మైక్రోమాక్స్ 4జీ స్మార్ట్‌ఫోన్ జూన్‌లో..?

Posted By:

మైక్రోమాక్స్  4జీ స్మార్ట్‌ఫోన్ జూన్‌లో..?

సామ్‌సంగ్.. హెచ్‌టీసీ.. నోకియా వంటి అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలకు ముచ్చెటమలు పట్టిస్తున్న దేశవాళీ మొబైల్‌ఫోన్‌ల తయారీ కంపెనీ మైక్రోమాక్స్‌కు సంబంధించి మరో పిడుగులాంటి వార్త వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తోంది. తాజా వ్యూహరచనలో భాగంగా మైక్రోమాక్స్ తన మొట్టమొదటి 4జీ స్మార్ట్‌ఫోన్‌ను అతిత్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు @LeaksterInc ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడైంది. భారీ అంచనాలతో జాన్‌లో విడుదలకాబోతున్న మైక్రోమాక్స్ 4జీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. మైక్రోమాక్స్ 4జీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి అనధికారికంగా వెల్లడైన పలు స్పెసిఫికేషన్‌ల వివరాలను గిజ్‌బాట్ మీకు ప్రత్యేకంగా అందిస్తోంది.

4జీ కనెక్టువిటీ,
సింగిల్ సిమ్ సపోర్ట్,
ఎన్-విడియా టెగ్రా 4ఐ ప్రాసెసర్,
4.7 అంగుళాల తాకే తెర (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot