి. ఈ నేపథ్యంలో వాటికి దీటుగా షియోమి ఎంఐ మిక్స్‌ 2ఎస్‌ను తీసుకొస్తోంది.

టీజర్‌ ఇప్పటికే..

టీజర్‌ ఇప్పటికే..

ఈ ఫోన్‌నుకు సంబంధించిన టీజర్‌ ఇప్పటికే సామాజిక మాధ్యమాల వేదికగా హల్‌చల్‌ చేస్తోంది. అయితే తొలుత దీనిపై స్పందించడానికి ఇష్టపడని షియోమి.. ఆ తర్వాత ఫోన్‌ తీసుకొస్తున్న సంగతి నిజమేనని తెలిపింది.

మార్చి 27న జరిగే కార్యక్రమంలో..

మార్చి 27న జరిగే కార్యక్రమంలో..

కాగా మార్చి 27న జరిగే కార్యక్రమంలో ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. గతేడాది సెప్టెంబరులో విడుదలైన ఎంఐ మిక్స్‌2కు కొనసాగింపుగా ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు.

8జీబీ ర్యామ్‌, 256 జీబీ మెమొరీ

8జీబీ ర్యామ్‌, 256 జీబీ మెమొరీ

ఆపిల్‌ ఐఫోన్‌ టెన్‌లాగా డిస్‌ప్లే టాప్‌లో నాచ్‌ (సెల్ఫీ కెమెరా, రిసీవర్‌, ప్రాక్సెమిటీ సెన్సర్‌ ఉండే ప్రాంతం) ఉంటుందట. 5.99 అంగుళాల తాకేతెర, 8జీబీ ర్యామ్‌, 256 జీబీ మెమొరీ, 12 మెగాపిక్సెల్‌ డ్యూయల్‌ కెమెరా, 4400 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం, ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉంటాయని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. దీని ధర సుమారు రూ. 40 వేలు ఉంటుందని సమాచారం. కృత్రిమ మేథస్సు ఆధారంగా పనిచేసే ఫేస్‌ రికగ్నిషన్‌ సౌకర్యాన్ని ఈ ఫోన్లో అందిస్తున్నట్లు సమాచారం.

Best Mobiles in India

English summary
Mi MIX 2s to Sport Snapdragon 845 SoC, Xiaomi Reconfirms in Video Teaser More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X